ప్రివ్యూ.. ఏమిటీ గూగుల్ పిగ్ వీడ్‌?

టెక్ దిగ్గ‌జం గూగుల్ కొత్త ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ (ఓఎస్‌)ను తీసుకురాబోతుందా?  క్రోమ్ ఓఎస్‌తో పీసీలు, ల్యాపీల‌ను ఫిదా చేసి.. ఆండ్రాయిడ్‌తో మొబైల్ ఫ్లాట్‌ఫామ్‌పైనా చెర‌గ‌ని ముద్ర వేసిన గూగుల్ ఇప్పుడు  మ‌రో కొత్త ఓఎస్‌ను మార్కెట్‌కు ప‌రిచ‌యం చేయ‌బోతోంది. గూగుల్ పిగ్‌వీడ్‌గా చెబుతున్న ఈ కొత్త ఓఎస్ ఎలాంటి సంచల‌నాలు రేప‌బోతుందో చూడాలి మ‌రి.  

కంప్యూట‌ర్ ఓఎస్సేనా?
యూఎస్ ట్రేడ్‌మార్క్ అప్లికేష‌న్స్‌లో ఉన్న స‌మాచారాన్ని బ‌ట్టి  ఈ కొత్త ఓఎస్‌కు గూగుల్‌.. గూగుల్ పిగ్‌వీడ్ అని నామ‌క‌ర‌ణం చేసిన‌ట్లు స‌మాచారం. దీన్ని కంప్యూట‌ర్ సాఫ్ట్‌వేర్‌గానే ట్రేడ్‌మార్క్‌కు అప్ల‌యి చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇంత‌కుమించి పిగ్‌వీడ్‌కు సంబంధించి స‌మాచారం బ‌య‌టికి లీక్ కాలేదు.

పిగ్‌వీడ్ గురించి కొన్ని అంచ‌నాలు
అఫీషియ‌ల్‌గా పిగ్‌వీడ్ గురించి గూగుల్ ఎలాంటి స‌మాచారాన్ని లీక్ చేయ‌డం లేదు.  అయితే దీని గురించి టెక్నాల‌జీ స‌ర్కిళ్ల‌లో ఉన్న కొన్ని అంచ‌నాలివీ.

* పిగ్‌వీడ్ అంటే  ఓ మొక్క‌..  దీన్ని తినొచ్చు.చాలా పోష‌కాహారం. ఆ పేరును గూగుల్ ఎందుగా ఎంచుకుందో తెలియ‌దు. 

*  కొన్ని పిగ్‌వీడ్ మొక్క‌లు బాగా ఎదిగాక చ‌నిపోయ‌తా. వాటిలోని విత్త‌నాల‌ను అవే వెద‌జ‌ల్లుతాయి. అలా టెక్నాల‌జీని స్ప్రెడ్ చేస్తాం అని చెప్ప‌డానికే పిగ్‌వీడ్ అనే పేరును త‌న కొత్త ఓఎస్‌కు గూగుల్ పెట్టాల‌నుకుంటోందని ఓ అంచ‌నా.  

* గూగుల్ ఇప్ప‌టికే త‌యారుచేస్తున్న ఫ‌చ్సియా ఓఎస్‌కు, పిగ్‌వీడ్‌కు ఏమ‌న్నా సంబంధం ఉందా అని కొంద‌రు ఆలోచిస్తున్నారు.

* గూగుల్ క్రోమియ‌మ్‌కి రెస్పిరేట‌రీగా పిగ్‌వీడ్‌ను గూగుల్ రంగ‌లోకి దింపుతోంద‌ని మ‌రో అంచ‌నా. 

* అయితే గూగుల్ ఎలాంటి స‌మాచారాన్ని బ‌య‌టికి రానివ్వ‌క‌పోవ‌డంతో పిగ్‌వీడ్ ఓఎస్‌ను దేనికి ఉప‌యోగిస్తుంద‌న్న‌ది ప్ర‌స్తుతానికి మిస్ట‌రీగానే ఉంది.  

Google pigweed Google OS Google operating system గూగుల్ పిగ్‌వీడ్ గూగుల్ కొత్త ఓఎస్‌ గూగుల్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌