పెళ్లి వేడుక‌ను ఉచితంగా లైవ్ స్ట్రీమ్ చేయ‌డానికి 4వే గైడ్‌

పెళ్లి అనేది జీవితంలో అత్యంత ముఖ్య‌మైన ఘ‌ట్టం. ఆ విలువైన, మ‌ధుర క్ష‌ణాల‌ను బంధుమిత్రుల‌తో పంచుకోవ‌డం అంద‌రికీ ఎంతో సంతోషాన్నిస్తుంది. ఇక‌ ఈ ఇంటర్నెట్ యుగంలో బంధుమిత్రులే కాకుండా మొత్తం ప్ర‌పంచ‌మే మీ ఇంటి పెళ్లి వేడుక‌ను వీక్షిస్తుంది. అయితే, అంబ‌రాన్నంటే మీ ఇంటి సంబ‌రాన్ని అంద‌రితోనూ ప్ర‌త్య‌క్షంగా పంచుకోగ‌ల‌గ‌డం మ‌రింత ఆనందదాయ‌క‌మే క‌దా! కాబ‌ట్టి ఇంట‌ర్నెట్‌లో ఆ వేడుక‌ను లైవ్ స్ట్రీమ్ చేయ‌డం ఎలాగో తెలుసుకుందామా? ఇందుకు నాలుగు ప‌ద్ధ‌తులున్నాయ్‌... మొద‌టి రెండు ప‌ద్ధ‌తుల కింద‌ అన్ని డివైజ్‌ల‌లోనూ ప్ర‌సారం చేయొచ్చు... కానీ,  మ‌రో రెండు మాత్రం స్మార్ట్‌  ఫోన్‌తోనే సాధ్యం! 
యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్‌
మ‌న ఆనంద‌, మ‌ధుర క్ష‌ణాల‌ను ప్ర‌పంచంతో పంచుకోవ‌డంలో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ‌గ‌ల వీడియో స్ట్రీమింగ్ వేదిక యూట్యూబ్‌. ఇందులో మీ పెళ్లి సంబ‌రాన్ని లైవ్ స్ట్రీమ్ చేసుకోవాలంటే మీకు యూట్యూబ్‌/గూగుల్ అకౌంట్ ఉండాలి. అటుపైన‌ మీ చాన‌ల్‌ను తొలిసారి లైవ్ స్ట్రీమ్ కోసం ఎనేబుల్ చేసుకుంటున్న‌ట్ల‌యితే 24 గంట‌లు ప‌డుతుంద‌ని గుర్తుంచుకోండి. ఇందుకోసం కంప్యూట‌ర్‌లో యూట్యూబ్ ఓపెన్ చేసి, లాగిన్ అయ్యాక అకౌంట్ ఆప్ష‌న్ల నుంచి ‘‘Creator Studio’’ toolsలోకి, ఆ త‌ర్వాత ‘‘Live Stream’’ tabలోకి ప్ర‌వేశించండి. అలా చానెల్‌ను ఎనేబుల్ చేసుకున్నాక మీ కంప్యూట‌ర్ లేదా స్మార్ట్‌  ఫోన్ నుంచి పెళ్లి కార్య‌క్ర‌మాన్ని లైవ్ స్ట్రీమ్ చేయొచ్చు. మీరు చేయాల్సిందల్లా... అప్‌లోడ్ ఆప్ష‌న్ ట్యాప్ చేసి, లైవ్‌స్ట్రీమ్‌ను ఎంపిక చేసుకోవాలి. అక్క‌డ టైటిల్‌, డిస్క్రిప్ష‌న్ నింపితే ప్ర‌త్య‌క్ష ప్ర‌సారానికి స‌ర్వం సిద్ధ‌మైన‌ట్టే.
ఫేస్‌బుక్ లైవ్ వీడియో
మీరు ఫేస్‌బుక్ వినియోగ‌దారు అయిన ప‌క్షంలో అందులోని స‌భ్యుల‌లో చాలామంది మీ మిత్ర బృందంలోని వారైతే పెళ్లి వేడుక‌ను ఫేస్‌బుక్‌ద్వారా లైవ్ స్ట్రీమ్ చేసుకోవ‌చ్చు. ఇందుకోసం ముందుగా ఫేస్‌బుక్ లైవ్ పేజీలోకి వెళ్లండి. అక్క‌డ మీ ఖాతాతో లాగిన్ అయ్యాక మీకొక స్క్రీన్ క‌నిపిస్తుంది. అక్క‌డ మీ వీడియోను డివైజ్ కెమెరాతో లైవ్‌స్ట్రీమ్ చేయొచ్చు. లేదంటే ఏదైనా మ‌రో మార్గం నుంచి లైవ్‌స్ట్రీమ్‌ను క‌నెక్ట్ చేసి, ఫేస్‌బుక్‌లో షేర్ చేయొచ్చు. మీ పెళ్లి వీడియో క్రియేట్ చేయ‌డానికి టైటిల్ యాడ్ చేయ‌డంతోపాటు డిస్క్రిప్ష‌న్‌సహా వీడియో టాగ్స్‌ను జోడించాలి. ఇది పూర్త‌య్యాక మీ వీడియోను ఎవ‌రెవ‌రు చూడాల‌ని భావిస్తున్నారో వారిని ఎంపిక చేయండి. ఈ తతంగమంతా పూర్త‌య్యాక పెళ్లి వేడుక‌ను మీరు ఫేస్‌బుక్‌లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయొచ్చు. అలాగే ఫ‌లానా టైమ్‌లో ప్ర‌సారమ‌య్యేలా షెడ్యూల్ కూడా రూపొందించ‌వ‌చ్చు.
ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ స్ట్రీమింగ్‌
సామాజిక మాధ్య‌మాల్లో ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడొక వినూత్న ధోర‌ణి. దీన్ని వెబ్ బ్రౌజ‌ర్‌లో యాక్సెస్ చేయొచ్చుగానీ,  లైవ్ వీడియోస‌హా ఇందులోని ఫీచ‌ర్ల‌న్నీ కావాలంటే స్మార్ట్ ఫోన్ యాప్ వాడాలి. పెళ్లి వేడుక‌ను అంద‌రికీ లైవ్ స్ట్రీమ్ చేయవ‌చ్చు లేదా ప‌రిమితంగా చాల‌నుకుంటే మీ ఫాలోయ‌ర్ల‌తో మాత్ర‌మే షేర్ చేసుకునే వీలుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప‌బ్లిక్ లైవ్ స్ట్రీమింగ్‌కు ఒక ప్‌ిత్యేక‌త ఉంది. నిర్దిష్ట సంఖ్య‌లో ఈ స్ట్రీమింగ్‌కు వ్యూస్ వ‌చ్చిన‌ట్ల‌యితే అది  పాపుల‌ర్ వీడియోల జాబితాలో చేరిపోయే అవ‌కాశం ఉంది. ఇక లైవ్ వీడియో స్ట్రీమింగ్ కోసం ఏం చేయాలంటే... ముందుగా మీ ఫోన్‌లో యాప్‌ను ఓపెన్ చేసి లాగిన్ కావాలి. తర్వాత‌ హోమ్ స్క్రీన్‌ను కుడివైపు స్వైప్ చేస్తే కెమెరా ఓపెన్ అవుతుంది. ఈ కెమెరా ఇంట‌ర్ఫేస్‌లో స్క్రీన్ దిగువ‌న‌ Live Video బ‌ట‌న్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేయ‌గానే లైవ్ స్ట్రీమింగ్ మొద‌లైపోతుంది.
ట్విట్ట‌ర్‌లో లైవ్ వీడియో
ఇన్‌స్టాగ్రామ్ త‌ర్వాత అంతే ప్రాముఖ్యంగ‌ల మాధ్య‌మం ట్విట్ట‌ర్‌. స్మార్ట్ ఫోన్ ట్విట్ట‌ర్‌ యాప్ త‌న వీడియో యాప్ Periscopeద్వారా లైవ్ వీడియోల‌ను స‌పోర్ట్ చేస్తుంది. ముందుగా యాప్‌స్టోర్ నుంచి Periscopeను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంత‌రం మీ ట్విట్ట‌ర్ ఫీడ్స్‌లో వీడియోలు పోస్ట్ చేయ‌డం కోసం దానికి ఆథ‌రైజేష‌న్ ఇవ్వాలి. అనంత‌రం ట్విట్ట‌ర్ యాప్‌ను ఓపెన్ చేసి, అందులోని compose ఐకాన్ మీద ట్యాప్ చేస్తే కంపోజ్ స్క్రీన్‌మీద కెమెరా బ‌ట‌న్ త‌ర్వాత ఎరుపు రంగులో Live Video బ‌ట‌న్ క‌నిపిస్తుంది. ఆ బ‌ట‌న్‌ను ట్యాప్ చేసి, Periscopeను ఎంచుకోండి. ఇది మీ ఫోన్‌లో లైవ్ కెమెరా ఫీడ్‌ను ఓపెన్ చేస్తుంది. అక్క‌డ మీరు మీ ట్వీట్‌ను రాసి, లొకేష‌న్ యాడ్ చేసి, ఆడియ‌న్స్‌ను సెలెక్ట్ చేయండి. ఈ సెట‌ప్ అంతా పూర్త‌య్యాక స్క్రీన్ దిగువ‌న క‌నిపించే Go Live బ‌ట‌న్‌ను ట్యాప్ చేస్తే మీ లైవ్ స్ట్రీమ్ మొద‌లైపోతుంది. ఇవీ మీ ఇంటి పెళ్లి వేడుక‌ను ఉచితంగా లైవ్ స్ట్రీమ్ చేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డే నాలుగు ప‌ద్ధ‌తులు.

Wedding  Live streaming  Social media