ఇంటర్నెట్ చౌకయ్యే కొద్దీ దాని వినియోగం పెరిగిపోయింది. అన్ని పనులకూ ఇంటర్నెట్ మీద ఆధారపడడంతో మన డేటా అంతా నెట్ గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఇదే హ్యాకర్ల పాలిట వరమయింది. మాల్‌వేర్లు,స్పైవేర్లతో డేటాను దొంగిలించే సైబర్ నేరగాళ్లకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పెద్ద పెద్ద కంపెనీలు కూడా డేటా చోరీని అడ్డుకోలేకపోతున్నాయి. ఇలాంటి సమస్యకు గూగుల్ చెబుతున్న పరిష్కారమే టైటాన్ సెక్యూరిటీ కీ. ఈ కీతోనే గూగుల్ తన ఉద్యోగుల డేటాను 2017 నుంచి ఇప్పటివరకు అత్యంత సురక్షితంగా ఉంచుకోగలిగింది. అలా తన సొంత అవసరాల కోసం తయారుచేసుకున్న టైటాన్ సెక్యూరిటీ కీని ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తెస్తోంది గూగుల్.
ఎలా పని చేస్తుంది?
గూగుల్ టూ స్టెప్ వెరిఫికేషన్‌లో లాగిన్ అయ్యేటప్పుడు పాస్‌వర్డ్‌తోపాటు మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని కూడా ఎంటర్ చేయాలి. అయితే ఈ టైటాన్ సెక్యూరిటీ కీలో ఓటీపీకి బదులు ఈ కీ మీద ఒకసారి ట్యాప్ చేయాలి. అప్పుడే లాగిన్ అవగలుగుతారు. అంటే తాళం చెవి ఉంటేనే తాళం తెరుచుకున్నట్లుగా ఈ కీని మీరు ల్యాపీ లేదా సిస్టమ్‌కు ఇన్‌సర్ట్ చేస్తేనే లాగిన్ అవగలుగుతారు. మీరు లాగిన్ అయిన ప్రతిసారి ఓటీపీ నెంబర్ వచ్చి దాన్ని చూసి మీరు ఆ కోడ్ ఎంటర్ చేయడం లాంటి ఇబ్బందులేవీ ఉండవు. ఒకవేళ ఫోన్ అందుబాటులో లేకపోయినా కూడా ఈ కీతో మీరు లాగిన్ కావచ్చు. ఈ సెక్యూరిటీ కీ ఏ డివైస్ లేదా యాప్‌కయినా పని చేస్తుంది. కాబట్టి డేటా విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన కంపెనీలు, వ్యక్తులు ఎవరైనా దీన్ని వాడుకోవచ్చు.
ఎలా సెట్ చేసుకోవాలి?
1. గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి.
2. టూ స్టెప్ వెరిఫికేషన్ సెక్షన్‌లోకి ఎంటర్ అవ్వండి. ఇక్కడ మీరు కీ యాడ్ చేసుకోవచ్చు.
3. ఇప్పుడు మీరు ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేశాక గూగుల్ కీ మీద ఉన్న బటన్‌ను టాప్ చేస్తే సురక్షింతగా మీ అకౌంట్లోకి లాగిన్ అవుతారు.
ఇవీ ధరలు
టైటాన్ సెక్యూరిటీ కీ రెండు వేరియంట్స్‌లో లభిస్తుంది. యూఎస్‌బీ వేరియంట్ ధర 20 డాలర్లు (దాదాపు 1400 రూపాయలు). బ్లూ టూత్ వేరియంట్ ధర 25 డాలర్లు (1700 రూపాయలు). రెండూ కలిపి కొనుక్కోవాలంటే 3,400 రూపాయలు. అయితే ప్రస్తుతానికి అమెరికాలోనే ఈ కీలను గూగుల్ అమ్ముతోంది. ఇండియాలో ఎప్పటి నుంచి అమ్మకాలు ప్రారంభిస్తుందో ఇంకా క్లారిటీ లేదు.
డేటా à°Žà°¨à±â€Œà°•à±à°°à°¿à°ªà±à°·â€Œà°¨à±â€Œ గూగà±à°²à± టైటానౠసెకà±à°¯à±‚à°°à°¿à°Ÿà±€ à°•à±€ Data Encryption Google Titan Security Key