జీపీఎస్ గురించి మనకందరికీ తెలుసు.. కానీ అది మన సొంత కంపెనీ కాదని, అమెరికన్ శాటిలైట్ నావిగేట్ సిస్టమ్ అని అందరికీ తెలియకపోవచ్చు. మన సొంత జీపీఎస్ మాడ్యూల్ మనకు ఉండాలన్న లక్ష్యంతో చాలా కాలంగా ఇండియా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా యూ ట్రాక్ (UTRAQ) పేరుతో మన దేశపు తొలి జీపీఎస్ మాడ్యూల్‌ను తీసుకొస్తున్నట్లు గత ఏడాది కాలంగా చెబుతున్నారు. ఇప్పుడు అది వాస్తవరూపం దాల్చింది. ఢిల్లీలో రీసెంట్‌గా జరిగిన ఓ ఈవెంట్‌లో ఈ జీపీఎస్ మాడ్యూల్‌కు చిప్ సెట్ తయారుచేసిన మొబైల్ టెక్, రామకృష్ణా ఎలక్ట్రో ప్రైవేట్ లిమిటెడ్ యూట్రాక్‌ను ఇంట్రడ్యూస్ చేశాయి.
అవసరం ఏంటి?
1999లో కార్గిల్‌లో పాకిస్థాన్ సైన్యం మన సరిహద్దుల్లోకి చొచ్చుకువచ్చింది. అప్పుడు ఆ ప్రాంత జీపీఎస్ డేటా కావాలని ఇండియా అమెరికాను అడిగింది. కానీ ఆ విషయంలో అమెరికా మనకు సహకరించకపోవడంతో పాక్ మరింత ముందుకొచ్చింది. మన సైన్యం వారిని తిప్పికొట్టి విజయం సాధించింది. కానీ మనకు సొంత శాటిలైట్ వ్యవస్థతో కూడిన జీపీఎస్ ఉండాలన్న అభిప్రాయం అప్పుడే తొలిసారి ఏర్పడింది. అప్పటి నుంచి భారతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ISRO) ఆధ్వర్యంలోని ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (IRNSS) దీని మీద వర్కవుట్ చేసి సొంత నావిగేషన్ సిస్టంను రూపొందించింది.
ఎలా పని చేస్తుంది?
యూట్రాక్ ఒక VTS (వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్) మాడ్యూల్. యూట్రాక్ ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (IRNSS) మీద ఆధారపడి లొకేషన్‌ను ట్రాక్ చేస్తుంది. ఇప్పటి వరకు జీపీఎస్ బేస్డ్ అప్లికేషన్స్ అన్నీ అమెరికన్ శాటిలైట్స్ ఇచ్చే సమాచారంతో పని చేసేవి. యూట్రాక్ మాత్రం మన సొంత శాటిలైట్ నెట్‌వర్క్ ఆధారంగా పని చేస్తుంది. కాబట్టి మనకు మరింత యాక్యురేట్, రిలయబుల్ ట్రాకింగ్ సాధ్యమవుతుంది.
యూట్రాక్ విశేషాలు
* యూట్రాక్‌లో రెండు మాడ్యూల్స్ లాంచ్ చేశారు.
L110 GNSS మాడ్యూల్: ఇది కంపాక్ట్ నావిక్ మాడ్యూల్
L100 GNSS మాడ్యూల్: ఇది కొద్దిగా చిన్నది దీన్ని ప్యాచ్ ఆన్ టాప్ (POT) మాడ్యూల్ అంటారు.
ఈ రెండు మాడ్యూల్స్‌తో ట్రాకింగ్‌తోపాటు రేజింగ్, కమాండ్ కంట్రోల్, టైమింగ్ వంటి చాలా పనులు చేయొచ్చు.
* భూమి మీద, నీటిమీద, గాలిలో వెళ్లే వాహనాలను నావిగేట్ చేయొచ్చు. హైకర్స్‌కి, ప్రయాణికులుకు, వెహికల్ ట్రాక్ చేసే సంస్థలకు (పోలీసులు, ఆర్మీలాంటి వాటికి), అందరికీ ఈ కొత్త జీపీఎస్ మాడ్యూల్స్ ఉపయోగపడతాయి.
* ఇండియన్ మెయిన్‌ల్యాండ్ (ప్రైమరీ సర్వీస్ ఏరియా) నుంచి 1500 కి.మీ. వరకు లొకేషన్ ట్రాక్ చేయడానికి ఈ యూట్రాక్ ఉపయోగపడుతుంది. .
* IRNSS రెండు రకాల నావిగేషన్ సర్వీస్‌లు అందిస్తుంది. ఒకటి స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్. ఇది అందరు యూజర్లకు అందుబాటులో ఉంటుంది. రెండోది రెస్ట్రిక్టెడ్ సర్వీసెస్. పోలీసులు, ఆర్మీ, నావీ, గూఢచారి సంస్థలకు మాత్రమే ఈ సర్వీస్ అందిస్తారు.
* యూట్రాక్ వాహనాల లొకేషన్ ట్రాక్ చేయడానికి, మన స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ వాచీల్లో కూడా లొకేషన్ బేస్డ్ సర్వీసులు వాడుకోవచ్చు.
* రష్యాకు చెందిన GLONASS జీపీఎస్ సిస్టమ్‌తో యూట్రాక్ కంపాటబులిటీ కలిగి ఉంది.
UTRAQ India's first own GPS module VTS యూటà±à°°à°¾à°•à±â€Œ à°à°¾à°°â€Œà°¤â€Œà°¦à±‡à°¶â€Œà°ªà± తొలి జీపీఎసౠమాడà±à°¯à±‚à°²à±â€Œ తొలి à°¸à±à°µâ€Œà°¦à±‡à°¶à±€ జీపీఎసౠమాడà±à°¯à±‚లౠయూటà±à°°à°¾à°•à±â€Œ Â