గ్రామాల్లో జరిగే అభివృద్ధిని రియల్ టైంలో మానిటర్ చేయడానికి గ్రామ మాన్ చిత్ర యాప్ 

కేంద్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి పైన బాగా ఫోక‌స్‌ పెట్టింది. స్వచ్ఛభారత్‌తో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు కట్టించి ముందడుగు వేసింది. ఇప్పుడు గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు  టెక్నాలజీని వాడుకోబోతోంది. 2019 జాతీయ పంచాయతీ అవార్డుల కార్యక్రమంలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. అంతేకాదు గ్రామ మాన్ చిత్ర అనే యాప్ కూడా విడుదల చేశారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ యాప్‌ను తయారుచేసింది.  

అలాంటి రాష్ట్రాల‌ను కంట్రోల్ చేయ‌వ‌చ్చు
గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను ఈ యాప్‌తోఎప్పటికప్పుడు ఢిల్లీ నుంచే పరిశీలించవచ్చు. గ్రామాల్లో తాము ఏ మార్పు కోరుకుని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామో ఆ పనులు సక్రమంగా జరుగుతున్నాయా లేదా తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి గ్రామ మాన్ చిత్ర యాప్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసే నిధులను చాలా రాష్ట్రాలు సొంత పథకాలకు, సొంత ఖర్చుల‌కు వాడేసుకుంటాయి. అలాంటి రాష్ట్రాలకు ఈ యాప్ ద్వారా అడ్డుకట్ట వేయొచ్చు. 

ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌లు
గ్రామ మాన్‌ చిత్ర యాప్ నేషనల్ ఇన్ఫరేటిక్స్ సెంటర్ యొక్క‌ ప్రత్యేకమైన జిపిఎస్ ప్లాట్ ఫామ్ భారత్ మ్యాప్స్‌పై  పనిచేస్తుంది. డిజిటల్ ఇండియాగా మార్చాల‌ని కంకణం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం గల్లీ నుంచి ఢిల్లీ దాకా దాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తేవాలని ప్రయత్నిస్తోంది. ఇప్పుడు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రవేశపెట్టిన గ్రామ మాన్‌ చిత్ర యాప్ కూడా ఈ కోవలోకే వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే సూత్రంతో వెళ్తుంది.  డిజిటల్ ఇండియా తో పాటు గ్రామీణ అభివృద్ధి ఈ రెండు లక్ష్యాలు చేరేందుకు ఈ యాప్ దారి చూపిస్తుంది.
 

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ‌ గ్రామాల అభివృద్ధి గ్రామ్ మాన్ చిత్ర యాప్‌ Gram Mann Chitra app Central Rural development Rural development activity real time monitoring