విమానం ఎక్కాలంటే ఎంత హంగామా? బోర్డింగ్ పాస్, విదేశాలకు వెళ్లాలంటే పాస్పోర్ట్, వీసా ఇలా పేపర్లన్నీ చేత్తో పట్టుకుని క్యూలో నిల్చుని అవన్నీ ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్లు చెక్ చేశాక అప్పుడుగానీ విమానం ఎక్కలేం. విమానంలో ప్రయాణం కంటే ఈ బోర్డింగ్ పాస్ల వెరిఫికేషన్కే ఒక్కోసారి ఎక్కువ టైం పడుతుంది. వీటన్నింటికీ చెక్ పెడుతూ బయోమెట్రిక్తో పనిచేసే డిజి యాత్ర ఐడీని క్రియేట్ చేశారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీస్ ఆఫ్ ఇండియా, ఇండియాలోని నాలుగు ప్రధాన విమానాశ్రయాలతో కలిపి దీన్ని డిజైన్చేసింది. దీంతో మీరు టికెట్స్, బోర్డింగ్ పాస్, ఐడీ కార్డులు పట్టుకెళ్లాల్సిన శ్రమ తప్పుతుంది.
ఏంటీ డిజియాత్ర ఐడీ?
సింపుల్గా చెప్పాలంటే ఇది పేపర్లెస్ బోర్డింగ్ ప్రాసెస్. మీరు ఒక్కసారి మీ డిటెయిల్స్ ఎంటర్ చేయించుకుని మీ వేలిముద్రలు ఇస్తే చాలు. మీ డేటా అంతా దానిలో రికార్డ్ అవుతుంది. ఈసారి మీరు ఇండియాలో ఏ ఎయిర్పోర్ట్ నుంచి ట్రావెల్ చేయాలన్నా జస్ట్ సెక్యూరిటీ చెక్ దగ్గర మీ వేలిముద్ర వేస్తే చాలు. దీంతో బోర్డింగ్ పేపర్లు చేత్తో పట్టుకుని గంటల తరబడి లైన్లో నిలబడాల్సిన శ్రమ తప్పుతుంది. క్షణాల్లో బయోమెట్రిక్ ఎంటర్చేసి నిముషాల్లో సెక్యూరిటీ చెక్ దాటి చక్కగా విమానం ఎక్కేయొచ్చు. ఇందులో విశేషమేమిటంటే దీనికి ఎలాంటి ఐడీ కార్డ్ ఆఖరికి ఆధార్ కార్డ్ కూడా అవసరం లేదు.
ఎలా పనిచేస్తుందో చూడండి
1.పేపర్లెస్ బోర్డింగ్ కావాలనుకునే ప్రయాణికులు AirSewa పోర్టల్లోకి వెళ్లి, డిజియాత్ర ఐడీని క్రియేట్ చేసుకోవాలి.
2. ఆధార్ లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డుతో దీన్ని వెరిఫై చేసుకోండి.
3. ప్రయాణికులు టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడే డిజియాత్ర ఐడీని ఎంటర్ చేస్తే ఎయిర్పోర్ట్లో బయోమెట్రిక్ ఎంటర్ చేసి నేరుగా వెళ్లి ఫ్లైట్ ఎక్చేయవచ్చు. టికెట్స్, బోర్డింగ్ పాస్లు,ఐడీ కార్డ్లు ఏవీ చూపించాల్సిన పని లేదు. ఒకవేళ మీరు టికెట్ బుక్ చేసేటప్పుడు డిజి యాత్ర ఐడీ ఎంటర్ చేయకపోతే ఎయిర్పోర్ట్లో ఐఆర్ఐఎస్, ఫింగర్ప్రింట్ స్కాన్తో బయోమెట్రిక్ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు.
4. ఒక్కసారి మీరు ఇది పూర్తి చేస్తే బయోమెట్రిక్ డేటా ఎయిర్పోర్ట్ సర్వర్లో స్టోరవుతుంది. తర్వాతసారి ప్రయాణంలో జస్ట్ వేలిముద్రతో మీ చెక్ ఇన్, చెక్ అవుట్ క్షణాల్లో కంప్లీట్ చేసుకోవచ్చు.
5. బయోమెట్రిక్స్తోపాటు డిజియాత్ర మీకు ఒక క్యూఆర్ కోడ్ కూడా ఇస్తుంది. దీన్నిచెక్ ఇన్కు, పేపర్లెస్ బోర్డింగ్ పాస్గా కూడా వాడుకోవచ్చు.
6. మనం టికెట్ కొనేముందే డిజియాత్ర ఐడీ ఎంటర్ చేస్తే ఎయిర్పోర్ట్ మన ఫ్లైట్ టైమ్, బోర్డింగ్ పాస్ చెక్ ఇన్ కౌంటర్ ఎన్నింటికి క్లోజ్ అవుతుంది వంటి డిటెయిల్స్తో ఎప్పటికప్పుడు అలర్ట్స్ కూడా పంపిస్తుంది.
Biometrics-Based DigiYatra ID  Paperless Boarding in flights డిజియాతà±à°° à°à°¡à±€ పేప‌రà±â€Œà°²à±†à°¸à± బోరà±à°¡à°¿à°‚à°—à±â€Œ Â