ఆధార్ యొక్క నోడల్ ఏజెన్సీ అయిన UIDAI 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల కోసం బాల్ ఆధార్ అనే ఒక ప్రత్యేక ప్రోగ్రాం ను లాంచ్ చేసింది. ఒక్కమాటలో చెప్పాలి అంటే బాల్ ఆధార్ అంటే చిన్న పిల్లల ఆధార్. అసలు ఈ బాల్ ఆధార్ ఏమిటి? దీని విశిష్టతలు ఏమిటి? దీనిని ఎలా తీసుకోవాలి? తదితర విషయాల గురించి ఈ ఆర్టికల్ లో చర్చిద్దాం.
బాల్ ఆధార్ అంటే ఏమిటి?
ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఇది చిన్న పిల్లల ఆధార్. ఇందులో ఐరిస్ స్కాన్, ఫింగర్ ప్రింట్ స్కాన్ లాంటి బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ లు ఏవీ ఉండవు. 5 సంవత్సరాల లోపు పిల్లలకు దీనిని తీసుకోవాలి. మీ పిల్లలకు 5 సంవత్సరాల దాటిన తర్వాత ఈ బాల్ ఆధార్ ను రెగ్యులర్ ఆధార్ గా మార్చుకోవాలి. ఈ బాల్ ఆధార్ ను బ్లూ కలర్ లో UIDAI ఇస్తుంది. ఇది తప్పనిసరి ఏమీ కాదు. అయితే పిల్లలు పెరిగి పెద్దవారైన తర్వాత ప్రభుత్వ స్కాలర్ షిప్ లకోసం కానీ, ఉన్నత విద్య కోసం కానీ దీని అవసరం ఉండే అవకాశo ఉంది. విదేశీ యూనివర్సిటీ లకు దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఇది ఉపయోగపడనుంది.
ఈ బాల్ ఆధార్ ను పొందడం ఎలా ?
మీ పాప/బాబు కు 5 సంవత్సరాలు నిండిన తర్వాత 7 సంవత్సరాల లోపు అంటే మీ చిన్నారికి 12 సంవత్సరాలు వచ్చే లోపు తప్పనిసరిగా బాల్ ఆధార్ ను రెగ్యులర్ ఆధార్ గా మార్చుకోవాలి. లేకపోతే మీ చిన్నారి యొక్క బాల్ ఆధార్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది.
uidai BAL Adhaar fingerprint iris biometric registered mobile number otp