హువావే మ్యాట్ ప్యాడ్ 8.. పిల్ల‌ల కోసం ఒక ప‌ర్‌ఫెక్ట్ ట్యాబ్‌.. క‌రెక్టేనా?   

ఒక‌ప్పుడు సెల్‌ఫోఎన్ వాడొద్ద‌ని పిల్ల‌ల్ని గ‌ద‌మాయించిన మ‌న‌మే ఇప్పుడు వాళ్ల‌కు ఫోన్ కొనాల్సిన చేతికి ఇవ్వాల్సిన ప‌రిస్థితి తెచ్చింది క‌రోనా. ఈ ప‌రిస్థితుల్లో ఆన్‌లైన్ క్లాస్‌ల కోసం ప్ర‌తి ఇంట్లోనూ ఒక‌టో రెండో స్మార్ట్‌ఫోన్లో, ట్యాబ్‌లో కాస్త భ‌రించ‌గ‌లిగిన‌వాళ్ల‌యితే ల్యాప్‌టాప్‌లో కొంటున్నారు. అందుకే కంపెనీల‌న్నీ బ‌డ్జెట్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ల‌తో మార్కెట్‌ను నింపేస్తున్నాయి. తాజాగా ఈ బాట‌లోకి వ‌చ్చింది హువావే. అయితే 10వేల ధ‌ర‌కే ఏకంగా ట్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చింది.  దీని ఫీచ‌ర్ల‌పై ఓ లుక్కేద్దాం.

పిల్ల‌ల కోసం బోల్డ‌న్ని ఫీచ‌ర్లు 
హువావే మ్యాట్‌ప్యాడ్ టీ8 పేరుతో రిలీజ‌యిన ఈ ట్యాబ్‌లో రికార్డర్, కెమెరాతో  మల్టీమీడియా కిడ్స్ పెయింటింగ్ వంటి ఫీచ‌ర్లున్నాయి.  ఇవేకాక వాళ్లు ఎక్కువ‌సేపు ట్యాబ్ వాడ‌కుండా కంట్రోల్ చేసే ఫీచ‌ర్లు ఉండ‌టం ప్ల‌స్‌పాయంట్‌.

* ఫేస్ అన్‌లాక్ ఫీచ‌ర్‌నూ పెట్టారు. 

* ఎక్కువ కాలం పిల్ల‌లు ట్యాబ్‌ను చూసినా కంటికి ఇబ్బంది లేకుండా మ‌ల్టీలేయ‌ర్ ఐ ప్రొటెక్ష‌న్ ఫీచర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది.

* అంతేకాదు ఎక్కువ కాలం పిల్ల‌లు ట్యాబ్ ముందు ఒకే యాంగిల్‌లో కూర్చున్నా కూడా స‌రిగ్గా కూర్చోమ‌ని అప్ర‌మ‌త్తం చేసే ఫీచ‌ర్ పెట్టారు.  

* టైమ‌ర్ కూడా ఉంటుంది. 
 
హువావే మ్యాట్ ప్యాడ్ టీ8 స్పెసిఫికేష‌న్లు
* 8 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
* ఆండ్రాయిడ్ 10 ఓఎస్
* ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ8768 ప్రాసెస‌ర్‌
* 2జీబీ ర్యామ్ 
* 32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్.. మెమ‌రీ కార్డ్‌తో 512 జీబీ వ‌ర‌కు ఎక్స్‌పాండ్ చేసుకోవ‌చ్చు. 

కెమెరాలు మైన‌స్సే 
కెమెరాల విష‌యంలో మాత్రం పెద్ద ప్ర‌భావవంతంగా ఉండ‌క‌పోవ‌చ్చు. 5 ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరాలున్నాయి. అయితే ఈ కెమెరాల‌తో ఆన్‌లైన్ క్లాస్‌లు విన‌డం కాస్త క‌ష్ట‌మేన‌నే చెప్పాలి.   

మంచి బ్యాట‌రీ బ్యాక‌ప్ 
5100 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉంది. కంపెనీ చెబుతున్న దాని ప్ర‌కారం 12 గంట‌ల వ‌ర‌కు బ్యాక‌ప్ వ‌స్తుంది.  ఫాస్ట్ చార్జింగ్ ఆప్ష‌న్ ఉండ‌టం కూడా ప్ల‌స్‌పాయింటే.


రెండు ర‌కాల వేరియంట్లు
హువావే మ్యాట్‌ప్యాడ్ టీ8లో రెండు వేరియంట్లున్నాయి. ఒక‌టి కేవ‌లం వైఫైతో మాత్ర‌మే ప‌ని చేస్తుంది. మ‌రొక‌టి ఎల్‌టీఈ వేరియంట్‌. దీనిలో సిమ్ కార్డ్ వేసుకోవ‌చ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో 1000 డిస్కౌంట్‌ 
హువావే మ్యాట్‌ప్యాడ్ టీ8 వైఫై వేరియెంట్ ధ‌ర రూ.9,999
ఎల్‌టీఈ వేరియెంట్ ధ‌ర రూ.10,999 
సెప్టెంబ‌ర్ 14లోగా ఫ్లిప్‌కార్ట్‌లో  ప్రీ ఆర్డర్ చేస్తే 1000 రూపాయ‌ల త‌గ్గింపు కూడా లభిస్తుంది.   బ‌డ్జెట్ లెవెల్ స్మార్ట్‌ఫోన్ వ‌చ్చే ధ‌రకే ట్యాబ్ ఇవ్వ‌డం ప్ల‌స్‌పాయింట్. హువావే కాబ‌ట్టి బ్రాండ్ వాల్యూ కూడా ఉంది.  పెర్‌ఫార్మెన్స్ బాగుంటే మార్కెట్‌లో క్లిక్ అయ్యే అవ‌కాశాలున్నాయి.

Huawei MatePad T8 Huawei MatePad T8 Tab Huawei MatePad T8 kids friendly tab Huawei MatePad T8 affrodable tab హువావే మ్యాట్ ప్యాడ్ 8