టిక్‌టాక్ యూజ‌ర్ల‌కు శుభవార్త‌.. సేమ్ ఫీచ‌ర్ల‌తో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వ‌చ్చేసింది

చైనా యాప్ టిక్‌టాక్ ఇండియ‌న్ యూజ‌ర్ల‌ను విపరీతంగా ఆక‌ట్టుకుంది. అయితే తాజాగా భార‌త ప్ర‌భుత్వం 59 చైనా యాప్స్‌ను ఇండియాలో నిషేధించింది. దీనిలో టిక్‌టాక్ కూడా ఉంది. ఈ ప‌రిస్థితుల్లో టిక్‌టాక్‌కు ప్ర‌త్యామ్నాయంగా చింగారి, రొపోసో యాప్స్ హ‌డావుడి చేస్తున్నాయి. ఇప్పుడు ఫేస్‌బుక్ గ్రూప్ కూడా టిక్‌టాక్ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవ‌డానికి రంగంలోకి దిగింది. త‌న ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లో రీల్స్ ఫీచ‌ర్‌ను యాడ్ చేసింది. 

ఏమిటీ రీల్స్‌? 
* ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఫీచ‌ర్‌లో టిక్‌టాక్ లాంటి ఫీచ‌ర్లే ఉన్నాయి.

* ఈ యాప్‌లో వీడియోస్ క్రియేట్ చేసుకోవ‌చ్చు. క్రియేటివ్ ఫిల్ట‌ర్స్ యాడ్ చేసుకోవ‌చ్చు. మ్యూజిక్ కూడా క‌ల‌పొచ్చు.

* వీటిని ఇన్‌స్టాగ్రామ్‌లో  షేర్ చేసుకోవ‌చ్చ‌ని ఫేస్‌బుక్ ప్రొడ‌క్ట్స్ వైస్ ప్రెసిడెంట్ విశాల్ షా చెప్పారు. 

* టిక్‌టాక్ లాగానే దీనిలో కూడా పాపుర‌ల్ సాంగ్స్‌, ట్రెండ్స్‌తో కూడిన 15 సెక‌న్ల వీడియోల‌ను అప్‌లోడ్  చేసుకోవ‌చ్చు.  

ఇండియా నాలుగోది
బ్రెజిల్‌, జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్‌ల్లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను ఇప్ప‌టికే తీసుకొచ్చింది. ఇప్పుడు ఇండియా ఈ లిస్ట్‌లో నాలుగో దేశం కాబోతోంది.  

 

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ టిక్‌టాక్ లైక్ ఫీచ‌ర్స్‌ Instagarm Reels TikTok like features