ఇది వరకు అడ్రస్ చెప్పాలంటే గుడి పక్కన, బడిపక్కన అని కొండగుర్తులు చెప్పేవాళ్లం. జీపీఎస్ ఫోన్లలో వచ్చాక జస్ట్ లొకేషన్ పిన్ చేస్తే చాలు గూగుల్ మ్యాప్స్‌లో ఈజీగా చూసుకుంటూ వెళ్లిపోవచ్చు. డ్రైవింగ్‌లో ఉండి మ్యాప్స్ చూడటం ఇబ్బంది అనుకుంటే వాయిస్ అసిస్టెంట్ హెల్ప్ చేస్తుంది. ఇకపై గూగుల్ మ్యాప్స్‌లో ఆ వాయిస్ అసిస్టెంట్‌గా అమితాబ్ బచ్చన్ కంచు కంఠం వినే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బిగ్‌బీని అప్రోచ్ అయిన గూగుల్!!
గూగుల్ మ్యాప్స్‌లో మనకు ప్రస్తుతం వచ్చే వాయిస్ కేరిన్ జేకబ్సన్ అనే న్యూయార్క్ ఎంటర్టైనర్ది. ఆమె గూగుల్ మ్యాప్స్‌కి మాత్రమే కాదు యాపిల్ వారి వాయిస్ అసిస్టెంట్ సిరికి కూడా ఆమె గొంతే. అయితే ఇప్పుడు అమితాబ్ బచ్చన్ వాయిస్‌తో రీప్లేస్ చేయాలని గూగుల్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి దీనిమీద గూగుల్ గానీ, అమితాబ్ గానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
భారీ రెమ్యూనరేషన్
గూగుల్ మ్యాప్స్‌కి వాయిస్ ఇచ్చే అవకాశాన్ని అమితాబ్ పరిశీలిస్తే ఆయనకు భారీగానే రెమ్యూనరేషన్ ఇవ్వడానికి గూగుల్ సిద్ధమైందని సమాచారం. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచమంతా భయపెడుతున్న తరుణంలో అమితాబ్ ఒప్పుకుంటే ఆయన వాయిస్‌ను ఆన్లైన్లోనే రికార్డ్ చేసే అవకాశాలున్నయట.
గూగà±à°²à± à°®à±à°¯à°¾à°ªà±à°¸à± వాయిసౠఅసిసà±à°Ÿà±†à°‚à°Ÿà±â€Œ గూగà±à°²à± à°®à±à°¯à°¾à°ªà±à°¸à± అమితాబౠవాయిసà±â€Œ అమితాబౠగొంతà±à°¤à±‹ గూగà±à°²à± à°®à±à°¯à°¾à°ªà±à°¸à±â€Œ Google maps Google maps amitabh voice