మీరు ఒక ముఖ్యమైన వ్యక్తికి కాల్ చేయాల్సి ఉంది... కానీ, చేయలేని పరిస్థితి లేదా కాల్ మాట్లాడుతుండగా హఠాత్తుగా డిస్‌కనెక్ట్ అయిపోతుంది... అదీకాదంటే మీకిష్టమైన సామాజిక మాధ్యమ వెబ్‌సైట్‌లో ఉండగా ఇంటర్‌నెట్ కనెక్షన్ తెగిపోతుంది... ఇలాంటి ఇబ్బందులు మీకెప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఉంటాయి. ఎందుకంటే... మీ టాక్‌టైమ్ లేదా ఇంటర్నెట్ డేటా బ్యాలన్స్ ముగిసిపోయి ఉండవచ్చు. ఆ తర్వాత రీచార్జి చేసుకుంటనేగానీ తిరిగి మన పనులు చూసుకోలేం కదా! అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు... అత్యవసర సమయాల్లో మీ ఆపరేటర్ సేవలను కొనసాగించేందుకు మీరు టాక్‌టైమ్ లేదా డేటా అప్పు తీసుకోవచ్చు! ఆ మేరకు మీ ఆపరేటర్ మీకు ‘లోన్’ ఇస్తారన్న మాట. అయితే, ఇందుకోసం కొన్ని కోడ్‌లను మనం ఉపయోగించాల్సి ఉంటుంది. అలా లోన్ తీసుకున్న తర్వాత మన పని పూర్తిచేసుకుని, తీరిగ్గా రీచార్జి చేసుకోవచ్చు. అలా రీచార్జి చేసుకునేటపుడు మన లోన్‌ను ఆపరేటర్ మెయిన్ బ్యాలన్స్ నుంచి మినహాయించుకుంటారు. దీంతోపాటు లోన్ ఇచ్చినందుకు రుసుముకింద ఆపరేటర్‌ను బట్టి 10 నుంచి 20 శాతం అదనంగా (వడ్డీ అనుకోండి) వసూలు చేసుకుంటారు. ఈ నేపథ్యంలో వివిధ నెట్‌వర్క్‌లలో ‘లోన్ బ్యాలన్స్’ కోరేందుకు అవసరమైన కోడ్స్‌ను తెలుసుకుందామా?
VODAFONE LOAN NUMBER
టాక్‌టైమ్ కోసం *111*1*3# డయల్ చేయాలి లేదా మెసేజ్‌ద్వారా అయితే... ‘CREDIT’ అని టైప్ చేసి 144 నంబరుకు SMS పంపాలి. ఇలా చేస్తే మీకు రూ.5 విలువైన టాక్‌టైమ్ అత్యవసర బ్యాలన్స్ కింద క్రెడిట్ అవుతుంది. అలాగే ఇంటర్నెట్ డేటా కోసం కూడా *111*1*3# డయల్ చేయాలి లేదా ‘ICREDIT’ అని టైప్ చేసి, 144 నంబరుకు SMS పంపాలి. ఆ తర్వాత మీకు ‘ఒకరోజు’ పాటు చెల్లుబాటయ్యేలా 30 MB 3G డేటా క్రెడిట్ అవుతుంది. ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఇంటర్నెట్ డేటా లోన్ కోసం పైన పేర్కొన్నవిధంగా డయల్ చేసినా, మెసేజ్ పంపినా అందులో సూచించిన పదాలకు కోట్స్ వాడకండి. అలాగే డయల్ చేశాక మీరు 2 అంకెను నొక్కి డేటా లోన్ విషయాన్ని నిర్ధారించాలి. అప్పుడు మీకు ఒకరోజు చెల్లుబాటుతో 30 ఎంబీ డేటా క్రెడిట్ అవుతుంది. ఆ తర్వాత మీరు రీచార్జి చేసుకున్నపుడు లోన్ రుసుముకింద రూ.10 తగ్గించబడుతుంది.
AIRTEL LOAN NUMBER
టాక్‌టైమ్ కోసం *141*10# డయల్ చేయాలి లేదా 52141 నంబరుకు కాల్ చేయాలి. ఇలా చేస్తే మీకు రూ.10 విలువైన టాక్‌టైమ్ అత్యవసర బ్యాలన్స్ కింద క్రెడిట్ అవుతుంది. అలాగే ఇంటర్నెట్ డేటా కోసం *141*567# డయల్ చేస్తే మీకు ‘ఒకరోజు’ చెల్లుబాటయ్యేలా 30 MB డేటా క్రెడిట్ అవుతుంది. ఆ తర్వాత మీరు రీచార్జి చేసుకున్నపుడు లోన్ రుసుముకింద రూ.15 తగ్గించబడుతుంది.
IDEA LOAN NUMBER
ఐడియా నెట్‌వర్క్‌లో మాత్రం మీరు సిమ్‌ను 90 రోజులు వాడుకున్న తర్వాతే మాత్రమే ఈ లోన్ సదుపాయానికి అర్హత లభిస్తుంది. అలాగే ఈ ఆపరేటర్ ఒకటికన్నా ఎక్కువ మార్గాల్లో లోన్ సౌకర్యం కల్పిస్తారు. ఆ మేరకు మీరు టాక్‌టైమ్ లోన్ కోసం... *150*10# డయల్ చేయాలి లేదా CREDIT అని టైప్ చేసి 144 నంబరుకు SMS పంపితే రూ.10 రూపాయల టాక్‌టైమ్ లోన్ అందుతుంది. అలాగే *150*20# డయల్ చేస్తే రూ.20 టాక్‌టైమ్, *165*5# డయల్ చేస్తే రూ.5 టాక్‌టైమ్, *444# డయల్ చేస్తే రూ.4 టాక్‌టైమ్ వంతున బ్యాలన్స్ అందుతుంది. అదే ఇంటర్నెట్ డేటా లోన్ కావాలంటే *150*06# డయల్ చేస్తే 25MB 2G డేటా క్రెడిట్ అవుతుంది. అలాగే *150*333# డయల్ చేస్తే 35MB 3G డేటా వస్తుంది. సాధారణంగా మీ టాక్‌టైమ్ బ్యాలన్స్ రూ.2కన్నా తక్కువ ఉన్నపుడు *150*10# డయల్ చేసినా, CREDIT అని టైప్ చేసి 144 నంబరుకు SMS పంపినా రూ.10 టాక్‌టైమ్ క్రెడిట్ అవుతుంది. మీకు రూ.20 టాక్‌టైమ్ లోన్ కావాలంటే *150*20# డయల్ చేయాలి. మీ బ్యాలన్స్ రూ.1కన్నా తక్కువగా ఉన్నపుడు *165*5# డయల్ చేస్తే రూ.5 టాక్‌టైమ్ వస్తుంది. అలాగే *444# డయల్ చేస్తే రూ.4 లోన్ బ్యాలన్స్ వస్తుంది. మీరు ఇంటర్నెట్ డేటా లోన్ కోసం *150*06# డయల్ చేస్తే 25MB 2G డేటా క్రెడిట్ అవుతుంది కదా... ఆ తర్వాత రీచార్జి చేసినపుడు అందులోనుంచి రూ.6 తగ్గించబడుతుంది. అలాగే *150*333# డయల్‌చేసి, 35MB 3G డేటా పొందాక రీచార్జి చేస్తే రూ.11 తగ్గించబడుతుంది.
AIRCEL LOAN NUMBER
ఎయిర్‌సెల్ నెట్‌వర్క్‌లో టాక్‌టైమ్ లోన్ కోసం *414# డయల్ చేయాలి లేదా 12880 నంబరుకు కాల్ చేయొచ్చు. లేదంటే LOAN అని టైప్‌చేసి 55414 నంబరుకు SMS పంపితే రూ.10 టాక్‌టైమ్ అందుతుంది. ఆ తర్వాత రీచార్జి చేసుకున్నపుడు రూ.12 తగ్గించబడుతుంది.
DOCOMO LOAN NUMBER
డొకోమో నెట్‌వర్క్‌లో టాక్‌టైమ్ లోన్‌కోసం *444# లేదా *369# డయల్ చేయాలి. ఇందులో మీకు అనువైన దాన్ని ఎంచుకోవచ్చు. అలాగే ఇంటర్నెట్ డేటా లోన్ కోసం *444# డయల్ చేయాలి లేదా *369# డయల్‌చేసి, కాల్ పంపాలి.
RELIANCE LOAN NUMBER
రిలయెన్స్ నెట్‌వర్క్‌లో టాక్‌టైమ్ లోన్ కోసం *141*5# డయల్ చేస్తే రూ.5 టాక్‌టైమ్ వస్తుంది. అలాగే రూ.10 టాక్‌టైమ్ కావాలనుకుంటే *141*10# డయల్ చేయాలి. లేదా మెసేజ్‌ద్వారా టాక్‌టైమ్ లోన్ పొందాలంటే YCR అని టైప్‌చేసి, 51234 నంబరుకు SMS పంపి, రూ.5 లేదా రూ.10 టాక్‌టైమ్‌ను ఎంపిక చేసుకోవాలి.
గమనిక: ఒకవేళ మీరు BSNL, TELENOR లేదా JIO నెట్‌వర్క్‌ల వినియోగదారులైతే దురదృష్టవశాత్తూ ఆయా కంపెనీలు ఇంకా లోన్ సదుపాయాన్ని ప్రవేశపెట్టలేదు.
Talktime  Data  Networks  Loan