కరోనా దెబ్బతో 5 నెలలుగా ఢిల్లీ మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన అన్లాక్ 4 గైడ్లైన్స్లో మెట్రో సర్వీసులు సెప్టెంబర్ 7 నుంచి నడుపుకోవచ్చని చెప్పింది. దీంతో ఢిల్లీ మెట్రోను పట్టాలెక్కించడానికి కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పాట్లు మొదలుపెట్టింది. దాదాపు 25 లక్షల మంది ప్రయాణికులు ప్రతిరోజూ ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తారు. ఇంతమంది వచ్చేచోట టికెట్లు తీసుకోవడం ఇదంతా వైరస్ సోకడానికి అవకాశాలెక్కువ. అందుకే మనుషులతో ఏ మాత్రం అవసరం లేని జీరో హ్యూమన్ ఇంటర్వెన్షన్ మెట్రోకార్డ్ను అందుబాటులోకి తెచ్చారు.
ఏమిటీ కార్డ్ స్పెషల్?
* ఆటో పే అనే ఆండ్రాయిడ్ యాప్తో ఈ కొత్త స్మార్ట్ కార్డ్ లింకయి ఉంటుంది. ఆటో పే (Auto Pe) యాప్ లేదా వెబ్సైట్ ద్వారా మీరు ఈ కార్డును ఆర్డర్ చేసుకోవాలి. మీ ఇంటికే డోర్ డెలివరీ చేస్తారు.
* కార్డ్ నెంబర్ను ఆటో పే యాప్లో ఎంటర్ చేసి మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లేదా యూపీఐ నెంబర్తో లింక్ చేయాలి.
* దీనిలో ఆటో టాప్ అప్ ఫీచర్ ఉంటుంది. అంటే మీ మెట్రో కార్డులో బ్యాలన్స్ 100 రూపాయలకంటే తగ్గితే ఆటోమేటిగ్గా200 రూపాయల రీఛార్జ్ చేస్తుంది. మీరు యాప్లో రిజిస్టర్ చేసిన డెబిట్/ క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ అకౌంట్ నుంచి ఆ అమౌంట్ కట్ అవుతుంది.
* అంతేకాదు ఇలా ఆటో టాప్ చేసినప్పుడు 5% డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
* ఈ కార్డును కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. మీరు కార్డు ఆర్డర్ చేసేటప్పుడే మీ పేరు, ఫోటో యాడ్ చేసి 150 రూపాయలు అదనంగా పే చేస్తే మీ పేరు, ఫోటోతో కొత్త స్మార్ట్ కార్డ్ వస్తుంది.
ఉపయోగమేంటి?
ఇంతకు ముందు ఢిల్లీ మెట్రో యూజర్లు స్మార్ట్ కార్డ్ వాడేవారు. అయితే దాన్ని మెట్రో స్టేషన్లలో యాడ్ వాల్యూ మిషన్స్ (ఏవీఎం)ల్లో స్వైప్ చేసి టాప్ అప్ చేసుకోవాల్సి ఉంటుంది. కొవిడ్ భయం ఉన్న పరిస్థితుల్లో అసలు కార్డును ఎవరూ తాకే పని లేకుండా, బ్యాలన్స్ ఉందా లేదా అని మనం చేసుకునే పని లేకుండా ఈ కొత్త జీరో ఇంటర్వెన్షన్ మెట్రో కార్డును తీసుకొచ్చారు. ఢిల్లీ మెట్రో నడిపినా టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈ కొత్త కార్డు చాలా ఉపయోగంగా ఉండబోతుంది.
Delhi Metro  Zero Human intervention Metro Card Delhi Metro  Zero Human intervention Metro Card Auto Pe app ఢిలà±à°²à±€ మెటà±à°°à±‹ కారà±à°¡à± ఢిలà±à°²à±€ మెటà±à°°à±‹ జీరో à°¹à±à°¯à±‚మ‌నౠఇంట‌రà±à°µà±†à°¨à±à°·â€Œà°¨à± మెటà±à°°à±‹ కారà±à°¡à± జీరో à°¹à±à°¯à±‚మ‌నౠఇంట‌రà±à°µà±†à°¨à±à°·â€Œà°¨à± మెటà±à°°à±‹ కారà±à°¡à±