జియో...భారత్లో తన సేవల్ని చాలా వేగంగా విస్తరిస్తోంది. దీనిలో భాగంగా వచ్చింది జియో హోమ్ టీవీ. ఈ జియో టీవీ కేవలం రూ.400తో హెచ్డీ చానల్స్ను అందించనుందనే వార్తలు వచ్చాయి. కొన్నివారాల్లోనే ఈ జియో టీవీ ప్రత్యక్ష సేవలు అందించడానికి ఆ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఎస్డీ ఛానల్స్కు అయితే రూ.200, ఎస్డీ, హెచ్డీ ఛానల్స్కు అయితే రూ.400 ఛార్జ్ చేయనుంది జియో. మరి జియో నిజంగానే ఇంత తక్కువ రేటుకు ఈ సేవలు అందిస్తుందా!
ఫైబర్ బ్రాండ్బాండ్
జియో.. ఇప్పుడు భారత్లో ప్రతి ఇంట్లో ఉంది. తన 4జీ ప్లాన్స్తో అందరికి చేరువైన ఈ సంస్థ.. ఎఫ్టీటీహెచ్ ఫైబర్ బ్రాండ్బాండ్ సర్వీస్ ద్వారా డిజిటల్ డీటీహెచ్ సేవల్ని అందించడానికి ఈ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. స్టాండర్డ్ డెఫినిషన్ (ఎస్డీ), ఎస్డీ +హెచ్డీ ఛానెల్స్లను కేవలం రూ.200, రూ.400కు అందించాలన్నది ఆ సంస్థ ఆలోచన. ఈ కొత్త సర్వీసు పేరే జియో హోమ్ టీవీ. పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్లతో నాణ్యమైన టీవీ సేవల్ని అందించడం దీని ప్రత్యేకత. కొన్ని వారాల్లోనే ఇది అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ట్రయల్ టెస్టులు మొదలయ్యాయి.
ఈఎంబీఎంఎస్ ద్వారా..
రిలయన్స్ జియో కొత్త టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసు ఈఎంబీఎంఎస్ లేదా ఎన్హేన్స్డ్ మల్టీమీడియో బ్రాడ్కాస్ట్ మల్టీమీడియా సర్వీసు, ఈఎంబీఎంస్ టెక్నాలజీ కలిసి పని చేస్తుంది. టీవీ, రేడియో చానల్స్ ఉపయోగించే వన్ టు మెనీ బ్రాడ్కాస్ట్ సిస్టమ్ కూడా ఇది ఉపయోగించుకుంటుంది. ఈ జియో సర్వీసు ద్వారా యూజర్లు ఆఫ్లైన్ ద్వారా కూడా కొన్ని బ్రాడ్కాస్ట్ సేవల్ని పొందొచ్చు. ప్లేస్టోర్లో జియో బ్రాడ్కాస్ట్ అనే యాప్ను అందుబాటులో ఉంచింది. దీనిలో యూజర్లను మొత్తం గైడ్ను అందుబాటులో ఉంచింది. జియో డీటీహెచ్ సేవల గురించి ఇప్పటికే ప్రకటించినా.. ప్లాన్ల వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.
JioHomeTV Upcoming service Offer HD channels at Rs 400 FTTH fiber broadband ఫైబ‌రౠబà±à°°à°¾à°‚à°¡à±â€Œà°¬à°¾à°‚à°¡à±â€Œ జియో టీవీ