అన్‌లిమిటెడ్ సైజ్ ఫైల్స్‌ను షేర్ చేసే సాఫ్ట్‌వేర్ల‌కు 3వే గైడ్‌

పీసీ నుంచి పీసీకి ఫైల్స్ అందులోనూ పెద్ద సైజ్ ఫైల్స్ షేర్ చేయ‌డం కొద్దిగా త‌ల‌నొప్పి వ్య‌వ‌హార‌మే. అయితే ఎంత పెద్ద ఫైల్‌న‌యినా పీసీ నుంచి షేర్ చేయ‌డానికి సాఫ్ట్‌వేర్లు చాలానే ఉన్నాయి. వీటి ద్వారా మీరు ఐఎస్‌వో ఫైల్స్‌, డీవీడీలు, మ్యూజిక్ ఫైల్స్‌, లార్జ్ ఈఎక్స్ఈ, బిన్ ఫైల్స్‌తో స‌హా ఎలాంటి ఫైల్ అయినా ఎంత పెద్ద ఫైల్ అయినా షేర్ చేసుకోవ‌చ్చు. ఎలాంటి ఫైల్స్ సెట్టింగ్స్‌, క‌న్ఫిగ‌రేష‌న్లు మార్పు లేకుండా ఫైల్స్‌ను షేర్ చేసుకునే వీలుంది. అలాంటి వాటిలో బెస్ట్ 3 సాఫ్ట్‌వేర్ల గురించి మీ కోసం..

ఓ అండ్ ఓ ఫైల్ డెరెక్ట్ (O&O FileDirect)
ఎంత పెద్ద ఫైల్ అయినా షేర్ చేయ‌డానికి బెస్ట్ సాఫ్ట్‌వేర్ల‌లో ఫ‌స్ట్ చెప్పుకోవాల్సింది ఓ అండ్ ఓ ఫైల్ డెరెక్ట్ గురించే.  ఎందుకంటే ఇక్క‌డ చెప్పుకునే మూడింట్లో కూడా ఇది చాలా ఈజీ అండ్ ప‌వ‌ర్‌ఫుల్ టూల్‌. ఫైల్ పంపేవారు ఈ సాప్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని ఫైల్స్ యాడ్ చేసి, షేరింగ్ యూఆర్ఎల్  జ‌న‌రేట్ చేయాలి. ఆ యూఆర్ఎల్‌ను షేర్ చేస్తే ఒకేసారి ఎంత మంది రిసీవ‌ర్ల‌యినా దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.  

* క్రోమ్‌, ఫైర్‌ఫాక్స్‌లాంటి మోడ్ర‌న్ బ్రౌజ‌ర్స్ అన్నింటిలోనూ ఈ ఓ అండ్ ఓ ఫైల్ డెరెక్ట్ సాఫ్ట్‌వేర్ ప‌నిచేస్తుంది.  ఎలాంటి అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. 

* దీంతో ఒకేసారి అన్‌లిమిటెడ్ పైల్స్‌ను షేర్ చేయొచ్చు.  ఒక్కో ఫైల్ సైజ్ ఎంత పెద్ద‌గా ఉన్నాస‌రే ప‌రవాలేదు. 

* అంతేకాదు రిసీవ‌ర్ ఈ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన ప‌ని కూడా లేదు. 

* మీరు షేర్ చేసిన యూఆర్ఎల్‌ను ఉప‌యోగించుకుని అవ‌త‌లి వ్య‌క్తి ఆ ఫైల్‌ను పీసీ, ల్యాపీ, ట్యాబ్‌, ఆఖ‌రికి స్మార్ట్‌ఫోన్లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. 

ఫోల్డ‌ర్ నెట్ (FolderNet)
అన్‌లిమిటెడ్ సైజ్ ఫైల్స్‌ను షేర్ చేయ‌డానికి మ‌రో మంచి ఆప్ష‌న్ ఫోల్డ‌ర్ నెట్ (FolderNet) సాఫ్ట్‌వేర్‌.  దీంతో ఒకేసారి అన్‌లిమిటెడ్ పైల్స్‌ను షేర్ చేయొచ్చు.  ఒక్కో ఫైల్ సైజ్ ఎంత పెద్ద‌గా ఉన్నాస‌రే ప‌రవాలేదు. అయితే ఈ సాఫ్ట్‌వేర్ ప‌నితీరు కొద్దిగా డిఫ‌రెంట్‌గా ఉంటుంది.  ఎందుకంటే ఇందులో  ఫైల్స్‌ను డైరెక్ట్‌గా షేర్ చేయ‌లేం.  ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఫైల్స్‌ను యాడ్ చేస్తే మీ పీసీలో ఒక వ‌ర్చువ‌ల్ డిస్క్ క్రియేట్ అవుతుంది. ఆ త‌ర్వాత మీ రిసీవ‌ర్ కూడా ఫోల్డ‌ర్ నెట్ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసుకుని మీ లాగిన్ డిటెయిల్స్‌తో సైన్ ఇన్ అయితే అత‌ని పీసీలో కూడా మీరు క్రియేట్ చేసిన వ‌ర్చువ‌ల్ డిస్క్  క‌నిపిస్తుంది. దాన్ని యాక్సెస్ చేసి ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఎన్ని ఫైల్స్ షేర్ అయ్యాయో ప్రివ్యూ కనిపిస్తుంది. వాటిని కాపీ చేసి పేస్ట్ చేసుకుంటే ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది. 

క్లౌడ్ టాగ్ (Cloudtag)
ఇక మూడోది క్లౌడ్ టాగ్ సాఫ్ట్‌వేర్‌. దీన్ని మీ ఫేస్‌బుక్ అకౌంట్‌తో లాగిన్ అయి ఫైల్స్ షేర్ చేసుకోవ‌చ్చు. త‌ర్వాత యూనిక్ హ్యాష్‌ట్యాగ్‌తో ఫైల్స్ షేర్ చేసుకోవ‌చ్చు.అయితే మీరు ఫైల్ అప్‌డేట్ చేయ‌గానే ప‌బ్లిక్ అంద‌రికీ అందుబాటులోకి వ‌చ్చేస్తుంది. అందుకే మీరు దీనికి ఎవ‌రూ గెస్ చేయ‌లేని ట‌ఫ్ హ్యాష్ ట్యాగ్ పెట్టాలి.  మీకు హ్యాష్‌ట్యాగ్ వ‌చ్చాక పైల్‌ను సాఫ్ట్‌వేర్ ఇంట‌ర్‌ఫేస్‌లోకి డ్రాగ్ చేయాలి. ఫైల్ సైజ్‌, ఇంట‌ర్నెట్ స్పీడ్‌ను బ‌ట్టి ఇది అప్‌లోడ్ అవుతుంది. మీ ఫైల్ రిసీవ్ చేసుకునే వ్య‌క్తి కూడా త‌న పీసీలో Cloudtag సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని మీరిచ్చిన హ్యాష్‌టాగ్‌ను ఎంట‌ర్ చేస్తే ఆ  ఇంట‌ర్‌ఫేస్‌లోకి వ‌స్తారు. అప్పుడు అత‌నికి కూడా మీరు షేర్ చేసిన ఫైల్ క‌నిపిస్తుంది. దాన్ని డ్రాగ్ చేసి మీకు కావాల్సిన ఫోల్డ‌ర్‌లో డ్రాప్ చేసుకోవ‌చ్చు. 

అన్‌లిమిటెడ్ సైజ్ ఫైల్స్ షేరింగ్‌ ఓ అండ్ ఓ ఫైల్ డెరెక్ట్  ఫోల్డ‌ర్ నెట్  క్లౌడ్ టాగ్ Unlimited size file sharing soft wares  Cloudtag  FolderNet O&O FileDirect