ప్రివ్యూ - మ‌న మెసేజింగ్ విధానాన్ని స‌మూలంగా మార్చ‌నున్న ఆర్‌సీఎస్‌

యాపిల్ లాంటి ఐవోఎస్ డివైస్‌ల‌తో పోల్చుకుంటే  ఆండ్రాయిడ్‌లో చాలా ఉప‌యోగాలున్నాయి. ధ‌ర త‌క్కువ‌.  ప్లేస్టోర్‌లో ఫ్రీగా ల‌క్ష‌ల యాప్స్‌, గూగుల్ డ్రైవ్‌లో ఫ్రీ స్టోరేజ్ ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ మెసేజింగ్ విష‌యానికి వ‌స్తే మాత్రం యాపిల్స్ ఐ మెసేజ్‌లో ఉన్న ఫీచ‌ర్లు ఆండ్రాయిడ్‌లో క‌న‌ప‌డ‌వు.  ఈ లోటును తీర్చుకోవ‌డానికి గూగుల్ చాలాకాలంగా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. లేటెస్ట్‌గా రిచ్ క‌మ్యూనికేష‌న్ స‌ర్వీసెస్ (ఆర్‌సీఎస్‌) పేరిట ఓ మెసేజింగ్ ఫీచ‌ర్‌ను డెవ‌ల‌ప్ చేసింది. ఇది వ‌స్తే ఆండ్రాయిడ్ డివైస్‌ల్లో మ‌న మెసేజింగ్ విధానం స‌మూలంగా మారిపోతుందంటోంది గూగుల్‌.

ఏమిటీ ఆర్‌సీఎస్‌? 
ఆర్‌సీఎస్ అనేది ఫోన్‌కి, క్యారియ‌ర్‌కి మ‌ధ్య ఓ క‌మ్యూనికేష‌న్ ప్రొటోకాల్‌.  ఇప్ప‌టికే మ‌న ఫోన్ల‌లో ఉన్న ఎస్ఎంఎస్‌, ఎంఎంఎస్‌ల‌ను ఈ ఆర్‌సీఎస్ త్వ‌రంలో రీప్లేస్ చేయ‌బోతోంది. అంటే ఈ రెండింటి ప‌ని ఆర్‌సీఎస్‌తోనే చక్క‌బెట్టుకోవ‌చ్చు. యాపిల్ ఫోన్ల‌లో ఉండే ఐ మెసేజ్ స్థాయి మెసేజింగ్ ఎక్స్‌పీరియ‌న్స్‌ను ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు అందించడం కోస‌మే గూగుల్ ఈ ఆర్‌సీఎస్‌ను అందుబాటులోకి తెస్తోంది. అంతేకాదు వాట్సాప్‌, ఫేస్‌బుక్ మెసెంజ‌ర్ల‌కు కూడా ఇది దీటుగా నిల‌వ‌బోతుందని గూగుల్ న‌మ్మ‌కం.

ఆర్‌సీఎస్ హైలెట్స్ 
* ఆర్‌సీఎస్ ఐ మెసేజ్‌, వాట్సాప్‌ల మాదిరిగా రిచ్ టెక్స్ట్ క‌న్వ‌ర్సేష‌న్ల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది.

* టైపింగ్ ఇండికేట‌ర్‌, పెద్ద గ్రూప్‌లు, మ‌ల్టీమీడియా స‌పోర్ట్ ఉంటాయి.

* ఎస్ఎంఎస్‌లో క్యారెక్ట‌ర్లు (లెట‌ర్స్ లేదా సింబ‌ల్స్‌కి) లిమిట్ ఉంటుంది. ఆర్‌సీఎస్‌లో అలాంటి లిమిట్ ఏమీ ఉండ‌దు. ఎఉన్ని ప‌దాలైనా, సింబ‌ల్స‌యినా ఒక‌టే మెసేజ్‌లో పంపేయొచ్చు. 

* వాట్సాప్‌, ఫేస్‌బుక్ మెసెంజ‌ర్ మాదిరిగా ఆర్‌సీఎస్‌లో వీడియో కాలింగ్ స‌దుపాయం కూడా ఉండటం మ‌రో హైలెట్‌. 

డేటా క‌నెక్ష‌న్ ఉండాల్సిందే 
అయితే మామూలు మెసేజింగ్‌తో పోల్చితే ఆర్‌సీఎస్‌లో ఉన్న డిస్ అడ్వాంటేజ్ ఒక‌టే.  మామూలు మెసేజ్‌ల‌కు ఇంట‌ర్నెట్‌తో ప‌ని లేదు. ఆర్‌సీఎస్‌కి డేటాక‌నెక్ష‌న్ త‌ప్ప‌నిస‌రి.  మ‌న మెసేజ్ రిసీవ్ చేసుకునే వారికి కూడా ఆర్‌సీఎస్ ఉండాలి. లేదంటే ఇది మామూలు ఎస్ఎంఎస్‌లాగానే వారికి చేరుతుంది. అంటే అప్పుడు ఆర్‌సీఎస్ ఫ‌లితం  ఉండ‌దు. 

ఎప్పుడు  వ‌స్తుంది?
ఆర్‌సీఎస్‌ను ఈ ఏడాది జూన్‌లో యూఎస్‌లో అందుబాటులోకి తెస్తామ‌ని గూగుల్ ప్ర‌క‌టించింది. త‌ర్వాత యూకే, ఫ్రాన్స్‌ల్లోనూ ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని చెప్పింది. కానీ ఇంకా పట్టాలెక్క‌లేదు. ఆర్‌సీఎస్‌ను రిలీజ్ చేసే ముందు మొబైల్ ఫోన్ క్యారియ‌ర్లు అంటే టెలికం నెట్‌వ‌ర్క్‌ల‌ను ఇందుకు సిద్ధం చేయాల్సి ఉంది.  అంతేకాదు ఆర్‌సీఎస్ ప‌నిచేసేలా ఒక యాప్‌ను డెవ‌ల‌ప్ చేసే ఆలోచ‌న‌లో గూగుల్ ఉంది. వ‌చ్చే సంవ‌త్స‌రం ఈ రిచ్ క‌మ్యూనికేష‌న్ స‌ర్వీసెస్  (ఆర్‌సీఎస్‌) ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. 

ఆండ్రాయిడ్‌లో కొత్త‌ మెసేజింగ్ సిస్ట‌మ్‌ రిచ్ క‌మ్యూనికేష‌న్ స‌ర్వీసెస్‌ ఆర్‌సీఎస్‌ Android messaging system Rich communication service RCS