ధరలు.. ఇవి మనకు ఒక పట్టాన కొరుకుడు పడవు. ఒక్కో షాపులో ఒక్కోలా ఉండి... ఒక్కో రోజు ఒక్కోలా మారి మనల్ని తికమక పెడుతుంటాయి. చాలా సందర్భాల్లో మనం ఎక్కువ ధరలకే కొని మోసపోతూ ఉంటాం. ఆ తర్వాత ఆ వస్తువు ధర తక్కువ అని తెలిసి మధనపడుతూ ఉంటాం. ఇది అందరికి అనుభవమే. అయితే ధరల్లో ఎలా మార్పులు వస్తున్నాయి. ఎక్కడ ఎక్కువ ఎక్కడ తక్కువ ధరలు ఉన్నాయి లాంటి విషయాలకు టెక్నాలజీ హెల్ప్ చేస్తే! అదెలా అంటారా? అందుకు ఒక యాప్ ఉంది దాని పేరే యూబిల్. మరి ఈ యాప్ ఎలా పని చేస్తుందో చూద్దామా..
ధరలను కంపేర్ చేసి
ఆన్‌లైన్‌లో దొరికే వస్తువుల ధరలను కంపేర్ చేసేందుకు రెండేళ్ల క్రితమే సాఫ్ట్‌వేర్లు వచ్చాయి. కానీ ఈ సర్వీసులేవీ ఎక్కువ పాపులర్ కాలేదు. కానీ ఇప్పుడు ఇదే సర్వీసులను ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది వాడుతున్నారంటే నమ్మగలరా! ఇలా వాడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇలాంటి వాటిలో ముఖ్యమైంది యూబిల్. ధర కంపారిజన్ కోసం ఎక్కువమంది ఉపయోగిస్తున్న యాప్ ఇది.
యూబిల్ మాత్రమే ఎందుకు?
మనం బెస్ట్ ప్రొడెక్ట్‌ని బెస్ట్ ప్రైస్‌కి అన్నిసార్లూ కొనలేం. చాలాసార్లు అంచనాలు తప్పి నష్టపోతూ ఉంటాం కానీ యూబిల్ లాంటి యాప్ వాడడం వల్ల కంపారిజన్ చాలా సులభంగా ఉంటుంది. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. మీకు ఎన్నో టాప్ రిటైలర్స్ ఉన్నా బెస్ట్ ధరకు ఇచ్చే రిటైలర్స్ ఎవరో తెలుసుకోవడం కోసమే ఈ యాప్ ఉపయోగపడుతుంది. అయితే యూ బిల్ ఏ రిటైలర్స్‌ని సెర్చ్ చేస్తుందనే అనుమానం అందరికి వస్తుంది. అయితే టాప్ 10లో ఉండే రిటైలర్స్ అయిన అమెజాన్, ఈబే, వాల్‌మార్ట్, బెస్ట్ బై లాంటి వాటి నుంచి మాత్రమే ఇది కంపారిజన్స్ అందిస్తుంది.
ఎలా యూజ్ చేయాలి?
యూబిల్ వాడడం చాలా ఈజీ. ఆండ్రాయిడ్ ఫోన్లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని మీకు కావాల్సిన ప్రొడెక్ట్ పేరుని సెర్చ్‌లో టైప్ చేసి ఎంటర్ కొట్టాలి. వెంటనే ఆ ప్రొడెక్ట్‌కు సంబంధించిన వివిధ రేట్లు మీకు కనిపిస్తాయి. ఎందులో మీకు బెస్ట్ ధర ఉందో ఎంచుకుని దాన్ని సెలెక్ట్ చేసుకుని కొనుక్కుంటే చాలు. ఈ కంపారిజన్ వాళ్ల మీరు ఎక్కువ ధరకు ఆ వస్తువును కొనుక్కునే అవకాశమే ఉండదు. సెర్చ్‌రిజల్ట్స్ ఎక్కువగా ఉంటే ఫిల్టర్స్ సాయం తీసుకోవాలి.
Youbil Amazing Price Comparison App