గూగుల్ మెసేజస్.. ప్రపంచంలో ఎక్కువమంది ఉపయోగించే మెసేజింగ్ ఫీచర్లలో ఇదొకటి.. కానీ యూజర్ల అవసరాలకు తగ్గట్టు వారు మరింత సులభంగా మెసేజింగ్ చేసుకునే విధంగా గూగుల్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేస్తోంది. గూగుల్ తీసుకొచ్చిన ఆర్సీఎస్ బేస్డ్ చాట్ ఎక్కువమందిని ఆకర్షించింది. అయితే మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా గూగుల్ తన ఆర్సీఎస్ బేస్డ్ మెసేజింగ్ కొన్ని మార్పులు తీసుకొచ్చింది.
రిచ్ కమ్యునికేషన్ సర్వీసెస్
గూగుల్ ఎల్‌రోల్ చేసిన సర్వీసుల్లో రిచ్ కమ్యునికేషన్ సర్వీసెస్(ఆర్సీఎస్) ఒకటి. భిన్నమైన చాటింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ సంస్థ కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చింది. వాట్సప్, టెలిగ్రామ్ మాదిరిగానే జీఐఎఫ్, ఎమోజీ, స్టిక్కర్లు, వీడియో, ఆడియో మెసేజ్‌లు పంపుకోవడం దీని ప్రత్యేకత. వైఫై లేదా మొబైల్ డేటా ద్వారా ఇది పని చేస్తుంది. ఈ గూగుల్ మెసేజింగ్ యాప్‌కి ఆర్సీఎస్ సపోర్ట్ కావాలంటే మీరు బేటా వెర్షన్ 5.2.501 ను ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ ప్లే ద్వారా దీన్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. మీరు ఈ బేటా వెర్షన్‌ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాక్టివిటీ లాంచర్ యాప్‌ని మీ ఆండ్రాయిడ్ డివైజ్‌లో తీసుకు రావాల్సి ఉంటుంది.
ఏం చేయాలంటే..
1. మీ మెసేజింగ్ యాప్‌కు ఆర్సీఎస్ సపోర్ట్ కావాలంటే ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో వైఫై టర్న్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత యాక్టివిటీ లాంచర్ యాప్‌ని ఓపెన్ చేయాలి
2.ఇందులో ఉండే లిస్టులో మెసేజ్ యాప్‌ని వెతకాలి. దానికి ఆర్సీఎస్ ఫ్లాగ్ ఆప్షన్ పెట్టాలి
3. ఆ తర్వాత ఏసీఎస్ యూఆర్ ఎల్ ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి
4. ఆ తర్వాత ఓటీపీ ప్యాట్రన్ మీద సెలెక్ట్ చేసుకోవాలి
5. ఆ తర్వాత అప్లై బటన్ మీద క్లిక్ చేయాలి.
Google Messages RCS-Based Chat Android Device