సెలబ్రిటీలు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలను ఏదైనా ప్రశ్న గూగుల్‌లో అడిగిన వెంటనే... వాటికి వీడియో రూపంలో సమాధానం చెబితే ఎలా ఉంటుంది? సెలబ్రిటీలకు ఎంతోమంది రకరకాల ప్రశ్నలు వేస్తుంటారు? లేదా వారి గురించి ఏదో ఒక ప్రశ్న గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటారు. ఒకే ప్రశ్న ఎంతోమంది అడుగుతారు. ఇవి గూగుల్‌లో టైప్ చేయగానే.. వెంటనే వీడియో రూపంలో వాటికి సమాధానం తెలిపేలా ఐవోఎస్ యూజర్ల కోసం ఒక కొత్త యాప్‌ను రూపొందించింది. దీని పేరు కేమియోస్.
ఐవోఎస్ 9.0, ఆపై యూజర్లకు
గూగుల్ కోసం ఎవరి గురించైనా వెతికినప్పుడు.. ఈ వీడియో అక్కడే పాప్ అప్ రూపంలో వస్తుంది. ఎవరినైనా ఇన్వైట్ చేయడం ద్వారానే ప్రస్తుతం ఈ కేమియో యాప్‌ని ఉపయోగించగలం. దీనిని యాపిల్ స్టోర్ నుంచి ఐవోఎస్ 9.0 ఓఎస్ అంతకంటే ఎక్కువ ఆపరేటింగ్ సిస్టమ్‌గల ఐఫోన్, ఐపాడ్‌లలో దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందులో రిజిస్టర్ అయిన యూజర్లకు తమ గురించి కొత్త ప్రశ్నలు వస్తుంటాయి. గూగుల్‌లో అందరూ కామన్‌గా అడిగిన ప్రశ్నను గూగుల్‌లో టైప్ చేయగానే.. దానికి సంబంధించిన వీడియో ఉంటే వెంటనే చూడొచ్చు. ప్రముఖ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు కెవిన్ డ్యూరెంట్, మోడల్ కార్లీ క్లోస్ సాయంతో ఈ యాప్‌ను పరీక్షించామని గూగుల్ తెలిపింది.
ఫొటోలు, లింక్స్ కూడా అప్‌లోడ్
తరచూ వచ్చే ప్రశ్నలకు సెలబ్రిటీలు సెల్ఫీల రూపంలో వీడియోలు పోస్ట్ చేసేందుకు గూగుల్.. గత ఏడాది డిసెంబరులో సెర్చ్ ఫీచర్‌లో మార్పులు చేసింది. దీనిని మరింత అభివృద్ధి చేసి కేమియోను రూపొందించింది. ఇందులో సెల్ఫీ వీడియోలనేగాక, యూజర్లు.. తమ పేజ్ ద్వారా సందేశాలు, చిత్రాలు, వీడియోలు, జీఐఎఫ్‌లు, వెబ్‌సైట్ లింక్స్, ఇతర సమాచారం కూడా అప్‌లోడ్ చేయచ్చు. ఇది జులైలో విడుదలైన ఇన్‌స్టాగ్రామ్ క్వశ్చన్స్ స్టికర్‌ను పోలి ఉంటుంది. బలమైన సోషల్ నెట్‌వర్కింగ్ టూల్‌గా గూగుల్ విస్తృతమయ్యేందుకు ఈ కేమియో మరింతగా ఉపయోగపడనుంది.
apple ios users celebrities cameos google app record videos google search cricket players most repeated questions