లాక్డౌన్తో మన జీవితాల్లో చాలా మార్పు వచ్చింది. సూపర్ మార్కెట్లకు వెళ్లి సరకులు తెచ్చుకునేవారు ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలన్న ఉద్దేశంతో గల్లీల్లో ఉండే చిన్న చిన్న షాపులకు వెళుతున్నారు. మహానగరాల్లో అయితే సమీపంలో ఏ షాపు ఎక్కడుందో కూడా మనకు తెలియనంతగా సూపర్ మార్కెట్లు, మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్లకు అలవాటుపడ్డాం. ఈ పరిస్థితుల్లో మీకు దగ్గరలో ఉన్న నిత్యావసరాల వస్తువుల దుకాణాలు, మందుల షాపులు ఇలా ఏమి ఉన్నాయో తెలియజేసే ఫీచర్ను తీసుకొచ్చింది గూగుల్ పే.
ఈ ఫీచర్ను ఎలా ఉపయోగించుకోవాలంటే..
గూగుల్పే యాప్ ఓపెన్ చేయండి
* కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే బిజినెస్ సెక్షన్ కనిపిస్తుంది.
* దానిలో నియర్ బై అనే ఆప్షన్ ఉంటుంది
* దాన్ని క్లిక్ చేయండి. ఈ సెక్షన్లో ఆల్, ఎసెన్షియల్స్, ఫుడ్, గ్రాసరీస్, హెల్త్ కేర్ అనేఆప్షన్లు ఉంటాయి.
* మీకు ఏది కావాలో ఆ ఆప్షన్ క్లిక్చేయండి
* మీకు దగ్గరలో ఉన్న షాప్స్ గురించి చూపిస్తుంది. అక్కడికి ఎలా వెళ్లాలో కూడా డైరెక్షన్స్ కూడా ఇస్తుంది.
35 నగరాల్లో లభ్యం
గూగుల్ పే నియర్ బై ఫీచర్ను ప్రస్తుతం ఇండియాలోని 35 నగరాల్లోఅందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, బెంగుళూరు, మైసూర్, నాగపూర్, ముంబయి, నవీ ముంబాయి, పింప్రి-చించ్వాడ, న్యూఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, చెన్నై, సూరత్, అహ్మదాబాద్, పాట్నా, లక్నో, ఘజియాబాద్, కాన్పూర్, ప్రయాగరాజ, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఇండోర్, భువనేశ్వర్, కోల్కతా, వారణాసి, లుథియానా, తిరువనంతపురం, కోచి, ఎర్నాకులం, ఛండీగడ్, వైజాగ్, అజిత్సింగ్ నగర్లోని గూగుల్ పే యూజర్లు ఈ ఫీచర్ను వాడుకోవచ్చు.
Google pay Google pay nearby Shops Google pay nearby  గూగà±à°²à±â€Œà°ªà±‡ నియ‌రౠబై  గూగà±à°²à±â€Œà°ªà±‡Â