ఈ- కామర్స్లో ఇండియాలో టాప్ పొజిషన్లో ఉన్న సంస్థ ఫ్లిప్కార్ట్. లక్షలాది మంది యూజర్ల నమ్మకాన్ని సంపాదించుకున్న ఫ్లిప్కార్ట్ తన యూజర్ల సౌలభ్యం కోసం ఒక వాయిస్ అసిస్టెంట్ను ప్రవేశపెట్టింది. దీనికి ఫ్లిప్కార్ట్ సాథీ అని పేరు పెట్టింది.
దీని అవసరమేంటి?
తొలిసారి ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసేవారికి ఈ ఫ్లిప్కార్ట్ సాథీ గైడ్గా ఉపయోగపడుతుందని ఫ్లిప్కార్ట్ చెబుతోంది. ప్రస్తుతం సిటీలు, పెద్ద పట్టణాల్లోనే ఫ్లిప్కార్ట్ యూజర్లు ఎక్కువగా ఉంటున్నారు. చిన్న పట్టణాలు, గ్రామాల్లో ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసేవారి సంఖ్య చాలా స్వల్పం. ఈ-కామర్స్లో పెరుగుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని గ్రామాల వరకు విస్తరించాలన్నది ఫ్లిప్కార్ట్ ఆలోచన. అందుకే అందరూ తమ ఈ-కామర్స్ ఫ్లాట్ఫాంను వినియోగించుకునేలా ఈ ఫ్లిప్కార్ట్ సాథీని ప్రవేశపెట్టింది.
ఎలా పని చేస్తుంది?
* షాప్కి వెళితే మనకు ఏం కావాలో అడుగుతాం. సేల్స్ పర్సన్స్ చూపిస్తాడు. నచ్చింది తీసుకుని బిల్ కట్టి సరుకు తెచ్చుకుంటాం.
* ఈ-కామర్స్లో అంతా వెబ్ లేదా యాప్లోనే ఉంటుంది. దాన్ని అలవాటు లేని వారు యాక్సెస్ చేయడం కొత్తలో కాస్త గందరగోళంగా ఉంటుంది. అందుకే ఫ్లిప్కార్ట్లో వస్తువులు ఎలా చూడాలి? వాటిని కార్ట్లో ఎలా యాడ్ చేసుకోవాలి? షిప్పింగ్ అడ్రస్ ఎలా ఇవ్వాలి? పేమెంట్ ఎలా చేయాలి? ఇలాంటివి గ్రామీణ ప్రాంతాల్లో వారికి కూడా అర్ధమయ్యేలా ఈ వాయిస్ అసిస్టెంట్ చెబుతుంది. ఇంగ్లీష్, హిందీల్లో ఫ్లిప్కార్ట్ సాథీ వాయిస్ వస్తుంది.
* ఫ్లిప్కార్ట్ సాథీ ఐకాన్ ఫ్లిప్కార్ట్ యాప్ లేదా వెబ్లో టాప్లో ఉంటుంది. యూజర్ ప్రొడక్ట్ను చూడడం నుంచి బిల్ పే చేసేవరకు ఏం చేయాలో ఇది విజువల్గా చూపిస్తుంది. వాయిస్తో కూడా వినిపిస్తుంది.
* అయితే మీరు సాథీతో మాట్లాడలేరు. ఇది ఓన్లీ వన్వే వాయిస్ ఆప్షన్. అది కూడా ముందుగానే సెట్ చేసిపెట్టిన పనులు మాత్రమే చేయగలుగుతుంది. అప్పటికప్పుడు మీరు కొత్త డౌట్ అడిగితే అది చెప్పలేదు. అందుకే దీన్ని వన్వేలో పెట్టారు.
అమెజాన్ అలెక్సాలో భిన్నంగా..
అదే మరో ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్లో అయితే ఇలా ఉండదు. అమెజాన్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అసిస్టెంట్ అలెక్సా సాయంతో మనం అమెజాన్లో షాపింగ్ చేయొచ్చు. దీనిలో అలెక్సా పవర్డ్ స్మార్ట్ స్పీకర్ ఉంటుంది. మనకు ఏం కావాలో అడిగితే ఆ ప్రొడక్ట్ను మనకు చూపిస్తుంది. మన వెబ్సైట్ లేదా యాప్ అంతా చూడాల్సిన పని లేకుండా అలెక్సానే ఆ ప్రొడక్ట్ను సెర్చ్ చేసి మనకు అందిస్తుంది. మనం బిల్ పే చేసి వస్తువు తెప్పించుకోవడం అంతెందుకు ప్రొడక్ట్స్ మీద డిస్కౌంట్ గురించి కూడా అలెక్సాతో డిస్కస్ చేసి చేయించుకోవచ్చు.
Flipkart’s smart assistant Flipkart Saathi e-commerce voice assistant à°«à±à°²à°¿à°ªà±â€Œà°•ారà±à°Ÿà± వాయిసౠఅసిసà±à°Ÿà±†à°‚à°Ÿà±â€Œ à°«à±à°²à°¿à°ªà±â€Œà°•ారà±à°Ÿà± à°¸à±à°®à°¾à°°à±à°Ÿà± అసిసà±à°Ÿà±†à°‚à°Ÿà±â€Œ à°«à±à°²à°¿à°ªà±â€Œà°•ారà±à°Ÿà± సాథీ ఈకామ‌రà±à°¸à± వాయిసౠఅసిసà±à°Ÿà±†à°‚à°Ÿà±â€Œ