ప్రివ్యూ - కరోనా పేషెంట్లను అనుక్షణం చూసుకునే రోబో..కర్మీ బోట్  

కరోనాతో మానవ సంబంధాలు దెబ్బతినే పరిస్థితి దాపురించింది. మనం ఎక్కడికి వెళ్లలేం. ఎవర్నీ నమ్మలేం. ఎవరన్నా దగ్గినా తుమ్మినా కూడా భయమే. ఎందుకంటే కరోనా మనిషి నుంచి  మనిషికి అంత వేగంగా వ్యాపిస్తోంది. అందుకే సోషల్ డిస్టెన్స్ పేరుతో మనిషికి మనిషికి మధ్య దూరం పాటిస్తున్నారు. కానీ  కరోనా పేషెంట్‌కి చికిత్స చేసే వైద్య సిబ్బంది పరిస్థితి ఏమిటి ? ఇదే ఆలోచించారు అసిమోవ్ రోబోటిక్స్ సీఈఓ జయకృష్ణన్ టి. కరోనా రోగులకు చికిత్సలో సహాయపడేలా రోబోలను రూపొందించారు.  చైనా, స్పెయిన్‌లాంటి దేశాలు ఇప్ప‌టికే క‌రోనా చికిత్స‌లో రోబోల‌ను వాడుతున్నాయి.

ఏడుగురు మ‌నుషులు.. 15 రోజుల ప్రాజెక్టు
కేరళలోని కోచిలో అసిమోవ్ రోబోటిక్స్ అనే స్టార్ట‌ప్‌ కంపెనీ ఉంది. ఈ కంపెనీ కరోనా పేషెంట్లకు చికిత్స చేయడంలో వైద్య సిబ్బందిపై ఒత్తిడి తగ్గించేందుకు రోబోలను తయారు చేసింది. దీనికి కర్మీ బోట్ అని పేరు పెట్టింది. కర్మీ బోట్‌ను ఏడుగురు స్టాఫ్ 15 రోజుల్లో తయారు చేశారు.  

ఐసొలేష‌న్ వార్డుల్లో రోగుల కోస‌మే
ఈ కర్మీ రోబో ముఖ్యంగా ఐసొలేషన్ వార్డుల్లో పనిచెయ్యడానికి వీలుగా డిజైన్ చేశారు. 

* ఈ బోట్‌కు రెండు ట్రేలు అటాచ్ చేశారు. 

* పై అర‌లో శానిటైజర్స్ టిష్యూలు, కింది అరలో ఫుడ్, మెడిసిన్స్ పెట్టి వార్డుల్లోకి పంపిస్తే రోగులందరికీ అందజేస్తుంది. 

*  శానిటైజ‌ర్‌తో క్లీన్ చేసుకుని కింద ఉన్న ఫుడ్‌, మెడిసిన్స్ తీసుకోవ‌చ్చు. 

* మనిషి వెళ్లాల్సిన అవసరం ఉండదు కాబట్టి వైరస్ వ్యాప్తి చెందదు. 

అటాన‌మ‌స్ నావిగేష‌న్‌
కర్మీ రోబొ ఐసొలేషన్ వార్డుల్లో అటు ఇటు తిరుగుతూ రోగులకు ఆహారం,మందులు సర్వ్ చేస్తుంది. ఇది అటానమస్ నావిగేషన్తో పనిచేస్తుంది. ఆవాలంటే రిమోట్ తోనూ పని చేయిచుకోవచ్చు. 

ప‌రిశీలిస్తున్నాం
ప్రస్తుతం రోబో పనితీరును పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నామని జయకృష్ణన్ చెప్పారు.  రోబో బాగానే ప‌ని చేస్తుంద‌న్నారు. విడి భాగాలు దొరికితే రోజుకి ఒక రోబోను తయారు చేయగలమని చెప్పారు.

Carona Virus Carona treatment Carona treatment robot Karmi boat క‌రోనా వైర‌స్‌ కొవిడ్‌-19 క‌రోనా ట్రీట్‌మెంట్‌ క‌ర్మీ బోట్‌ క‌రోనా ట్రీట్‌మెంట్‌కు రోబో Â