టిక్‌టాక్‌లో మీ పిల్ల‌ల యాక్టివిటీని కంట్రోల్ చేసే ఫ్యామిలీ పెయిరింగ్‌

క‌రోనా వైర‌స్ లాక్‌డౌన్‌తో ఇల్లు క‌ద‌ల‌ని ఇండియ‌న్ యూత్ అంతా టిక్‌టాక్ మీదే బ‌తికేస్తున్నారు. క‌రోనా వైర‌స్‌కు సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్‌నూ వ‌ద‌ల‌కుండా టిక్‌టాక్‌లో వీడియోలు చేసి హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు.  లాక్‌డౌన్ త‌ర్వాత ఇండియాలో అత్య‌ధికంగా డౌన్‌లోడ్స్ అయిన యాప్స్‌లో టిక్‌టాక్ ముందు వ‌రుస‌లో ఉంది. అయితే ఇదంతా ఒక ఎత్తు.  టీనేజ్ కూడా దాట‌ని చిన్న‌పిల్ల‌లు కూడా టిక్‌టాక్‌కు విప‌రీతంగా అల‌వాటు ప‌డిపోవ‌డం మ‌రోప‌రిణామం. దీన్ని కంట్రోల్ చేయడానికే టిక్‌టాక్ ఇప్పుడు కొత్త ఫీచ‌ర్ తెచ్చింది.  దానిపేరే ఫ్యామిలీ పెయిరింగ్‌.  అదేంటో చూద్దాం రండి.

చైల్డ్ లాక్ లాంటిదే
టీవీలో పిల్ల‌లు ఏవి ప‌డితే అవి చూడ‌కుండా చైల్డ్ లాక్ ఆప్ష‌న్ ఉందా? అలాగే  కంప్యూట‌ర్ బ్రౌజ‌ర్‌లో కూడా ఉంది క‌దా.. ఇదే ఫార్ములాను ఇప్పుడు టిక్‌టాక్ వాడుతోంది అంతే. ఈ ఫ్యామిలీ పెయిరింగ్ ద్వారా చిన్న‌పిల్ల‌లు టిక్‌టాక్ వాడుతున్నా పెద్ద‌వాళ్లు అంత ఆందోళ‌న‌ప‌డాల్సిన అవ‌స‌రం లేకుండా చూడొచ్చు అని టిక్‌టాక్ చెబుతోంది. 

ఇవిగో ఉప‌యోగాలు
* పేరెంట‌ల్ కంట్రోల్స్ చేయ‌డానికి ఈ ఫ్యామిలీ పెయిరింగ్ ఉప‌యోగ‌ప‌డుతుంది. 

* ముందుగా మీరు టిక్‌టాక్ యూజ‌రై అయి ఉండాలి. మీ పిల్ల‌ల టిక్‌టాక్ యూజ‌ర్ నేమ్‌తో క‌నెక్ట‌య్యీ ఈ ఫ్యామిలీ పెయిరింగ్ ఫీచ‌ర్‌ను వాడుకోవాల్సి ఉంటుంది. 

* రెస్ట్రిక్ష‌న్ మోడ్ ద్వారా మీ పిల్ల‌లు ఏ కంటెంట్‌ను ఎంత వ‌ర‌కు చూడొచ్చ‌నేది మీరే డిసైడ్ చేయొచ్చు. అంటే దీని ద్వారా మీరు పిల్ల‌ల్ని అడ‌ల్ట్ కంటెంట్ ఉన్న వీడియోల వైపు వెళ్ల‌కుండా చూడొచ్చు.

* అంతేకాదు మీ పిల్ల‌ల‌కు ఎవ‌రైనా డైరెక్ట్ మెసేజ్ పెట్టి వారితో కాంటాక్ట్ అవుతారేమోన‌ని భ‌య‌ప‌డ‌కుండా దీని ద్వారా రెస్ట్రిక్ట్ చేయొచ్చు. వాళ్ల‌కు ఎవ‌రు డైరెక్ట్‌గా మెసేజ్ చేయొచ్చో మీరే డిసైడ్ చేయండి. 

*  పిల్ల‌లు రోజంతా టిక్‌టాక్‌తోనే గ‌డిపేస్తుంటే వాళ్లు ఎన్నిగంట‌లు దాన్ని చూడొచ్చో కూడా మీరే ఈ ఫ్యామిలీ పెయిరింగ్ ద్వారా కంట్రోల్ చేయ‌వ‌చ్చు.

tiktok tiKtoK Videos tiKtoK Family pairing టిక్‌టాక్‌ టిక్‌టాక్ వీడియోలు టిక్‌టాక్ ఫ్యామిలీ పెయిరింగ్‌ Â