వాక్‌మన్ గుర్తుందా? 90ల్లో యూత్‌కు ఇదో పెద్ద క్రేజ్. అరచేతిలో ఇమిడే క్యాసెట్ ప్లేయర్, దాని నుంచి రెండు ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని మ్యూజిక్ హమ్ చేస్తూ యూత్ మస్తు ఎంజాయ్ చేసేవారు. తర్వాత చిటికెన వేలి సైజ్‌లో ఉండే ఎంపీ 3 ప్లేయర్స్ వచ్చేశాయి. దానికితోడు ఈ ఎంపీ3 ప్లేయర్స్‌కి క్యాసెట్ అక్కర్లేదు. నేరుగా పీసీకి కనెక్ట్ చేసుకుని సాంగ్స్ డౌన్‌లోడ్ చేసుకుని వినొచ్చు. అయితే స్మార్ట్‌ఫోన్లు వచ్చాక వీటికీ విలువ పడిపోయింది. మొబైల్ ఇంటర్నెట్ చౌకవడంతో అసలు ఎంపీ3 సబ్‌స్క్రిప్షన్లు కూడా ఎవరూ కొనడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సోనీ కంపెనీ మళ్లీ వాక్‌మన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. అయితే ఈసారి ఆండ్రాయిడ్‌తో పనిచేసే స్మార్ట్ వాక్‌మన్‌తో ఎంటరయింది. దాని కథేంటో చూద్దాం రండి
24వేల రూపాయల ధర
సోనీ ఎన్‌డబ్ల్యూఏ 105 వాక్‌మన్ దీని పేరు. ఇండియాలో దీని ఖరీదు 24వేల రూపాయలు. స్మార్ట్‌ఫోన్ తరానికి తగ్గట్లు దీన్ని చాలా అద్భుతంగా సోనీ తీర్చిదిద్దింది. 3.5 అంగుళాల డివైస్. ఫుల్ హెచ్‌డీ స్క్రీన్ దీని సొంతం. బరువు 100 గ్రాముల్లోపే ఉంటుంది. అంటే మన స్మార్ట్‌ఫోన్ కంటే తేలికే.
* కుడివైపున ఫిజికల్ బటన్లు ఉంటాయి. ఇవి మ్యూజిక్‌ను కంట్రోల్ చేస్తాయి. ప్లే/ పాజ్, వాల్యూమ్, స్కిప్ ఫార్వర్డ్ లేదా స్కిప్ బాక్‌వర్డ్ బటన్లు ఉంటాయి.
* వాక్‌మన్ కింది భాగంలో యూఎస్‌బీ సీ పోర్ట్ ఉంటుంది. దీనితో మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు.
* ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ కోసం మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ కూడా ఉంది. వాక్‌మన్‌తో పాటు వైర్డ్ హెడ్‌ఫోన్స్ ఇస్తుంది.
ఫస్ట్ ఆండ్రాయిడ్ వాక్‌మన్
ఇది ప్రపంచంలోనే తొలి ఆండ్రాయిడ్ బేస్డ్ వాక్‌మన్ అని సోనీ గర్వంగా ప్రకటించుకుంటోంది. యాపిల్ మ్యూజిక్, స్ఫూటిఫై లాంటి మీ మ్యూజిక్ యాప్సన్నీ తనే డౌన్‌లోడ్ చేసి మీకు వాటిలోని సాంగ్స్ వినిపించడం ఈ సోనీ ఎన్‌డబ్ల్యూఏ 105 వాక్‌మన్ ప్రత్యేకత. ఒకసారి ఛార్జి చేస్తే 26 గంటలపాటు దీనిలో పాటలు వినొచ్చని సోనీ చోబుతోంది.
ఏయే ఫార్మాట్లు పని చేస్తాయి?
ఎస్ మాస్టర్ హెచ్ఎక్స్ డిజిటల్ యాంప్లిఫైయర్ ఉండటంతో చాలా క్రిస్ప్ ఆడియో వినొచ్చు. ఈ వాక్‌మన్ 320 కేబీపీఎస్ వరకు సైజు ఉన్న ఎంపీ3 సాంగ్స్‌ను ప్లే చేస్తుంది. అలాగే 192 కేబీఎస్ వరకు సైజున్న డబ్ల్యుఎంఏ, ఎఫ్ఎల్ఏసీ, ఏఏసీ, ఎంపీ 4, ఏఐఎఫ్, డీఎస్‌డీ, పీసీఎం లాంటి ఫార్మాట్లన్నింటినీ ప్లే చేస్తుంది.
ఈ డబ్బులకు స్మార్ట్‌ఫోన్ వస్తుందిగా
24వేల రూపాయలు పెడితే సూపర్ ఫీచర్లతో 6 నుంచి 8 జీబీ ర్యామ్‌తో సూపర్ ఫాస్ట్‌గా పని చేసే స్మార్ట్‌ఫోన్ వస్తుందిగా అనుకోవచ్చు. కానీ దేని విలువ దానిదే. మూడున్నర అంగుళాల ఈ డివైస్‌ను చేత్తో పట్టుకుని లేదా జేబులో పట్టుకుని వాకింగ్, జాకింగ్‌కో వెళ్లొచ్చు. అందులో ప్రపంచ ప్రఖ్యాత సోనీ ఆడియో డివైస్ కాబట్టి సూపర్ క్వాలిటీ ఆడియో వినొచ్చు. వాకింగ్, జాకింగ్ కూడా ఫోన్ ఎందుకులే అనుకున్నా తోడుగా మ్యూజిక్ ఉంటే బాగుందనుకునేవాళ్లకు ఇది మంచి ఆప్షన్. అలాగే జిమ్‌కి వెళ్లేవాళ్లు ఆర్మ్‌బాండ్‌లో అయినా దీన్ని పెట్టేసుకోవచ్చు.
Sony Walkman Sony NW-A105 Walkman Sony NW-A105 Walkman review తొలి ఆండà±à°°à°¾à°¯à°¿à°¡à± వాకà±â€Œà°®â€Œà°¨à±â€Œ సోనీ à°Žà°¨à±â€Œà°¡â€Œà°¬à±à°²à±à°¯à±‚à° 105 వాకà±â€Œà°®â€Œà°¨à±â€Œ