స్కామ్ మెయిల్స్ మనందరికీ తెలిసిన అంశమే. ఎందుకంటే ఈ మెయిల్ ద్వారా మిమ్మల్ని బుట్టలో పడేయడం ఈజీ. ఎప్పుడయినా మెయిల్ చేయొచ్చు. అందుకే స్కామర్లు ఈ మెయిల్ను బాగా వినియోగించుకుంటున్నారు. ఇలాంటి స్కామ్ మెయిల్స్ బుట్టలో పడకుండా ఏం చేయాలో చెప్పేఈ గైడ్ మీ కోసమే..
ఏమిటీ స్కామ్ మెయిల్స్?
సాధారణంగా ఈ స్కామ్ మెయిల్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మీ పర్సనల్ లేదా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అడిగేవి. అంటే పిషింగ్ మెయిల్స్ అన్నమాట. ఇక రెండో రకం ఏదైనా మాల్వేర్ను మీ సిస్టంలో చొప్పించేలా ఉన్న లింక్స్తో కూడినవి. ఈ రెండింటిలో ఏ రకమైనా ప్రమాదకరమే.
ఎలా గుర్తించాలి?
1. మీరు ఏమాత్రం ఊహించని విషయం ఉంటే ఆ మెయిల్ను అనుమానించాల్సిందే. అంటే బాగా మంచిగా, అత్యంత ఆసక్తి, ఆశ్చర్యం, ఆశ కలిగించేలా కంటెంట్ తయారుచేసి ఇలాంటి మెయిల్స్ను తయారుచేస్తారు. ఉదాహరణకు గెట్ వన్ క్రోర్ ఇన్ 1 మంత్, జాబ్ ఆపర్చ్యూనిటీస్, ఫ్రీ హాలీడే ట్రిప్స్ ఇలాంటి సబ్జెక్ట్లతో ఎక్కువగా మెయిల్స్ వస్తుంటాయి. ఇలాంటి వాటిలో ఆఫర్ మీకు వర్తిస్తుందో లేదో చెప్పడానికి మీ వివరాలు అడుగుతుంటారు.
2. అలాంటప్పుడు వెంటనే ఆ మెయిల్లో చెబుతున్న సంస్థ ఉందా లేదా ఆన్లైన్లో సెర్చ్ చేయండి. అందులో ఏదైనా ఫోన్ నెంబర్ ఇచ్చి ఉంటే ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా కూడా సెర్చ్ చేయండి. రెండు, మూడు సార్లు చెక్ చేసుకోండి. మీకు ఆ ఆఫర్ లేదా అందులో విషయం నిజమని నమ్మకం కలిగితే అందులో ఏదైనా ఫోన్ నెంబర్ ఇస్తే కాంటాక్ట్ చేయండి.
3. ఇలాంటి ఊరూపేరూ లేని వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చే ఈమెయిల్స్లో ఉన్న అటాచ్మెంట్స్ డౌన్లోడ్ చేయడం లేదా లింక్స్ను క్లిక్ చేయడం చేయకండి.
4. వ్యక్తిగత, ఫైనాన్షియల్ వివరాలడిగే మెయిల్స్కు అసలు రెస్పాండ్ అవకండి.
5. మీ డివైస్ (పీసీ, ల్యాపీ, స్మార్ట్ఫోన్)లను ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్తో అప్డేట్ చేసుకోండి.
6. “Dear Customer” లాంటి కామన్ వర్డ్స్తో ఈమెయిల్ స్టార్టయితే అనుమానించాల్సిందే. మీరు తెలిసిన పర్సన్, మీ డిటెయిల్స్ ఉన్న పర్సన్ అయితే పేరుతోనే సంబోధిస్తారు.
7. జిఫ్ ఫైల్స్, ..exe లాంటి అటాచ్మెంట్స్ ఉన్న మెయిల్స్ (అవి మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నవాళ్ల నుంచి వస్తే తప్ప)ను తెరవకండి.
స్కామ్ మెయిల్స్ వస్తే ఏం చేయాలి?
మీరు ఒకవేళ స్కామ్ మెయిల్ రిసీవ్ చేసేసుకున్నారనుకోండి. అలాంటప్పుడ
1. ఆ మెయిల్ను తెరవకండి. దాన్ని మీ ఇన్బాక్స్ నుంచి డిలీట్ చేయండి.
2. అనుమానాస్పదంగా ఉన్న ఈమెయిల్ వస్తే దానికి రిప్లయి ఇవ్వకండి. ఎలాంటి ఎటాచ్మెంట్స్ లేదా లింక్స్ను క్లిక్ చేయకండి.
3. పొరపాటున లింక్ను క్లిక్ చేస్తే అది వేరే వెబ్సైట్కు మిమ్మల్ని డైరెక్ట్ చేస్తుంది. అక్కడ మీ వివరాలేవీ ఆ సైట్లో ఎట్టిపరిస్థితుల్లోనూ ఎంటర్ చేయొద్దు.
4. మీ పీసీలో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ను అప్డేట్గా ఉంచుకోండి. అప్పుడు మీరు ఒకవేళ పొరపాటున ఏదైనా వైరస్ ఉన్న అటాచ్మెంట్స్ను డౌన్లోడ్ చేసినా లింక్ క్లిక్ చేసినా అది రక్షిస్తుంది.
స్కామ్ మెయిల్స్ బారిన పడితే?
ఒకవేళ మీరు ఇలాంటి స్కామ్ మెయిల్స్ బారినపడితే ముందు ప్రశాంతంగా ఉండండి.
2. వాళ్లు మిమ్మల్ని ఏం వివరాలడిగారు? మీరు వాళ్లకు ఏం వివరాలిచ్చారో కూల్గా గుర్తు తెచ్చుకోండి. వాటిని వెంటనే ఓ పేపర్ మీద రాసుకోండి.
3 మీరు క్రెడిట్ కార్డ్ నెంబర్, డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ డిటెయిల్స్ కనుక ఇచ్చి ఉంటే వాటిని భవిష్యత్తులో కూడా తరచూ చెక్ చేసుకోవాలి. 4. యూజర్ నేమ్స్, పాస్వర్డ్లు ఇచ్చి ఉంటే వెంటనే వాటిని మార్చేయండి.
5. మీ డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ నెంబర్, కాంటాక్ట్ డిటెయిల్స్ ఇచ్చి ఉంటే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ను సంప్రదించండి. మీరు ఐడెంటిటీ థెఫ్ట్ నుంచి ఎలా బయటపడాలో వాళ్లు గైడ్ చేస్తారు.
cyber security scams Scam mails pishing mails cyber crime Data breach à°¸à±à°•ామౠమెయిలà±à°¸à±â€Œ పిషింగౠమెయిలà±à°¸à±â€Œ సైబ‌రౠకà±à°°à±ˆà°®à±â€Œ డేటా చౌరà±à°¯à°‚