ప్రివ్యూ- మైక్రోసాఫ్ట్ YOUR PHONE ఆండ్రాయిడ్ యాప్‌

ఫోన్‌ను ముట్టుకోకుండానే మెసేజ్‌ల‌కు రిప్లై పంప‌డం, ఫోన్‌లో ఉన్న ఫోల్డ‌ర్స్‌ను యాక్సెస్ చేయ‌డంతో పాటు మెమొరీలో ఉన్న ప్ర‌తి విష‌యాన్ని కంప్యూట‌ర్‌లో చూసేందుకు వీలుగా స‌రికొత్త యాప్‌ను మైక్రోసాఫ్ట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. విండోస్ 10 యూజ‌ర్ల కోసం YOUR PHONE యాప్ రూపొందించింది. ఆండ్రాయిడ్ 7.0 నౌగ‌ట్‌, ఆ త‌ర్వాతి ఓఎస్‌ల‌పై ప‌నిచేసే స్మార్ట్‌ఫోన్లు అన్నింటిలో ఈ యాప్ ప‌నిచేస్తుంది. ప్ర‌స్తుతం ఇది టెస్టింగ్ ద‌శ‌లో ఉందని మైక్రోసాఫ్ట్‌.. కంపెనీ బ్లాగులో తెలిపింది. 

కంప్యూట‌ర్‌తో సింక్రనైజ్‌
ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో ఉండే కంటెంట్‌ను కంప్యూట‌ర్‌లో చూపించ‌డంతో ఫోన్‌కీ, కంప్యూట‌ర్‌కీ మ‌ధ్య డేటా సింక్ర‌నైజేష‌న్‌ను సులువుగా చేసేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. విండోస్ 10 కోసం ప్ర‌త్యేకంగా యువ‌ర్‌ఫోన్ యాప్‌ను రూపొందిస్తున్న‌ట్లు మేలో జ‌రిగిన స‌మావేశంలో మైక్రోసాఫ్ట్ ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని..ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మాన్యువ‌ల్‌, వైర్‌లెస్ డేటా ట్రాన్స్‌ఫ‌ర్ అవ‌స‌రం లేకుండానే.. ఫోన్‌లో ఉన్న ఫొటోలు వాటంత‌ట అవే విండోస్ 10 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ గ‌ల కంప్యూట‌ర్‌తో సింక్ర‌నైజ్ చేసేలా ఈ యాప్ చేస్తుంది. ఫొటోల్లో మార్పులు చేర్పులు చేసుకునేందుకు Windows Ink అనే ఆప్ష‌న్ కూడా ఉంటుంది. డ్రాగ్ అండ్ డ్రాప్ ప‌ద్ధ‌తిలో ఫోన్‌లో ఉన్న ఫొటోలు కంప్యూట‌ర్‌లోకి, కంప్యూట‌ర్‌లో ఉన్న ఫొటోలు ఫోన్‌లోకి మార్చ‌వ‌చ్చు. అంతేగాక ఈ యాప్‌ను డెస్క్‌టాప్ పైనే పిన్ చేసుకునే స‌దుపాయం కూడా తీసుకొచ్చేందుకు మైక్రోసాఫ్ట్ ప్ర‌య‌త్నిస్తోంది. 
ప్ర‌స్తుతం ఈ యాప్‌కు కొన్ని ప‌రిమితులు ఉన్నా.. మరింత‌గా దీనిపై ప్ర‌యోగాలు చేస్తున్న కొద్దీ విస్తృతి పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి. విండోస్ 10కు త్వ‌ర‌లో రాబోయే అప్‌డేట్ వెర్ష‌న్( కోడ్ నేమ్ రెడ్‌స్టోన్ 5) లో ఈ యువ‌ర్ ఫోన్ యాప్ యాప్‌ను పూర్తిస్థాయిలో తీసుకు రాబోతున్నారు. ఈ యాప్‌లో వ‌చ్చిన ఫ‌లితాల ఆధారంగా త‌దుప‌రి నిర్ణ‌యం తీసుకోనుంది. త్వ‌ర‌లోనే ఐవోఎస్‌తో ప‌నిచేసే మొబైల్స్‌నూ కంప్యూట‌ర్‌కి అనుసంధానం చేసేలా ఈ యాప్‌లో మార్పులు రావొచ్చు.

microsoft windows mobile your phone app synchronize files folders android