లాక్ అయిన ఆండ్రాయిడ్ ఫోన్‌ను డేటా కోల్పోకుండా అన్‌లాక్ చేయడానికి పక్కా గైడ్

స్మార్ట్‌ఫోన్లు ఒక్కోసారి అన్‌లాక్ అయిపోతుంటాయి. మ‌నం పాస్‌వ‌ర్డ్ మ‌ర్చిపోవ‌డ‌మో లేక ప్యాట్ర‌న్ మ‌ర్చిపోవ‌డ‌మో స‌ర్వ‌సాధార‌ణం. మ‌రి అలా లాక్ అయిన ఆండ్రాయిడ్ ఫోన్‌ను తిరిగి అన్‌లాక్ చేయ‌డం ఎలా? అయితే చాలామంది త‌మ డేటా పోతుందేమో అనే భ‌యంతో ఉంటారు. ఎందుకంటే స‌ర్వీస్ సెంట‌ర్‌కు తీసుకెళ్తే వాళ్లు  డేటాకు గ్యారెంటీ ఇవ్వ‌రు. మ‌రి మ‌న డేటాకు ఏం కాకుండా ఫోన్‌ను అన్‌లాక్ చేయాలంటే ఎలా?

డాక్ట‌ర్ ఫోన్ అన్‌లాక్‌
దీని పేరులోనే ఉంది ఫోన్‌ను అన్‌లాక్ చేయ‌డానికి డాక్ట‌ర్ లాంటిది అని. ఎలాంటి గూగుల్ అకౌంట్ లేకుండా డేటా లాస్ కాకుండా ఫోన్‌ను అన్‌లాక్ చేయ‌డ‌మే ఈ డాక్ట‌ర్ టూల్ ప్ర‌త్యేక‌త‌. నిజానికి డివైజ్ లాక్ కావ‌డానికి చాలా కార‌ణాలు ఉంటాయి.  దీని వ‌ల్ల ఉన్న ఉప‌యోగాలు ఏమిటంటే ఆండ్రాయిడ్ డివైజ్‌ను నిమిషాల్లో అన్‌లాక్ చేయ‌డం.. అదీ డేటా కోల్పోకుండా అన్‌లాక్ చేయం. శాంసంగ్‌, ఎల్‌జీ డివైజ్‌ల‌లో ఇది ప్ర‌భావ‌వంతంగా ప‌ని చేస్తుంది. దీన్ని ఉప‌యోగించ‌డం కూడా చాలా సుల‌భం. 

ఎలా ప‌ని చేస్తుందంటే...
ముందుగా డాక్ట‌ర్ ఫోన్ యాప్‌ను మీ కంప్యూట‌ర్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత స్క్రీన్ మీద క‌నిపించే అన్‌లాక్ ఆప్ష‌న్ మీద క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత మీ ఆండ్రాయిడ్ డివైజ్‌ను యూఎస్‌బీ ద్వారా కంప్యూట‌ర్‌కు క‌నెక్ట్ చేయాలి. ఆ త‌ర్వాత యూఎస్‌బీ స్టోరేజ్ అనేబుల్ చేయాలి. ఆ త‌ర్వాత ప్రోగ్రామ్ ప్రారంభించ‌డానికి స్టార్ట్ బ‌ట‌న్ మీద ట్యాప్ చేయాలి. ఆ పై డివైజ్ మోడ‌ల్‌ను ఎంచుకోవాలి. మీరు ఎంచుకున్న మోడ‌ల్ స‌రైన‌దో కాదో చూసుకుని నెక్ట్ మీద క్లిక్ చేయాలి. ఆపై క‌న్ఫామ్ అనే ఆప్ష‌న్‌ను కూడా ఓకే చేయాలి. ఆపై మూడు స్టెప్స్ ఫాలో కావాలి.

1.ఫోన్ ప‌వ‌ర్ ఆఫ్ చేయ‌డం

2. వాల్యుమ్ బ‌ట‌న్‌, హోమ్ బ‌ట‌న్‌, ప‌వ‌ర్ బ‌ట‌న్ ఒకేసారి నొక్కి ప‌ట్టుకోవాలి

3. ఆ త‌ర్వాత వాల్యుమ్ పెంచి డౌన్‌లోడ్ మోడ్‌లోకి ఎంట‌ర్ కావాలి.

4. డౌన్‌లోడ్ మోడ్‌లోకి ఎంట‌ర్ కాగానే మీ రిక‌వ‌రీ ప్యాకేజ్ డౌన్‌లోడ్ కావ‌డం ప్రారంభం అవుతుంది. డౌన్‌లోడ్ కంప్లీట్ కాకుండా చూసుకోవాలి. ఒక‌సారి డౌన్‌లోడ్ కంప్లీట్ కాగానే మీ రిక‌వ‌రీ పూర్త‌యిపోయి మీ స్క్రీన్ లాక్ కూడా రిమూవ్ అయిపోతుంది. దీని వ‌ల్ల మీ డివైజ్లో డేటా కోల్పోకుండానే మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌ను అన్‌లాక్ చేయ‌చ్చు.

Dr. Fone Unlock Android Unlocking Losing Data డాక్ట‌ర్ ఫోన్ యాప్‌ అన్‌లాక్ శాంసంగ్‌ ఎల్‌జీ