ఒప్పో కాష్ - 2 లక్షల నుంచి 2 కోట్ల వరకు లోన్లు - ఒప్పో యూజర్లకు మాత్రమేనా?

చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో ఇండియ‌న్ మార్కెట్లో మంచి స‌క్సెస్‌నే అందుకుంది. అదే ఊపులో ఇప్పుడు ఇండియాలో డిజిటల్ పెమెంట్స్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టింది. ఒప్పో రెనో 3 మొబైల్ లాంచింగ్ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఈవెంట్లో తమ కొత్త బిజినెస్ అనౌన్స్ చేసింది. ఈ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్‌కు ఒప్పో క్యాష్ అని పేరు పెట్టింది. స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లే టార్గెట్‌గా ఈ బిజినెస్ న‌డ‌ప‌బోతోంది.

ఏయే స‌ర్వీసులంటే
* ఫైనాన్షియ‌ల్ ఎడ్యుకేష‌న్‌
* డిజిట‌ల్ పేమెంట్స్‌
* ఇన్స్యూరెన్స్‌
* సేవింగ్స్‌
* లోన్లు ఇవ్వ‌డం (లెండింగ్‌) సర్వీసుల‌ను ఒప్పో క్యాష్ అందించ‌నుంది.

మూడో చైనా కంపెనీ
ఒప్పో క్యాష్ స‌ర్వీస్‌లు 18 నెలల్లోపు ప్రారంభం కాబోతున్నాయి.  ఇప్ప‌టికే చైనా మొబైల్ కంపెనీలు షియోమి, రిల‌య్‌మీ ఈ  ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ రంగంలోకి దిగాయి.  షియోమి ఎంఐ పే, రియ‌ల్‌మీ పైసా ఇప్ప‌టికే మార్కెట్లోకి వ‌చ్చాయి. ఇప్పుడు ఒప్పో క్యాష్‌తో ఒప్పో కూడా బ‌రిలోకి దిగింది.

50 వేల కోట్ల బిజినెస్ టార్గెట్‌
 ఒప్పో ఇండియా వైస్ ప్రెసిడెంట్ సుమిత్ వాలియా మాట్లాడుతూ ఐదేళ్ల‌లో 1 కోటి మంది వినియోగ‌దారుల‌కు త‌మ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసులు అందించాల‌న్న‌ది త‌మ టార్గెట్ అని చెప్పారు.  ఇందుకోసం 50 వేల కోట్ల‌ను సిద్ధం చేస్తామ‌న్నారు.  

ఒప్పో క్యాష్ యాప్
ఒప్పో క్యాష్ కోసం కొత్తగా ఓ యాప్ తీసుకొస్తున్నారు. ప్ర‌స్తుతానికి దీనికి బీటా వెర్ష‌న్‌ను టెస్ట్ చేస్తున్నారు. సిప్‌, మ్యూచువ‌ల్ ఫండ్స్‌, ప‌ర్స‌న‌ల్ లోన్స్‌, బిజినెస్ లోన్స్‌తోపాటు ఫోన్ స్క్రీన్ ఇన్సూరెన్స్ కూడా ఈ యాప్ ద్వారా తీసుకోవ‌చ్చు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంటుంది. ఒప్పో ఫోన్ల‌లో అయితే ఒప్పో క్యాష్ యాప్ డిఫాల్ట్‌గా రాబోతోంది.  ఐవోఎస్ యాప్ స్టోర్‌లో ఎప్పుడొస్తుందో క‌న్ఫ‌ర్మ్ కాలేదు.

2 ల‌క్ష‌ల నుంచి 2 కోట్ల లోన్
ఒప్పో క్యాష్ యూజ‌ర్ల‌కు ఫ్రీ క్రెడిట్ రిపోర్ట్‌లు అందిస్తుంది. ప‌ర్స‌న‌ల్‌, బిజినెస్ లోన్లు కొత్త‌వాళ్ల‌కైతే 2 ల‌క్ష‌లు, ఇప్ప‌టికే లోన్లు తీసుకుని రీపేమెంట్ ప‌క్కాగా ఉన్న‌వారికి వారి ఫైనాన్షియ‌ల్ కెపాసిటీని బ‌ట్టి 2 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు లోన్ ఇస్తామ‌ని ఒప్పో చెబుతోంది.

ఒప్పో ఒప్పో క్యాష్‌ ఒప్పో ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్‌ డిజిట‌ల్ పేమెంట్స్‌ Oppo Cash Oppo financial Services Digital payments