ప్రివ్యూ- ఇక‌పై మీ కార్ డోర్ లాక్‌, ఇంటి తాళం తీయ‌డం కూడా ఐఫోన్‌తోనే

టెక్నాల‌జీ మ‌న జీవితాల్లో శ‌ర‌వేగంగా చొచ్చుకుపోతోంది. స్మార్ట్‌ఫోన్ పుణ్య‌మా అని ఇప్ప‌టికే బ్యాంకింగ్ అంతా అర‌చేతిల్లోకి వ‌చ్చేసింది. సినిమా టికెట్స్‌, బ‌స్‌, రైల్‌, ఎయిర్‌టికెట్లు కూడా ఆన్‌లైన్‌లో రిజ‌ర్వేష‌న్ చేసుకుంటున్నాం. బిల్ల‌లు ఆన్‌లైన్‌లో క‌ట్టేస్తున్నాం. వీటికోసం గంట‌లు గంట‌లు లైన్లో నిలబ‌డి టైం వేస్ట్ చేసుకునే బాధ త‌ప్పిందంటే అది టెక్నాల‌జీ చ‌ల‌వే. టెక్నాల‌జీలో ఇన్నోవేష‌న్‌ను తీసుకొచ్చేందుకు అంద‌రి కంటే ముందుండే యాపిల్‌.. త‌న ఐఫోన్‌తో త్వ‌ర‌లోనే ఇంటి తాళాన్ని, కారు తాళాన్ని కూడా టెక్నాల‌జీతోనే తీసే సౌక‌ర్యం తీసుకురాబోతోంది.

ఎన్ఎఫ్‌సీ టెక్నాల‌జీతో సాధ్యం
స్మార్ట్‌లాక్స్ ఇప్పుడు చాలా డివైస్‌ల‌కు వేస్తున్నారు. వాటిని బ్లూటూత్‌తో కూడా తీయొచ్చు.అయితే నియ‌ర్ ఫీల్డ్ కమ్యూనికేష‌న్ (NFC) టెక్నాల‌జీ చిప్ ఉంటే ఇంకా సెక్యూరిటీ  ఎక్కువ ఉంటుంది. స్మార్ట్‌లాక్‌ను చేత్తో ప‌ట్టుకోకుండానే ఓపెన్ చేయొచ్చు. ఇలాంటి ఎన్ఎఫ్‌సీ చిప్‌ను యాపిల్ త‌న ఐ ఫోన్‌లో ఇంట్ర‌డ్యూస్ చేయ‌నుంది. యాపిల్ పే అనే సొంత పేమెంట్ మెథ‌డ్ ద్వారా పే చేయ‌డానికి ఐఫోన్‌లో ఈ మేజ‌ర్ అప్‌డేట్ త్వర‌లో రాబోతుంది.
యాపిల్ ఇందుకోసం హెచ్ఎండీ గ్లోబ‌ల్‌తో క‌లిసి ప‌నిచేస్తోంది. ట్రాన్సిట్ కార్డ్ త‌యారీదార‌యిన క్యూబిక్‌తో కూడా చ‌ర్చ‌లు జ‌రుపుతోంది.
యాపిల్ పే అందుబాటులోకి..
ఇప్ప‌టికే జ‌పాన్‌, చైనా, యూఎస్‌లోని కొన్ని న‌గ‌రాలు, లండ‌న్లోనూ యాపిల్ పే అందుబాటులోకి వ‌చ్చింది. ఐఫోన్ క‌స్ట‌మ‌ర్లు దీనితో చెల్లింపులు జ‌రుపుతున్నారు. త్వ‌ర‌లోనే ఈ ఎన్ఎఫ్‌సీ టెక్నాల‌జీ చిప్‌తో  కార్‌, హౌస్ లాక్ కూడా ఓపెన్ చేసే ఫీచ‌ర్‌ను తీసుకురాబోతున్నార‌ని యాపిల్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

nlock house car doors with iPhone NFC chip ఐఫోన్‌తో కార్ డోర్ లాక్ ఓపెన్‌ ఐఫోన్‌తో ఇంటి తాళం ఓపెన్‌ ఎన్ఎఫ్‌సీ చిప్‌ యాపిల్ పే