‌బీఎస్ఎన్ఎల్ రంజాన్ తోఫా.. ఈ 786 ప్లాన్‌

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ రంజాన్ ప‌ర్వదినం సంద‌ర్భంగా త‌మ క‌స్ట‌మ‌ర్లంద‌రికీ ఓ ప్ర‌త్యేక‌మైన ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది.  లాక్డౌన్ సంద‌ర్భంగా ఇంటికే ప‌రిమిత‌మై పండ‌గ చేసుకుంటున్న ముస్లిం సోద‌రులు త‌మ బంధుమిత్రుల‌తో పండ‌గ ఆనందాన్ని ఫోన్‌లో అయినా పంచుకోవ‌డానికి వీలుగా ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రంజాన్ తోఫాగా బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ఈ

ప్లాన్ విశేషాలేమిటంటే.. 
రూ.786తో రీఛార్జి చేస్తే
రూ.786తో ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకోవాలి.  

* 786 రూపాయల పూర్తి టాక్‌టైం ల‌భిస్తుంది 

* 30 జీబీ హైస్పీడ్ డేటా వ‌స్తుంది. 

 * వ్యాలిడిటీ 90 రోజులు .  

నెల రోజులే అందుబాటులో
ఇది ఒక ప్ర‌మోష‌న‌ల్ ప్లాన్‌.   నెల‌రోజుల‌పాటు మాత్ర‌మే ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. అంటే జూన్ 23 వ‌ర‌కే ఉంటుంది. అది కూడా  ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ టెలికం స‌ర్కిల్స్‌లో మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉందని బీఎస్ఎన్ఎల్ ప్ర‌క‌టించింది.
 

‌BSNL Ramzan Special plan BSNL Ramzan Special 786 recharge plan బీఎస్ఎన్ఎల్ రంజాన్ తోఫా  బీఎస్ఎన్ఎల్‌ 786 ప్లాన్‌