వాట్సాప్‌తో ఇన్‌స్టంట్‌గా బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసే అద్భుత టూల్ స్ప్రింగ్ వెరిఫై

ఆధార్ నెంబ‌ర్‌, డ్రైవింగ్ లైసెన్స్ నెంబ‌ర్‌, పాన్ కార్డ్ నెంబ‌ర్ ఇలా మీ ఐడెంటీ కార్డ్ నెంబ‌ర్ ఎంట‌ర్ చేస్తే చాలు వాటిని వెరిఫై చేసే ఓ అద్భుత‌మైన టూల్ అందుబాటులోకి వ‌చ్చింది. ఇది వాట్సాప్ బేస్డ్‌గా ప‌ని చేస్తుంది. స్ప్రింగ్‌ఫీల్డ్ వెరిఫై అనే హెచ్ఆర్ కంపెనీ గ‌త నెల‌లో దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. మీరు మీ ఐడీ నెంబ‌ర్ ఎంట‌ర్ చేస్తే సంబంధిత ప్ర‌భుత్వ శాఖ‌ల స‌ర్వ‌ర్‌ను యాక్సెస్ చేయ‌డం దీనిలో ప్ర‌త్యేక‌త‌.

ఇవీ స‌ర్వీసులు
ఏ వ్య‌క్తికి  సంబంధించిన గవ‌ర్న‌మెంట్ ఐడీనైనా అథెంటికేట్ చేయ‌డం ఈ టూల్ ప‌ని. ఆధార్ కార్డ్‌, పాన్ కార్డ్‌, ఓట‌ర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్‌ను అథెంటికేట్ చేస్తుంది. ఆధార్ మాతృసంస్థఅయిన యూఐడీఏఐ స‌ర్వ‌ర్‌ను అప్రోచ్ అవుతుంది. అలాగే ఎల‌క్టోర‌ల్ రోల్‌, సార‌థి, ఎన్‌సీడీఎల్ స‌ర్వ‌ర్ల సాయంతో మీ ఐడీని అథెంటికేట్ చేస్తుంది. ఫేషియ‌ల్ వెరిఫికేన్ కూడా దీనిలో ఉంది. వీటిలో ఏవైనా మీరు వాట్సాప్ ద్వారా షేర్ చేస్తే అథెంటికేట్ చేసి ఫైన‌ల్ రిజ‌ల్ట్‌ను  పీడీఎఫ్ రూపంలో మీకు వాట్సాప్ చేస్తుంది.
ఎలా ప‌ని చేస్తుంది?
* ఈ స్ప్రింగ్ వెరిఫై.. గ‌వ‌ర్న‌మెంట్ డేటా బేస్‌లోని స‌మాచారంతో మీ ఐడీని కంపేర్ చేస్తుంది.

* ఇందుకోసం థ‌ర్డ్ పార్టీ ఏపీఐల‌ను ఉప‌యోగించుకుంటుంది.

* ఏపీఐ అంటే అప్లికేష‌న్ ప్రోగ్రామింగ్ ఇంట‌ర్‌ఫేస్‌.  ఇది ఒక సాఫ్ట్‌వేర్ ప్రోట‌కాల్‌. ఇది రెండు ప్రోగ్రామ్‌ల‌ను ఒకేసారి అనుమ‌తిస్తుంది. ఆ రెండూ ఒక‌దానితో ఒక‌టి ఇంట‌రాక్ట్ అయ్యేలా చేస్తుంది. అంటే మీరు పంపిన నెంబ‌ర్ లేదా ఐడీ ఫోటోను గ‌వ‌ర్న‌మెంట్ స‌ర్వ‌ర్ల‌తో మ్యాచ్ చేసి రిజ‌ల్ట్ ఇవ్వ‌డం ఈ ఏపీఐల ప‌ని.

49 రూపాయ‌ల ఛార్జ్‌
ప్రారంభంలో తొలి 1000 మంది యూజ‌ర్ల‌కు ఈ టూల్ ఫ్రీ అని స్ప్రింగ్ వ‌ర్క్స్ ప్ర‌క‌టించింది. అయితే డిమాండ్ ఎక్కువ ఉండ‌టంతో ఈ సంఖ్య‌ను 2,500కు పెంచారు.  ఫిబ్ర‌వ‌రి 28న ఈ టూల్‌ను లాంచ్ చేస్తే కేవ‌లం 24 గంట‌ల్లోనే 1300 మంది దీన్ని ఉప‌యోగించారు. 

ప్ర‌స్తుతం ట్ర‌య‌ల్ ర‌న్ న‌డుస్తోంది. ఆ త‌ర్వాత కంపెనీ ఒక్కో ప‌ర్స‌న్‌కు అథెంటికేష‌న్ కోసం 49 రూపాయ‌లు ఛార్జ్ చేస్తుంది. ప్రస్తుతానికి రేజ‌ర్ పేను పేమెంట్ ఆప్ష‌న్‌గా పెట్టారు. త‌ర్వాత వాట్సాప్ పే ద్వారా ఈ 49 రూపాయ‌లు తీసుకుంటారు.

 

Aadhaar verification SpringRole SpringVerify UIDAI Voter Id స్ప్రింగ్ వెరిఫై వాట్సాప్ బేస్డ్ ఐడీ అథెంటికేష‌న్‌ వాట్సాప్ బేస్డ్ వెరిఫికేష‌న్ టూల్‌