వాట్సాప్‌లో మెసేజ్ పంపుతాం. అవతలి వ్యక్తి దాన్ని చూస్తే వెంటనే బ్లూటిక్ కనిపిస్తుంది. అంటే అతను దాన్ని రిసీవ్ చేసుకున్నట్లు అర్థం. కానీ మెయిల్ పంపిస్తే అవతలి వాళ్లు దాన్ని చూశారో లేదో ఎలా తెలుస్తుంది? అందులోనూ రోజూ వందల కొద్దీ స్పామ్ మెసేజ్‌లతో మీ మెయిల్ ఇన్‌బాక్స్ నిండిపోతున్నప్పుడు ప్రత్యేకించి ఒక వ్యక్తి నుంచి వచ్చిన మెయిల్‌ను చూస్తున్నారో లేదో చెప్పడం కష్టమే. అయితే వాట్సాప్‌లో రీడ్ రిసీట్స్ (బ్లూటిక్స్)లా జీమెయిల్లో కూడా చూపించే ఓ టూల్ ఉంది. అదే మెయిల్‌పానియన్.
జీమెయిల్లో ఎలా పని చేస్తుంది?
ప్రపంచవ్యాప్తంగా బాగా ఫేమస్ అయిన, అత్యధిక మెయిల్ ఐడీలున్నది జీమెయిల్‌లోనే. దీనిలో రీడ్ రిసీట్స్ చూడడానిని రియల్‌టైమ్ నోటిఫికేషన్స్ అండ్ ట్రాకర్ బ్లాకర్లా పని చేస్తుంది ఈ మెయిల్‌పానియన్. మెయిల్‌పానియన్ ఒక ఫ్రీ సర్వీస్.
మెయిల్ ట్రాకర్‌గా పని చేస్తుంది
* మెయిల్‌పానియన్ మీ ఈ మెయిల్స్‌ను ట్రాక్ చేస్తుంది..
* ఈమెయిల్ ట్రాకింగ్‌లో ఇది రీడ్ రిసీట్స్‌ను చూపిస్తుంది. లింక్ క్లికింగ్ ఇన్ఫర్మేషన్ను కూడా రియల్ టైంలో మీకు అందిస్తుంది.
* రియల్ టైమ్ నోటిఫికేషన్స్ ద్వారా మీరు పంపిన మెయిల్‌ను అవతలి వ్యక్తి కచ్చితంగా ఎన్ని గంటలకు ఓపెన్ చేశారో తెలిసిపోతుంది.
ట్రాకర్స్‌ను బ్లాక్ చేస్తుంది
* ఇన్కమింగ్ మెయిల్స్ ద్వారా మీ జీమెయిల్ ఐడీకి వచ్చే ట్రాకర్స్‌ను గుర్తిస్తుంది.
* వెంటనే ఆ ట్రాకర్‌ను బ్లాక్ చేస్తుంది.
ఎలా యాక్సెస్ చేసుకోవాలి ?
1. Mailpanion వెబ్సైట్లోకి వెళ్లి వెబ్ యాప్‌లో జీమెయిల్ అకౌంట్‌తో సైన్ అప్ చేయాలి.
2. అదే జీమెయిల్ అకౌంట్ పాస్‌వర్డ్‌తో తర్వాత సైన్ ఇన్ కావాలి.
3. సైన్ ఇన్ అయ్యాక సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఈ కింది ఫీచర్లను యాక్టివేట్ చేసుకోవచ్చు.
* ఈమెయిల్ ఓపెన్ ట్రాకింగ్: మీరు పంపిన ఈ మెయిల్ అవతలివారు ఓపెన్ చేశారో లేదో చూపిస్తుంది
* లింక్ క్లిక్ ట్రాకింగ్: మీ ఈమెయిల్లో మీరు పంపిన లింక్‌ను క్లిక్ చేశారో లేదో ట్రాక్ చేస్తుంది. |
* ఓపెన్ ఇండికేటర్స్ ఇన్ జీమెయిల్: మీరు పంపిన మెయిల్స్‌లో ఏవి ఓపెన్ అయ్యాయో ఇండికేట్ చేస్తుంది.
* డిటెక్ట్ ఈమెయిల్ ట్రాకర్స్: మీకు వచ్చిన మెయిల్స్‌లో ట్రాకర్స్ ఏవైనా ఉంటే డిటెక్ట్ చేస్తుంది.
* బ్లాక్ ఈమెయిల్ ట్రాకర్స్: ట్రాకర్స్ ఏవైనా ఉంటే బ్లాక్ చేస్తుంది.
* రియల్ టైమ్ డెస్క్‌టాప్ నోటిఫికేషన్స్: మీ ఈ మెయిల్ రీడ్ రిసీట్స్, ట్రాకింగ్, బ్లాకింగ్ వంటివి జరిగితే నోటిఫికేషన్స్ పంపిస్తుంది.
4. వీటిలో మీకు కావాల్సినవి యాక్టివేట్ చేసుకుని మెయిల్‌పానియన్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ వెంటనే ఇది మీ జీ మెయిల్‌తో కలిసి పని చేయడం ప్రారంభిస్తుంది.
5. తర్వాత మీరు సైన్ అయితే హోం పేజీలో ఓ డాష్‌బోర్డ్ కనిపిస్తుంది. దానిలో
ట్రాకర్స్ బ్లాక్డ్, ఈమెయిల్ ట్రాక్డ్, ఈమెయిల్ ఓపెన్డ్, యావరేజ్ క్లిక్ పర్ ఈమెయిల్ , ఈమెయిల్ ట్రాకింగ్ ఇన్ జీమెయిల్ విత్ ట్రాకర్ బ్లాకింగ్ అనే ఆప్షన్లుంటాయి. వీటి ద్వారా మీ జీమెయిల్ రీడ్ రిసీట్స్అన్నీ తెలుసుకోవచ్చు.
6. మీరు ఈమెయిల్ రాస్తున్నప్పుడే సెండ్ బటన్ పక్కన మెయిల్‌పానియన్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇది మీరు పంపే ఈమెయిల్ట్రాకింగ్, లింక్ ట్రాకింగ్, రియల్ టైమ్ నోటిఫికేషన్స్ ఇస్తుంది.
7. మీరు మెయిల్ సెండ్ చేశాక దాన్ని సెండ్ సెక్షన్ నుంచి ట్రాక్ చేయొచ్చు.
8. ఇండికేటర్స్‌ను ఎనేబుల్ చేసుకుంటే ఆ ఈమెయిల్‌ను అవతలివారు ఎపెన్ చేయగానే గ్రీన్ ఇండికేటర్ మీకు డెస్క్‌టాప్ నోటిఫికేషన్స్‌లో కనిపిస్తుంది
జీమెయిలà±â€Œà°²à±‹ రీడౠరిసీటà±à°¸à±â€Œ మెయిలà±â€Œà°ªà°¾à°¨à°¿à°¯à°¨à±â€Œ Read Receipts in gmail Mailpanion