చౌకగా, మంచి ఫీచర్లతో స్మార్ట్ఫోన్లు అందిస్తూ ఇండియన్ మార్కెట్లో టాప్ ప్లేస్ కొట్టేసిన షియోమి.. ఇప్పుడు వేరబుల్స్ వ్యాపారం మీదా కన్నేసింది. సాధారణంగా వేరబుల్ గ్యాడ్జెట్లు మూడు, నాలుగు వేల రూపాయల కనీస ధరతో వస్తున్నాయి. అయితే రెడ్మీ స్మార్ట్‌బాండ్ పేరుతో తీసుకురానున్న ఈ స్మార్ట్‌బాండ్ ధర 1,100 వరకు మాత్రమే ఉంటుందని అంచనా.
ఇవీ ఫీచర్లు
రెడ్మీ బ్రాండింగ్‌తో వస్తున్న తొలి స్మార్ట్ బాండ్ ఇదే. ఇంతకు ముందున్నవన్నీ ఎంఐ బ్రాండ్‌తో వచ్చాయి.
|* 1.08 ఇంచెస్ కలర్ డిస్ప్లే
* హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సర్
* స్లీప్ మానిటర్
* వాటర్ రెసిస్టెంట్
* ఐదు స్పోర్ట్స్ మోడ్స్
ధర?
చైనాలో 99 చైనీస్ యెన్స్ ధర పెట్టారు. దీన్ని ఇండియన్ కరెన్సీలో లెక్కిస్తే 1,100 రూపాయల వరకు ఉండొచ్చు. ఇదే ధరకు ఇండియాలో లాంచ్ చేస్తుందా? ధర పెంచుతుందా అనేది తెలియాలంటే మరో రెండు రోజులు (సెప్టెంబర్ 8న లాంచింగ్) వేచి చూడాల్సిందే.
రెడà±â€Œà°®à±€ à°¸à±à°®à°¾à°°à±à°Ÿà± à°¬à±à°¯à°¾à°‚à°¡à±â€Œ à°¸à±à°®à°¾à°°à±à°Ÿà± బాండà±à°¸à±â€Œ Redmi Smart Band Smart Bands