25 వేలకే గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్.. త్వరలోనే.

ఆండ్రాయిడ్ ఫోన్లో టాప్ ఎండ్ అంటే గూగుల్ పిక్సెల్ ఫోన్ల గురించే చెప్పుకోవాలి. అయితే వీటి ధర ఐఫోన్ స్థాయిలో వుండటంతో ఆండ్రాయిడ్ లవర్స్ వీటి జోలికి వెళ్ళడం లేదు. దీన్ని గుర్తించిన గూగుల్ తన తాజా పిక్సెల్ ఫోన్లను 25 వేల రూపాయల లోపే ధర నిర్ణయించినట్లు సమాచారం. 

ఐఫోన్, వన్ ప్లస్ కి పోటీగా ..
గూగుల్‌.. అత్యంత ఆధునిక ఫీచర్లతో పిక్సెల్‌ 4a మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఐఫోన్‌ SE,  వన్‌ప్లస్‌ నార్డ్‌ తదితర మోడళ్లకు పోటీగా గూగుల్‌ బడ్జెట్‌ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్లను రూపొందించినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి.

ధరలు ఇలా ఉండొచ్చు
పిక్సెల్‌ 4aను రెండు వేరియంట్లలో గూగుల్‌ రిలీజ్‌ చేయవచ్చని  భావిస్తున్నారు. 6జీబీ + 128 జీబీ మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ ధరను @349 డాలర్లు(సుమారు రూ. 26,000)గా నిర్ణయించవచ్చని అంచనా.  6 జీబీ, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వెరైటీ ధర 300 డాలర్లు(రూ. 22,400) ఉండవచ్చు. అలాగే 5జీ లోనూ ఒక మోడల్‌ రిలీజ్ చేయబోతోంది. దీని ధర 499 డాలర్ల (రూ. 37,300) ఉంటుందని అంచనా.

ఫీచర్ లు 
5.8 అంగుళాల తెరను కలిగి ఉండే పిక్సెల్‌ 4a క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 730జీ చిప్‌తో రూపొందినట్లు తెలుస్తోంది. పంచ్‌హోల్‌ డిస్‌ప్లేతో 12.2 ఎంపీ కెమెరాను కలిగి ఉంటుంది.3140 ఎంఏహెచ్‌ బ్యాటరీ వుంటుంది.   ఈ మోడల్‌లో 5జీ వేరియంట్‌ను సైతం గూగుల్‌ విడుదల చేసే అవకాశాలున్నాయని మార్కెట్ అంచనా.

25 వేలకే గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్ google pixel 4