ప్రివ్యూ - ఏమిటీ ఫైర్ ఫాక్స్ ప్రైవేట్ నెట్‌వ‌ర్క్‌?

ప‌బ్లిక్ వైఫై వాడుతున్నామంటే మ‌న డివైజ్‌ల‌కు ఎప్పుడూ ప్ర‌మాదం పొంచి ఉన్న‌ట్లే,. మ‌నం బ‌య‌ట‌కు వెళ్లినప్పుడో లేదా అవ‌స‌ర‌మైన సంద‌ర్భాల్లో పబ్లిక్ వైఫై వాడుతుంటారు. అయితే ఇవి అంత సెక్యూర్ కాద‌న్న సంగ‌తి అంద‌రికి తెలుసు. ఈ నేప‌థ్యంలో ప‌బ్లిక్ వైపై నెట్‌వ‌ర్క్‌ల నుంచి మన డివైజ్‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డం కోసం ఫైర్‌ఫాక్స్ ప్రైవేట్ నెట్‌వ‌ర్క్ ఉప‌యోగిస్తున్నారు. మ‌రి ఏంటి దీని ప్ర‌త్యేక‌త‌?

సెక్యూర్ క‌నెక్ష‌న్
ప‌బ్లిక్ వైఫై వ‌ల్ల ఉండే ఇబ్బందుల‌ను ప్రమాదాల‌ను అధిగ‌మించ‌డం కోసం వ‌చ్చిందే ఫైర్ ఫాక్స్ ప్రైవేట్ నెట్‌వ‌ర్క్‌. ప్రస్తుతం అమెరికాలో దీన్ని బేటా వెర్ష‌న్‌గా ఉప‌యోగిస్తున్నారు.  ఇందుకోసం ఒక లింక్‌ను ఇస్తోంది ఫైర్ ఫాక్స్ ప్రైవేట్ నెట్‌వ‌ర్క్‌. ఈ లింక్‌ను క్లిక్ చేస్తే  ఫైర్ ఫాక్స్ ప్రైవేట్ నెట్‌వ‌ర్క్ హోం పేజీకి తీసుకెళ్తుంది. మీ డెస్క్ టాప్‌పై మొజిల్లా బ్రౌజ‌ర్‌లో ఒక ఎక్స్‌టెన్ష‌న్‌ను ఏర్పాటు చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తుంది. యునైటెడ్ స్టేట్స్‌లో ప‌బ్లిక్ వైఫై వాడుతున్న వాళ్లు ఫైర్ ఫాక్స్ ప్రైవేట్ నెట్‌వ‌ర్క్‌ను ఎక్కువ‌గా యూజ్ చేస్తున్నారు. 

ఎలా వాడాలంటే..
ఫైర్ ఫాక్స్ ప్రైవేట్ నెట్‌వ‌ర్క్‌ను విజ‌య‌వంతంగా మీ కంప్యూట‌ర్‌లో యాడ్ చేసుకున్న త‌ర్వాత మీ అడ్రెస్ బార్‌లో మీకు క‌నిపిస్తుంది. అక్క‌డ నుంచి మీరు ఫైర్ ఫాక్స్ ప్రైవేట్ నెట్‌వ‌ర్క్‌ను వాడుతూ టాగిల్ ద్వారా అన్ అండ్ ఆఫ్ చేసుకోవ‌చ్చు. ఈ ఎక్స్‌టెన్ష‌న్ వాడాలంటే ముందు మీ మొజిల్లా అకౌంట్లో లాగిన్ కావాల్సి ఉంటుంది. గ్రీన్ లైట్ వ‌స్తే ఫైర్ ఫాక్స్ ప్రైవేట్ నెట్‌వ‌ర్క్ ఆన్ లో  ఉన్న‌ట్లు.. ఎల్లో వ‌స్తే అటెన్షన్ కావాల‌ని అర్ధం, ఫేడెడ్ వ‌స్తే ఫైర్ ఫాక్స్ ప్రైవేట్ నెట్‌వ‌ర్క్ ఆఫ్‌లో ఉంద‌ని భావం. సెక్యూర్ క‌నెక్ష‌న్ కోసం ఫైర్ ఫాక్స్ ప్రైవేట్ నెట్‌వ‌ర్క్‌ను త్వ‌ర‌లోనే భార‌త్‌లోనూ యూజ్ చేసే అవ‌కాశాలున్నాయి.

ENCRYPT PUBLIC WIFI FIREFOX PRIVATE NETWORK SECURE CONNECTION