ఎలక్ట్రానిక్ వస్తువుల చిరకాల మన్నిక కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మూడవ గైడ్

ఎలక్ట్రానిక్ వస్తువుల భద్రత గురించి ఇప్పటికే రెండు భాగాల్లో తెలుసుకున్నాం కదా... ఇప్పుడు మూడో, చివరి భాగంలో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, వాషింగ్ మెషీన్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుందాం...

కంప్యూట‌ర్‌, ల్యాప్‌టాప్‌ల భ‌ద్ర‌త ఇలా...
1.   కంప్యూట‌ర్‌, ల్యాప్‌టాప్‌ల‌కు ద్ర‌వ ప‌దార్థాల‌ను దూరంగా ఉంచండి. వాటివ‌ల్ల మీ ప‌రిక‌రాలు చెడిపోయే ప్ర‌మాదం లేద‌ని మీరు భావించ‌వ‌చ్చు. కానీ, అటువంటి ప‌రిస్థితి రాకుండా చూసుకోవ‌డం ముఖ్యం. ప‌ని చేసేట‌పుడు టీ, కాఫీలాంటివి తాగాల‌నిపిస్తే త‌గిన జాగ్ర‌త్త తీసుకోండి.
2.   మీ ప‌రిక‌రాలు వైర‌స్‌ల బారిన‌ప‌డ‌కుండా యాంటీ-వైర‌స్ సాఫ్ట్‌వేర్‌ను త‌ప్ప‌నిస‌రిగా ఉప‌యోగించండి. న‌మ్మ‌క‌మైన సైట్‌నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న‌ప్ప‌టికీ అందులోనూ ఏదో ఒక‌ర‌కం వైర‌స్ ఉండే అవ‌కాశాలు లేక‌పోలేదు. అలాగే సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటిక‌ప్పుడు అప్‌డేట్ చేసుకోవ‌డం మ‌రువ‌కండి.
3.   మీ ల్యాప్‌టాప్ మీద పెంపుడు జంతువులు కూర్చుంటే చూడ‌ముచ్చ‌ట‌గా ఉండొచ్చు. కానీ, అలాంటి ప‌రిస్థితీ ప్ర‌మాద‌క‌ర‌మే. అవి మీ ల్యాప్‌టాప్‌ను కింద ప‌డేయొచ్చు లేదా అంత‌ర్గ‌త భాగాన్ని పాడుచేయొచ్చు.
4.   డిస్‌ప్లే మోనిట‌ర్‌ను మూసేసే ముందు ల్యాప్‌టాప్ స్క్రీన్‌, కీ బోర్డుల మ‌ధ్య చిన్న వ‌స్తువులేవీ లేవ‌ని నిర్ధారించుకోండి. ఒక‌వేళ అలాంటివి ఉన్న‌ట్ల‌యితే స్క్రీన్ పాడయ్యే ప్ర‌మాదం ఉంటుంది.
5.   ల్యాప్‌టాప్ స్క్రీన్ భాగాన్ని రెండువైపులా ప‌ట్టుకుని మూతవేయండి. ఒక‌వైపు ప‌ట్టుకుని వేసిన‌ట్ల‌యితే ఒత్తిడివ‌ల్ల దాని కీలు భాగం దెబ్బ‌తిన‌వ‌చ్చు లేదా వంక‌ర‌పోవ‌చ్చు లేదా ల్యాప్‌టాప్ జారిప‌డే ప్ర‌మాద‌మూ ఉంటుంది.
6.   కంప్యూట‌ర్ లేదా ల్యాప్‌టాప్‌ల‌ను బేస్‌వ‌ద్ద ప‌ట్టుకోవాలి త‌ప్ప స్క్రీన్ భాగాన్ని ప‌ట్టుకోకూడ‌దు. అలా చేస్తే స్క్రీన్ లేదా కీలు భాగం పాడ‌య్యే అవ‌కాశం ఉంటుంది. అంతేకాదు.. స్క్రీన్ చాలా సున్నితం కాబ‌ట్టి అది పాడైపోయే ప్ర‌మాదం ఉంటుంది.
7.   ప‌వ‌ర్ కార్డ్ (కేబుల్‌)ను క‌ట్టివేయ‌కండి. దీనివ‌ల్ల కార్డ్ సాకెట్ నుంచి ఊడిప‌డి విరిగిపోవ‌చ్చు.
వాషింగ్ మెషీన్ నిర్వ‌హ‌ణ ఇలా...
1.   మెషీన్‌కు ఎగువ‌, దిగువ‌ల‌ సంధానించిన నీటి పైపులు ఎక్క‌డైనా లీక్ అవుతున్నాయేమో నిత్యం త‌నిఖీ చేస్తూండండి. వాటిలో ప‌గుళ్లు క‌నిపించినా, కాస్త విరిగినా కొత్త‌వి అమ‌ర్చండి. లేక‌పోతే అనుకోకుండా మీ ఇంట్లో నీరు నిండిపోవ‌చ్చు.
2.   వాషింగ్ మెషీన్ సామ‌ర్థ్యానికి మించి అందులో దుస్తులు వేయ‌కండి. అలా చేస్తే మెషీన్ స‌మ‌తూకం కోల్పోయి ఒరిగిపోవ‌చ్చు. దీనివ‌ల్ల క‌లిగే ప్ర‌మాద‌మేమిటో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు.
3.   మెషీన్‌ను స‌మ‌త‌లంగా ఉండే ప్ర‌దేశంలో ఉంచండి. లేదా ఎత్తుమీద ఉంచితే నాలుగువైపులా ఒకే ఎత్తులో ఉండేలా చూసుకోండి. మెషీన్‌లో వైబ్రేష‌న్ స‌హ‌జ‌మేన‌ని మీరు భావిస్తే అది పొర‌పాటే. మెషీన్ నాలుగు కాళ్లూ నేల‌కు స‌మీపంగా, స‌మ‌త‌లంగా ఉండేలా చూసుకోండి. అప్పుడు కూడా వైబ్రేష‌న్ వ‌స్తున్న‌దేమో త‌నిఖీ చేయండి.
4.   టాప్ లోడింగ్ మెషీన్ల క‌న్నా ఫ్రంట్ లోడింగ్ మెషీన్లు స‌మ‌ర్థంగా ప‌నిచేస్తాయ‌ని గుర్తించండి.

Computer  Washing machine  Laptop  Maintenance