ప్రీమియం స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మంచి పేరు తెచ్చుకున్న వన్ప్లస్.. ఓ కొత్త కాన్సెప్ట్ను తీసుకొచ్చింది. కంటికి కనిపించని కెమెరాతో స్మార్ట్ఫోన్ తీసుకురాడమే ఈ కాన్సెప్ట్. దీనికి వన్ప్లస్ కాన్సెప్ట్ వన్ అని పేరు పెట్టి లాస్వెగాస్లో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో (సీఈఎస్) 2020లో ప్రదర్శించింది. వాస్తవానికి వన్ప్లస్కు ఈ షోలో పాల్గొనడం ఇదే మొదటిసారి. అయితే తొలిసారి కాన్సెప్ట్ వన్తో వన్ప్లస్ అందర్నీ కట్టిపడేసింది.
ఏమిటీ కాన్సెప్ట్ వన్?
కంటికి కనిపించని కెమెరాయే ఈ వన్ప్లస్ కాన్సెప్ట్ వన్. అంటే మామూలుగా స్మార్ట్ఫోన్లకు కనిపించినట్లు దీనికి కెమెరా పైకి కనిపించదు. అసలు కెమెరాకు సంబంధించిన ఎలాంటి మెకానికల్ పార్ట్లు గానీ, కావల్సినప్పుడు మాత్రమే పైకి వచ్చే పాప్ అప్ కెమెరా వంటి సెటప్ కూడా ఉండదు. మనకు కెమెరా కావాలని కెమెరా బటన్ను ప్రెస్ చేస్తే ఫోన్ వెనక ఉండే బ్యాక్ కేసే ఒక తెరగా మారిపోతుంది. దాంతోనే మనం ఫోటోలు తీసుకోవచ్చు.
ఎలక్ట్రోక్రోమిక్ గ్లాస్తో సాధ్యం
ఇందుకోసం డివైజ్ల్లో బ్యాక్ ప్యానల్ను ఎలక్ట్రోక్రోమిక్ గ్లాస్ను ఉపయోగిస్తారు. ఈ గ్లాస్ ఎలక్ట్రిసిటీని వినియోగించుకున్నప్పుడు దానిమీద ఉన్న టింట్ (రంగు) మారుతుంది. మనం కెమెరా యాప్ను ఫోన్లో ప్రెస్ చేసినప్పుడు అది కొంత ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది. దాంతో ఈ బ్యాక్ గ్లాస్ కలర్ మారి ట్రాన్స్పరెంట్గా మారుతుంది. అప్పుడు మనం దాన్నే కెమెరాగా ఉపయోగించి ఫోటోలు తీసుకోవచ్చు. ప్రస్తుతానికి బ్యాక్ గ్లాస్ ఇలా ట్రాన్స్పరెంట్గా మారడానికి కొంత సమయం పడుతుందని వన్ప్లస్ చెబుతోంది. కెమెరా యాప్ ఆన్ చేయగానే గ్లాస్ రంగు మారడానికి వీలుగా మరింత వర్క్ చేస్తున్నామని చెబుతోంది.
ఎప్పుడు అందుబాటులోకి వస్తోంది?
త్వరలో రాబోయే తన డివైస్ల్లో ఈ రహస్య కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేయాలని వన్ప్లస్ ఆలోచిస్తోంది. అయితే ఇది కొద్దిగా ఖరీదైన వ్యవహారం. అయితే వన్ప్లస్ ప్రీమియం ఫోన్ల మార్కెట్లోనే ఎక్కువగా కస్టమర్లను కలిగి ఉంది కాబట్టి ధర ఎక్కువైనా పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. వన్ప్లస్ యూజర్లు మాత్రం ఈ కొత్త ఇన్విజిబుల్ కెమెరా ఉన్న ఫోన్లు ఎప్పుడొస్తాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వ‌నà±â€Œà°ªà±à°²â€Œà°¸à± à°¸à±à°®à°¾à°°à±à°Ÿà±â€Œà°«à±‹à°¨à±â€Œ వ‌నà±â€Œà°ªà±à°²â€Œà°¸à± కానà±à°¸à±†à°ªà±à°Ÿà± వ‌నà±â€Œ వ‌నà±â€Œà°ªà±à°²â€Œà°¸à± ఇనà±â€Œà°µà°¿à°œà°¿à°¬à±à°²à± కెమెరా Oneplus Concept one Oneplus smart phones Oneplus invisible cameraÂ