ప్రివ్యూ- ఏమిటీ అడోబ్ స్పార్క్ పోస్ట్ ? ఎలా ప‌ని చేస్తుంది?

సోష‌ల్ మీడియాలో గ్రాఫిక్స్‌తో టాలెంట్ చూపించాల‌నుకునేవారికి అడోబ్ స్పార్క్ పోస్ట్ మంచి యాప్‌. ఇంత‌కుముందు ఇది ఐప్యాడ్‌కి మాత్ర‌మే అందుబాటులో ఉండేది.  ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు కూడా వ‌చ్చింది. ఈ యాప్‌తో మీరు అద్భుత‌మైన గ్రాఫిక్స్‌ను క్ష‌ణాల్లో త‌యారు చేసుకోవ‌చ్చు.  వాటిని మీ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో పోస్ట్ చేసుకోవ‌చ్చు. 

వంద‌ల కొద్దీ డిజైన్లు
* అడోబ్ స్పార్క్ పోస్ట్ యాప్‌లో వంద‌ల‌కొద్దీ ప్రీ డిఫైన్డ్ గ్రాఫిక్ టెంప్లేట్స్ ఉంటాయి. న‌చ్చింది సెలెక్ట్ చేసుకోని దాన్ని మీకు త‌గ్గ‌ట్లు ఎడిట్ చేసుకోవ‌చ్చు లేదా మీ సొంత డిజైన్‌ను మీరే క్రియేట్ చేసుకోవ‌చ్చు. 

* ఈ యాప్ టైపోగ్ర‌ఫీని స‌పోర్ట్ చేస్తుంది. అంటే స్టైలిష్ ఫాంట్స్‌, డిజైన్స్‌ను, క‌ల‌ర్స్‌, బ్యాక్‌గ్రౌండ్ షేప్స్‌, టెక్స్ట్ ఎఫెక్ట్స్ అన్నీ వాడుకోవ‌చ్చు. 

* ఇక ఈ యాప్‌లో అతి ముఖ్య‌మైన ఫీచ‌ర్ ఏమిటంటే ఇలా మీరు త‌యారు చేసుకున్న గ్రాఫిక్‌ను ఏ సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌కైనా స‌రిపోయేలా రీసైజ్ చేసుకునే ఆప్ష‌న్ ఉంది.

* అడోబ్ స్పార్క్ యాప్‌లో డిజైన్స్‌, లేఅవుట్స్‌, పాలెట్స్ వంటి ఇత‌ర ఆప్ష‌న్లు కూడా ఉన్నాయి.

అడోబ్ స్పార్క్ పోస్ట్‌ను ఉప‌యోగించ‌డం ఎలా?
1. అడోబ్ స్పార్క్ పోస్ట్ (Adobe Spark Post) యాప్‌ను ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసి ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. 

2. యాప్‌ను ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి.  

3. మెయిన్‌స్క్రీన్‌లో వంద‌ల కొద్దీ ప్రీ డిఫైన్డ్ టెంప్లేట్స్ క‌నిపిస్తాయి.  ఫీచ‌ర్డ్‌, కొలేజ‌స్‌, సీజ‌న‌ల్‌, లైఫ్‌స్టైల్‌, బిజినెస్‌, స్కూల్, ట్రావెల్‌, ఫుడ్‌, క్రాఫ్ట్ వివిధ విభాగాల కింద టెంప్లేట్స్ ఉంటాయి. 

4. సోష‌ల్ మీడియా గ్రాఫిక్స్ క్రియేట్ చేసుకోవాలంటే ఇందులో నుంచి మీకు కావాల్సిన టెంప్లేట్‌ను సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ మీద చివ‌ర క‌నిపించే Remix బ‌ట‌న్‌ను టాప్ చేసి ఎడిట‌ర్‌ను ఓపెన్ చేయండి. అక్క‌డున్న టెంప్లేట్స్ న‌చ్చ‌క‌పోతే మీరు ఫోటో గ్యాల‌రీ ఓపెన్ చేసుకుని లేదా స్టాక్ ఫోటోస్ ఓపెన్ చేసుకుని మీ సొంత టెంప్లేట్ క్రియేట్ చేసుకోండి.  \

5. ఇందుకోసం మీకు ఎడిట‌ర్‌లో Add, Design, Palette, Resize, Layout, and Effects అనే ఆరు ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. 

6. డిజైన్‌లో రక‌ర‌కాల డిజైన్లు ఉంటాయి. అలాగే పాలెట్ ఆప్ష‌న్‌లో ర‌క‌ర‌కాల క‌ల‌ర్ పాలెట్స్ ఉంటాయి. వీటిని మీ డిజైన్‌కు (ఇమేజ్ లేని ప్లేస్‌లో) అప్ల‌యి చేసుకోవ‌చ్చు. Decorative కేటగిరీలో ప్రీ డిఫైన్డ్ క‌ల‌ర్ పాలెట్స్ ఉంటాయి. మీరు సొంతంగా క్రియేట్ చేసుకోవాలంటే Custom కేట‌గిరీకి వెళ్లాలి. లే అవుట్‌లో డిఫ‌రెంట్ లే అవుట్స్‌, ఎఫెక్ట్స్ కేట‌గిరీలో బోలెడు ఎఫెక్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. 

రీసైజ్‌.. అతి కీల‌క ఫీచ‌ర్‌
 మీరు క్రియేట్ చేసుకున్న గ్రాఫిక్‌ను ఎలాంటి సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌పైన అయినా వినియోగించుకునేలా చేసే ఆప్ష‌న్ రీ సైజ్‌.  ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, పింట‌రెస్ట్‌, బ్లాగ్ పోస్ట్‌,  యూట్యూబ్ థంబ్ నెయిల్‌, ఫేస్‌బుక్ యాడ్‌, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల‌కు త‌గ్గ‌ట్లు గ్రాఫిక్‌ను రీసైజ్ చేసుకోవ‌చ్చు. ఫేస్‌బుక్ పేజ్ క‌వ‌ర్‌, ఫేస్‌బుక్ ప్రొఫైల్ క‌వ‌ర్‌, ట్విట్ట‌ర్ హెడ‌ర్‌, లింక్డిన్ బ్యాక్‌గ్రౌండ్ వంటి వాటికీ కూడా రీసైజ్ చేసుకోవ‌చ్చు. 
 

Adobe Spark Post  Android app create social media graphics అడోబ్ స్పార్క్ పోస్ట్ ఆండ్రాయిడ్ యాప్‌ సోష‌ల్ మీడియా గ్రాఫిక్స్ త‌యారీకి యాప్‌ Â