విమానం ఎక్కాలంటే బస్సెక్కినంత ఈజీ అయితే కాదు..బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. దానికోసం గంట ముందు వెళ్లి చెక్ ఇన్ అయి విమానంలోకి వెళ్లి కూర్చోవాలి. ఇదంతా ఓ ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. అలవాటైన వారికి కూడా ఒక్కోసారి ఇది గందరగోళమే. మాటిమాటికీ ఎయిర్‌పోర్ట్‌లో అడగాలన్నా కొద్దిగా ఇబ్బందే. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ సేవలన్నీ మీకు అందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో పనిచేసే రోబోను తీసుకొస్తోంది విస్తారా ఎయిర్‌లైన్స్.దేశంలో తొలిసారిగా విమానయాన సేవల్లో ప్రయాణికులకు ఉపయోగపడబోతున్న ఈ రోబోకు రాడా అని పేరు పెట్టింది.
బోర్డింగ్ ఇక ఈజీ
టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్ అయిన విస్తారా ఎయిర్‌లైన్స్ రాడా రోబోను ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని విస్తారా ఎయిర్‌లైన్స్ సిగ్నేచర్ లాంజ్‌లో అందుబాటులోకి తీసుకురానుంది. జులై 5 నుంచి ఈ రోబో ప్రయాణికులకు సేవలందిస్తుందని విస్తారా ప్రకటించింది. బోర్డింగ్‌కు ముందు కావల్సిన సేవలన్నీ ఈ రోబో అందిస్తుంది. నాలుగు వీల్స్‌తో నడిచే ఈ రోబో 360 డిగ్రీల్లో చుట్టూ తిరగగలదు. రాడాకు 3 ఇన్–బిల్ట్ కెమెరాలు, మంచి క్వాలిటీ వాయిస్ టెక్నాలజీ ఏర్పాటు చేశారు. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో ఈ రోబోను తయారుచేశామని విస్తారా ప్రకటించింది.
ఏమేం చేస్తుందంటే..
* ప్రయాణికుల సందేహాలను పరిష్కరిస్తుంది. బోర్డింగ్ పాస్‌లను స్కాన్ చేస్తుంది.
* లాంజ్‌లో అటూ ఇటూ తిరుగుతూ ప్రయాణికులను పలకరిస్తుంది.
* ఫ్లైట్ స్టేటస్‌ను ప్రయాణికులకు తెలియజేస్తుంది.
* పిల్లలకు గేమ్స్, పెద్దవాళ్లకు మ్యూజిక్, వీడియోలు అందించి వాళ్లను ఉల్లాసపరుస్తుంది.
* మీరు వెళ్లే ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో చెప్పేస్తుంది.
దీన్ని కొన్నాళ్లపాటు ఆపరేట్ చేశాక ప్రయాణికుల ఫీడ్‌బ్యాక్‌ను బట్టి మరిన్ని మార్పులు చేస్తామని విస్తారా చెబుతోంది.
Vistara’s new AI-powered robot RADA Visthara Air lines Signature lounge Rada Robo బోరà±à°¡à°¿à°‚à°—à± à°ªà±à°°à°¾à°¸à±†à°¸à± చూసà±à°•à±à°¨à±‡ తొలి రోబో..రాడా విసà±à°¤à°¾à°°à°¾ ఎయిరà±â€Œà°²à±ˆà°¨à±à°¸à± రాడా Â