మంచి ఫోటో తీశారు. దాన్ని ఇన్స్టాగ్రామ్లోనో, ఎఫ్బీలో లేదా ట్విట్టర్లోనో పోస్ట్ చేయాలనుకున్నారు. కానీ దానికి ఏం క్యాప్షన్ పెట్టాలో, ఎలాంటి హ్యాష్ట్యాగ్స్ ఇవ్వాలో తెలియడం లేదా? అయితే మీకు క్యాప్షన్ 8 అని ఆండ్రాయిడ్ యాప్ సహాయపడుతుంది. ఆండ్రాయిడ్లో ఫోటోలకు ఇన్స్టంట్గా క్యాప్షన్లు, హ్యాష్ట్యాగ్స్ సమకూర్చే యాప్ గురించి తెలుసుకుందాం.
క్యాప్షన్ 8
ప్లే స్టోర్లోకి వెళ్లి క్యాప్షన్ 8 (Caption 8) ఆండ్రాయిడ్ యాప్ను డౌన్లోడ్ చేసి మీ మొబైల్లో ఇన్స్టాల్ చేయండి.
* యాప్ను ఓపెన్ చేసి స్క్రీన్ మీద టచ్ చేస్తే ఫోటో ఓపెన్ అవుతుంది. లేదా మొబైల్ కెమెరాతో ఫోటో తీయండి.
* ఫోటో తీయగానే సుమారు 13 హ్యాష్ట్యాగ్స్, క్యాప్షన్ ఫోటోకు యాడ్ అవుతాయి.
* ఉదాహరణకు మీరు ఒక ఒక డ్రెస్ ఫోటో తీస్తే ఫ్యాషన్, ఫాలో, పిక్ అఫ్ ది డే, ఫ్యాషన్ వరల్డ్, టుడేస్ ఫ్యాషన్ ఇలా రకరకాల హ్యాష్ట్యాగ్స్ ఫోటోకు యాడ్ అవుతాయి.
* మీకు ఏదైనా హ్యాష్ట్యాగ్ ఫోటోకు సంబంధం లేనట్లుగా ఉందనిపిస్తే వేరే దాంతో రీప్లేస్ చేయొచ్చు.
* మీ ఫోటోతో హ్యాష్ట్యాగ్స్ కావాలనుకుంటే యాడ్ అనే ఆప్షన్ నొక్కి యాడ్ చేసుకోవచ్చు.
* ఇప్పుడు హ్యాష్ట్యాగ్స్, క్యాప్షన్ ను కాపీ చేసి సోషల్ మీడియాలో మీ ఫోటోతో పాటు షేర్ చేయొచ్చు.
* అంతేకాదు యాప్లో హ్యాష్ట్యాగ్స్ ప్రిఫరెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాప్ సెట్టింగ్స్లోకి వెళ్లి ఫోన్ హ్యాష్ట్యాగ్స్. లొకేషన్ హ్యాష్ట్యాగ్స్, ట్రెండింగ్ హ్యాష్ట్యాగ్స్లో నుంచి మీకు కావలసిన దాన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు.
నచ్చిన క్యాప్షన్ పెట్టుకోండి
క్యాప్షన్ 8 యాప్లో ఫోటో క్యాప్షన్ కూడా వస్తుంది. అది మీకు నచ్చకపోతే లెఫ్ట్కి స్వైప్ చేస్తే మరో కొత్త క్యాప్షన్ జనరేట్ అవుతుంది. అలా మీకు నచ్చిన క్యాప్షన్ వచ్చేవరకు స్వైప్ చేస్తూ ట్రై చేయొచ్చు.
కోట్స్ కూడా..
ఈ యాప్ హోం పేజీలో కోట్స్ కూడా ఉంటాయి. పేజీ కింది భాగంలో ఉండే కోట్స్ బటన్ను టాప్ చేస్తే కోట్స్ కనిపిస్తాయి. నచ్చితే కాపీ చేసుకుని వాట్సాప్ లేదా ఫేస్బుక్లో షేర్ చేసుకోవచ్చు.
ఫోటోల‌కౠహà±à°¯à°¾à°·à±â€Œà°Ÿà±à°¯à°¾à°—à±à°¸à±â€Œ à°•à±à°¯à°¾à°ªà±à°·â€Œà°¨à±à°¸à±  హà±à°¯à°¾à°·à±â€Œà°Ÿà±à°¯à°¾à°—à±à°¸à± జ‌న‌రేటౠచేసే యాపà±â€Œ à°•à±à°¯à°¾à°ªà±à°·â€Œà°¨à± 8 Caption 8 Hash tags generating app captionsÂ