ఆన్లైన్లో ఉన్నామంటే మనకు ఏవేవో మెసేజ్‌లు వస్తుంటాయి. అన్నింటిని మనం పట్టింకోం. కొన్ని మాత్రం మన మీద బాగా ప్రభావం చూపిస్తాయి. కొన్ని నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తాయి. మరి ఇలాంటి మెసేజ్‌లు మన మనోభావాలను దెబ్బతీస్తుంది.. ప్రమాదకరమైందా అని తెలుసుకోవడం ఎలా?.. దీని కోసం కూడా ఒక వెబ్సైట్ ఉంది.. అదేంటో చూద్దాం..
ఇజ్ దిజ్ అప్రాప్రియేట్?
ఆన్లైన్లో చాలా మెసేజ్‌లు చాలా అఫెన్సివ్‌గా ఉంటాయి. వాటిని ఎవరు క్రియేట్ చేశారో ఎందుకు పబ్లిక్ చేస్తున్నారో కూడా మనకు తెలియదు. కానీ వాటి ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి నిజంగా ప్రతి ఒక్కరిని తెలియకుండానే హెరాస్ చేస్తుంటాయి. ఇలాంటి మెసేజ్‌ల నిగ్గు తేల్చడం కోసం ఒక వెబ్సైట్ వచ్చేసింది దాని పేరు ఇజ్ దిస్ అప్రాప్రియేట్.. ఇదో ఉచిత వెబ్సైట్. మీకు వచ్చిన టాక్సిక్ మెసేజ్‌లను ఈ వెబ్సైట్లో పేస్ట్ చేసి ఇవి ఎంతవరకు ప్రమాదకరమో తెలుసుకోవచ్చు. ఇది ప్రస్తుతం ఇంగ్లిష్ ఇతర లాటిన్ లాంగ్వేజ్‌లను సపోర్ట్ చేస్తుంది. ఈ మేసేజ్‌తో పాటు మీ మెయిల్ ఐడీ సెండ్ చేస్తే రిజల్ట్స్ ఈ మెయిల్‌కు వస్తాయి. దీనిలో టాక్సిక్ శాతం ఎంతో.. ఎంత ప్రభావం ఉంటుందో అనే వివరాలు ఉంటాయి.
ఎలా పని చేస్తుందంటే..
ముందుగా మీరు ఇజ్ దిజ్ అప్రాప్రియేట్ సైట్‌కు వెళ్లాలి. మీరు అనుకున్న మెసేజ్‌లను టైప్ చేయాలి. లేదా పేస్ట్ చేయాలి. ఆ తర్వాత మెయిల్ ఐడీ కాలమ్‌లో మీ మెయిల్ ఐడీ ఇవ్వాలి. ఒకసారి మెసేజ్ ఇచ్చి సబ్మిట్ కొట్టగానే మీ పని పూర్తయినట్లే. కొన్నినిమిషాల్లోనే మీ మెయిల్‌కు మీ మెసేజ్‌లకు సంబంధించిన రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ మీకు ఏ మెయిల్ రాకపోతే స్పామ్ ఫోల్డర్లో చెక్ చేయాలి.
CHECK MESSAGE CULTURALLY OFFENSIVE HARASSING WEBSITE