ఫ్లిప్‌కార్ట్‌లో వీడియో, ఐడియాస్ ఫీచర్లు, సైలెంట్‌గా దింపేసింది 

ఈ కామర్స్ రంగంలో అమెజాన్ తో పోటీగా దూసుకువెళుతున్న ఫ్లిప్‌కార్ట్ మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అమెజాన్ ప్రైమ్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్ కూడా వీడియో కంటెంట్ అందించేందకు రెడీ అయింది. కాగా స్ట్రీమింగ్ సర్వీస్‌లోకి ఫ్లిప్‌కార్ట్ కూడా ఎంటర్ అవుతుందన్న వార్తలు కొంతకాలంగా వస్తున్న సంగతి విదితమే. యూజర్ల అభిరుచులకు తగ్గ కంటెంట్‌ను ఉచితంగా అందించడం కోసమే వీడియో కంటెంట్ ఆఫర్ చేయబోతున్నట్టు ఫ్లిప్‌కార్ట్ గతంలోనే ప్రకటించింది . ఫ్లిప్‌కార్ట్ స్ట్రీమింగ్ సర్వీస్ లాంచ్ కావడానికి ఇంకా సమయం ఉందనుకునే లోపే యాప్‌లో Videos సెక్షన్‌ను ఫ్లిప్‌కార్ట్ లాంచ్ చేసింది. సైలెంట్‌గా ఈ సర్వీస్‌ ని ప్రారంభించి అందర్నీ అశ్చర్యపరిచింది.

యూజర్లు ఫ్లిప్‌కార్ట్ ఆండ్రాయిడ్ యాప్‌లో ఈ సర్వీసును ఉచితంగా వాడుకోవచ్చు. Voot, Viu, Dice Media, TVF, Arre లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఫ్లిప్‌కార్ట్ వీడియోస్‌లో కంటెంట్ అందిస్తున్నాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ వీడియోస్‌లో బాలీవుడ్ సినిమాలు, హిందీ ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ మాత్రమే కనిపిస్తోంది. తెలుగు భాషలో ఎలాంటి కంటెంట్ కనపడటం లేదు. ఫ్లిప్‌కార్ట్ వీడియోస్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ ఐడియాస్ ని కూడ కంపెనీ లాంచ్ చేసింది. ఈ ఫీచర్ లో యూజర్ల ఆసక్తికి తగ్గ స్టోరీస్ కనిపిస్తాయి.

ఫ్లిప్‌కార్ట్‌ ఈ కామర్స్ రంగం అమెజాన్ ఫ్లిప్‌కార్ట్ వీడియో వీడియో కంటెంట్ ఫ్లిప్‌కార్ట్ ఐడియాస్