ఫేస్‌బుక్ మెసెంజర్‌లో 70 శాతం పెరిగిన గ్రూప్ వీడియో కాల్స్.. క‌రోనా ఎఫెక్టేనా?

కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టేసి ఇంట్లో కూర్చోబెట్టేసింది.  ఆదివారం ఒక్క‌రోజే దేశ‌మంతా లాక్‌డౌన్ అని నెమ్మ‌దిగా ప్ర‌జ‌ల‌ను స‌న్న‌ద్ధం చేసిన సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్  మంగ‌ళ‌వారం రాత్రి నుంచి ఏకంగా 21 రోజుల‌పాటు లాక్‌డౌన్ ప్ర‌క‌టించింది. ప్ర‌జ‌ల ఆరోగ్య‌రీత్యా ఇది త‌ప్ప‌నిస‌రి చ‌ర్య‌. అయితే మామూలుగా రెండు రోజులు కూడా ఇంట్లో కూర్చొని వాళ్లు కూడా ఇప్పుడు గడప దాటలేని పరిస్థితి. దీంతో ఆటోమేటిక్ గా సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయింది.

ఫ్రెండ్స్‌తో ముచ్చ‌ట్లు ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌లో
కరోనాపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం చాలామంది సోషల్ మీడియా చూస్తున్నారు. అంతేకాక బయటికి వెళ్లడానికి వీలు లేకపోవడంతో బంధుమిత్రులు ఎలా ఉన్నారు అని తెలుసుకోవడానికి సోషల్ మీడియానే ఎక్కువగా వాడుకుంటున్నారు.  ఫ్రెండ్స్‌తో ముచ్చ‌ట్లు పెట్టే అవ‌కాశం లేక‌పోవ‌డంతో  ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌, వాట్సాప్ వీడియో కాల్స్‌లో మాట్లాడేసుకుంటున్నారు.  గత వారం ఫేస్‌బుక్ మెసెంజర్‌లో గ్రూప్ వీడియో కాల్స్ 70 శాతం పెరిగినట్లు సీనెట్ ప్రకటించింది. మామూలు రోజుల్లో కంటే ఫేస్‌బుక్ మెసెంజర్‌లో వీడియో కాల్స్ మీద గడిపే సమయం కూడా డబుల్ అయిపోయింద‌ట‌. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడం విశేషం.

వాట్సాప్‌లోనూ సేమ్ సీన్  
ఫేస్‌బుక్ మెసెంజర్‌లో పెరిగినట్టే వాట్సాప్‌లోనూ వీడియో కాల్స్‌, వాయిస్ కాల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఈ విష‌యాన్ని సీనెట్ ప్ర‌క‌టించింది.  
 

క‌రోనా నివార‌ణ‌కు సాయం చేస్తామంటున్న ఫేస్‌బుక్‌
మ‌రోవైపు త‌న మెసెంజ‌ర్ స‌ర్వీస్‌ను కొవిడ్ -19 నివార‌ణ‌లో ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని ఫేస్‌బుక్ ప్ర‌క‌టించింది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి, నిరోధానికి స‌లహాలు వంటివ‌న్నీ మెసెంజ‌ర్ ద్వారా ప్ర‌జ‌ల‌కు చేర‌వేయ‌డానికి వీలుగా ఏర్పాట్లు చేయాల‌ని మా డెవ‌ల‌ప‌ర్స్‌కు సూచ‌న‌లిస్తున్నాం అని సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ప్ర‌క‌టించింది.

 

ఫేస్‌బుక్ మెసెంజ‌ర్ కాల్స్‌ వాట్సాప్ వీడియో కాల్స్‌ క‌రోనా వైర‌స్ ఎఫెక్ట్‌ ఇండియా లాక్‌డౌన్‌ క‌రోనా క్రైసిస్‌ Carona lack down India lack down Carona effect Facebook messenger group calls Whatsapp video calls