ప్రివ్యూ- ఎంత ఖ‌రీదైన ఫోన్‌ని అయినా అద్దెకిచ్చే RENTOMOJO

గృహోప‌క‌ర‌ణాలు, ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు, వాహ‌నాల‌ను ఆన్‌లైన్‌లో అద్దెకిచ్చే RentoMojo.. ఇప్పుడు త‌న‌ సేవ‌ల‌ను విస్తృతం చేయ‌బోతోంది. ఇక నుంచి స్మార్ట్‌ఫోన్స్‌ని కూడా నెలవారీ అద్దెకు ఇవ్వ‌బోతోంది. నెల‌కు కొంత మొత్తం చెల్లించి.. ప్రీమియమ్ ఫోన్స్‌, ఫ్లాగ్‌షిప్ ఫోన్ల‌ను నెల‌, ఆరు నెల‌లు, సంవ‌త్స‌రం, రెండు సంవ‌త్స‌రాల వ్య‌వ‌ధిలో అద్దెకు అందించ‌బోతు న్న‌ట్లు ఈ వెబ్‌సైట్ ప్ర‌క‌టించింది. 

రూ.2,099 నుంచి మొద‌లు
ప్ర‌స్తుతం ఎంతో ఖ‌రీదైన ఐఫోన్ ఎక్స్‌, గూగుల్ పిక్స‌ల్‌-2,  శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్‌9, గెలాక్సీ నోట్ 8 వంటి ఫ్లాగ్ షిప్ ఫోన్ల‌ను ఒక్క‌సారైనా ఉప‌యోగించాల‌ని అంతా భావిస్తారు. కానీ ఆర్థిక ప‌రిస్థితి అనుకూలించ‌క ఇది కోరిక‌గానే మిగిలి పోతోంది. అలాంటి వారు ఒక నెల‌రోజులైనా ఈ ఫోన్లు వినియోగించే అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది RentoMojo. స్మార్ట్‌ఫోన్ ఒక్క‌టే కాదు.. గూగుల్ హోమ్ వంటి స్మార్ట్ హోమ్ అప్ల‌య‌న్సెస్‌ని కూడా లీజుకు ఇవ్వ‌బోతోంది. స్మార్ట్‌ఫోన్‌ను బట్టి నెల‌కు ఈ ధ‌ర క‌నీసం రూ.2,099 నుంచి అత్య‌ధికంగా రూ.9,299 వ‌ర‌కూ ఉండ‌బోతున్నాయి. ఎన్ని రోజులు అద్దెకు తీసుకుంటున్నామ‌నే దానిపైనే చార్జీలు ఆధార‌ప‌డ‌తాయి. ఏ స్మార్ట్‌ఫోన్‌ను అయినా అద్దెకు తీసుకునేముందు రూ.9,998లు రిఫండ‌బుల్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 

ఐఫోన్, గూగుల్ పిక్స‌ల్ కావాలా
ఐఫోన్ ఎక్స్‌ను 24 నెల‌ల పాటు అద్దెకు తీసుకోవాల‌నుకుంటే నెల‌కు రూ.4,299 చెల్లించాలి. ఆరు నెల‌ల‌కు కావాల‌ను కుంటే నెల‌కు రూ. 9,299 చెల్లించాలి. ఎక్కువ వ్య‌వ‌ధిని బ‌ట్టి.. మ‌రిన్ని లాభాలు ఉంటాయ‌ట‌. 24 నెల‌ల వాడిన త‌ర్వాత‌.. ఐఫోన్ కండీష‌న్ బాగుండి దానిని సొంతం చేసుకోవాల‌ని భావిస్తే.. అద‌నంగా రూ.15,556 రూపాయ‌లు చెల్లించాలి. ఇందులో ఆరు, 12, 18, 24 నెల‌ల టైమ్ ఫ్రేమ్‌లో అద్దెకు తీసుకోవ‌చ్చు. నెల‌కు అతి త‌క్కువ అద్దె గూగుల్ పిక్సల్ 2కి ఉంది. 24 నెల‌ల వ్య‌వ‌ధికి గాను నెల‌కు రూ.2,099 చెల్లించాలి. ఆరు నెల‌లకు అయితే రూ.5,398 చెల్లించాలి. ముందుగా రూ.5,398లు రిఫండ‌బుల్ డిపాజిట్ చేయాలి. అదేవిధంగా ఐఫోన్ 8, శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్9, శామ‌సంగ్ గెలాక్సీ నోట్ 8కి కూడా ఇటువంటి చార్జీలే వ‌ర్తిస్తాయి. వీటితో పాటు ఫోన్ డ్యామేజ్ అయితే దానికి వెయ్యి రూపాయాలు చార్జీ చెల్లించాలి. 

ప్రస్తుతం కొన్ని సిటీల్లోనే.. 
ప్ర‌స్తుతం ఈ స‌ర్వీస్ బెంగ‌ళూరు, ఢిల్లీ, గుర్‌గావ్‌, ముంబై, నోయిడాలో మాత్ర‌మే అందుబాటులో ఉంది. త్వ‌ర‌లోనే ఈ బిజినెస్‌ను చెన్నై, హైద‌రాబాద్‌, పుణే వంటి న‌గ‌రాలకూ కొన్ని నెల‌ల్లో ప్రారంభించేందుకు Rentomojo చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఒక్కోసారి ఈ ధ‌ర‌లు కొంత అధికంగా ఉన్న‌ట్లు అనిపించ‌డం స‌హ‌జ‌మే! ఉదాహ‌ర‌ణ‌కు ఐఫోన్ ఎక్స్ ఆరు నెల‌ల‌కు అద్దెకు తీసుకుంటే సుమారు రూ.56 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఆ ఫోన్ అస‌లు ధ‌ర కంటే రూ.25 వేలు త‌క్కువ‌. మ‌రి గూగుల్ పిక్సల్-2 విష‌యంలో ఎక్కువ లాభప‌డ‌క త‌ప్ప‌దు. ఈ ఫోన్ ఆరు నెల‌లకు సుమారు రూ.24 వేలు మాత్ర‌మే చెల్లిస్తాం. ప్ర‌తిసారీ కొత్త మొబైల్స్‌ను మార్చేందుకు ఇష్ట‌ప‌డేవారికి ఈ డీల్స్ కొంత వ‌ర‌కూ ఉప‌యోగ‌ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. ఇందులో ఇంకో వెసులుబాటు కూడా ఉంది. ఈ సబ్‌స్క్రిప్ష‌న్‌ని మ‌ధ్య‌లోనే ర‌ద్దు చేసుకోవ‌చ్చు.

 

rentomojo online website rent flagship mobiles iphone x smasung glaxy google pixel 2 best available prices