ప్రివ్యూ - మ‌నం స‌రిగా కూర్చున్నామో లేదో స‌రిదిద్దే పోస్చ‌ర్ క‌రెక్ష‌న్ సైట్

మ‌నం కంప్యూట‌ర్ ముందు కూర్చుంటాం.. కాసేప‌టికే మ‌న‌కు తెలియ‌కుండానే మెడ నొప్పో లేదా వెన్నునొప్పో మొద‌లువుతుంది. దీనికి మ‌నం కూర్చునే భంగిమే కార‌ణం. మ‌నం కూర్చునే తీరును స‌రిదిద్ది మంచిగా కూర్చోబెట్ట‌డానికి కూడా టెక్నాల‌జీ హెల్ప్ చేస్తుంది. విన‌డానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఇందుకోసం కొన్ని వెబ్‌సైట్‌లు కూడా ఉన్నాయి. మ‌రి ఆ వెబ్‌సైట్‌లు ఏంటో.. ఎలా ప‌ని చేస్తాయో తెలుసుకుందాం...

టెన్సార్ ఫ్లో టెక్నాల‌జీ
మ‌నం కూర్చునే భంగిమ‌ను స‌రిదిద్ద‌డానికి పోస్చ‌ర్ క‌రెక్షన్ వెబ్‌సైట్ వ‌చ్చింది. ఇది కంప్యూట‌ర్ ముందు మ‌న పోస్చ‌ర్ క‌రెక్ట్‌గా ఉందే లోదో మన‌కు తెలియ‌జేస్తుంది. ఇందుకోసం ఈ వెబ్‌సైట్ టెన్సార్ ఫ్లో అనే టెక్నాల‌జీని యూజ్ చేస్తుంది. మిష‌న్ లెర్నింగ్ కోసం యూజ్ చేసే ఓపెన్ సోర్స్ ఫ్లాట్‌ఫాం పేరే టెన్సార్ ఫ్లో. ఈ వెబ్ సైట్ మీ కంప్యూట‌ర్లోని వెబ్ కామ్ ద్వారా మీరు కూర్చున్న తీరుని గ‌మ‌నించి టెన్సార్ ఫ్లో టెక్నాల‌జీని యూజ్ చేసి మీరు స‌రిగా కూర్చున్నారో లేదా ఎలా కూర్చోవాలో కూడా స‌ల‌హాలు ఇస్తుంది.  ఇందుకోసం మ‌న‌కు కొన్ని స‌జీష‌న్ల‌తో కూడిన సందేశాలు పంపిస్తుంది.

ఎలా ప‌ని చేస్తుందంటే..
పోస్చ‌ర్ క‌రెక్ష‌న్ వెబ్‌సైట్‌లోకి వెళ్లిన త‌ర్వాత ఒక పాప‌ప్ మెనూ క‌నిపిస్తుంది. మీ కంప్యూట‌ర్ వెబ్ కామ్‌ని ఎక్సెస్ చేయ‌డానికి ప‌ర్మిష‌న్లు ఇవ్వాల్సిందిగా ఈ పాపొప్ మెనూలో సందేశం క‌నిపిస్తుంది. మీరు ప‌ర్మిష‌న్ ఇచ్చిన త‌ర్వాత మీ కెమెరా వ‌ర్క్ చేయ‌డం మొదలుపెడుతుంది. మీ ముందు వీడియో ఐకాన్ ప్ర‌త్య‌క్షం అవుతుంది. ఇందులో స్టార్ట్ బ‌ట‌న్ క్లిక్ చేస్తే ఈ వెబ్‌సైట్ మీ బాడీ పోర్చ‌ర్‌ని వ్యూ చేయ‌డం స్టార్ట్ చేస్తుంది. కాసేప‌టికి మీకు ఎలా కూర్చున్నారు... స‌రైన భంగిమ‌లో ఉన్నారా ఇంకా నిటారుగా ఉండాలా.. లేదా ప్ర‌స్తుత పొజిష‌న్ స‌రిపోతుందా.. ఇంకా ఎత్తులో కూర్చోవాలా లాంటి స‌జిష‌న్లు ఇది ఇస్తుంది. 

POSTURE CORRECTION WEBSITE BLURS SCREEN NOT SITTING UPRIGHT