ఇప్పుడున్న హైటెక్ యుగంలో మన డేటా ఎప్పుడూ సేఫ్ కాదు.. ఎక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అది అలాఅలా పాకి ఎక్కడికో వెళ్లిపోతూ ఉంటుంది. అందుకే మనకు తెలియకుండానే.. మనం నంబర్ ఇవ్వకుండానే మన ఫోన్‌కు మార్కెటింగ్ కాల్స్ వస్తూనే ఉంటాయి. వాళ్లను ఎవరు నంబర్ ఇచ్చారని మనం అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనమే ఎక్కడో ఇచ్చి ఉంటాం. మరి ఇలా ఇచ్చిన డేటాను కొన్ని కంపెనీలు సేవ్ చేసుకుంటాయి. షేర్ చేస్తాయి. మరి ఈ డేటాను కనిపెట్టి డిలీట్ చేయడం ఎలా...ఇందుకు ఒక యాప్ వచ్చింది. దాని పేరే మైన్.. మరి ఈ యాప్ ఎలా పని చేస్తుంది?
డేటా సేఫ్ కాదు
మనం చాలా చోట్ల మనకు సంబంధించి వ్యక్తిగత వివరాలు రాస్తాం.. మీ డేటా సేఫ్ అని ఆయా కంపెనీలు కూడా భరోసా ఇస్తుంటాయి. కానీ వీటిలో చాలా వరకు నిజం ఉండదు. సాక్షాత్తూ ముఖేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ జియోకు సంంబంధించిన డేటానే లీక్ అయిపోయింది. ఇక చిన్న కంపెనీల మాట వేరే చెప్పాలా? మరి ఈ డేటాను కనిపెట్టి తొలగించడానికి మైన్ యాప్ ఉపయోపడుతుంది.
ఎలా యూజ్ అవుతుందంటే..
ముందుగా మైన్ యాప్ మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. మీ ఈమెయిల్ ద్వారా సైన్ అప్ కావాలి. 30 సెకన్లలో మీకో అకౌంట్ క్రియేట్ అవుతుంది. మీరు ఈ యాప్‌ను రన్ చేస్తే మీకు సంబంధించిన పర్సనల్ డేటా ఏ ఏ కంపెనీల్లో ఉంటే వెంటనే మీకు లిస్టు ఇచ్చేస్తుంది. ఆ తర్వాత మీ డేటా తొలగించాల్సిందిగా ఆయా కంపెనీలకు మీరు రిక్వెస్ట్‌లు పంపాలి. లేకపోతే ఒక్కోసారి మీరే తొలగించుకునే అవకాశాలు కూడా ఉంటాయి. మీ డేటా ఎవరికి వెళ్లకుండా మార్క్ చేసి కూడా పెట్టుకోవచ్చు.
డిజిటల్ ఫుట్ ప్రింట్
వెబ్‌లో మీకు సంబంధించిన డిజిటల్ ఫుట్ ప్రింట్ వివరాలను కూడా ఈ యాప్ ద్వారా ట్రాక్ చేయచ్చు. ఇందుకోసం మైన్ వెబ్‌సైట్‌కు వెళ్లి అకౌంట్ క్రియేట్ చేయాలి. ఈ ఈమెయిల్ అడ్రెస్ యూజ్ చేసుకుని మీకు సంబంధించిన డేటాను బయటకు తీస్తుంది. మీరు ఇచ్చే ఈమెయిల్ ఐడీతో ముడిపడి ఉన్న అంతా డేటాను ఇది వెలికి తీస్తుంది. ఈ డేటాను గుర్తించి మీరు ఎరైజ్ చేయడానికి ప్రయత్నించొచ్చు.
COMPANIES DATA SEND WITHDRAWAL REQUEST REMOVAL