ఫేస్ బుక్,ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ ల వద్ద ఉన్న మనడేటా మొత్తాన్ని డౌన్ లోడ్ చేసుకోవడానికి గైడ్

వివిధ రకాల సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం లైన ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ , గూగుల్ మొదలైన వాటిలో మీ కార్యకలాపాలకు సంబందించిన డేటా ను డౌన్ లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ ఆర్టికల్. వివిధ రకాల సోషల్ మీడియా లలో ఉన్న మీ డేటా ని డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా అనే అంశం పై రెండు ఆర్టికల్ లను మీకోసం ఇస్తున్నాం. అందులో మొదటి పార్ట్ ఈ రోజు ఇవ్వబడుతుంది.

ఫేస్ బుక్ డేటా ను డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా ?

  1. మీ ఫేస్ బుక్ డేటా రిపోర్ట్ ను జనరేట్ చేసుకోవాలి అంటే మీరు ఫేస్ బుక్ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ సదుపాయం మొబైల్ యాప్స్ లో అందుబాటులో ఉండదు.
  2. లాగిన్ అయ్యిన తర్వాత కుడివైపు పై కార్నర్ లో ఉండే చిన్న బాణం గుర్తు పై క్లిక్ చేయాలి. సెట్టింగ్స్ లోనికి వెళ్ళాలి.
  3. ఇందులో జనరల్ పేజి లోపల “డౌన్ లోడ్ ఎ కాపీ ఆఫ్ యువర్ ఫేస్ బుక్ డేటా”  అని ఒక లింక్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.
  4.  తరవాతి స్క్రీన్ లో మీకు ఏ విధమైన సమాచారం కావాలో అంటే మెసేజ్ లు, పోస్ట్ లు, కాంటాక్ట్స్ ఇలా నిర్దిష్టం గా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీకు కావలసిన దానిని సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్నీ ఒకేసారి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు.
  5. మీ దగ్గర తక్కువ డేటా ఉన్నట్లయితే మీడియా క్వాలిటీ ని కూడా మార్చుకోవచ్చు.
  6. పూర్తి అయిన తర్వాత క్రియేట్ ఫైల్ అనే బటన్ పై క్లిక్ చేయాలి. అంతే మీకు కావలసిన డేటా డౌన్ లోడ్ చేయబడుతుంది.

ఇన్ స్టా గ్రామ్ డేటా ను డౌన్ లోడ్ చేయడం ఎలా

  1. ఇన్ స్టా గ్రామ్ డేటా ను డౌన్ లోడ్ చేయడానికి మీ క్రెడెన్షియల్స్ తో https://www.instagram.com/accounts/login/?next=/download/request/ లింక్ ను ఓపెన్ చేయాలి.
  2. మీ ఈమెయిలు ఐడి ని ఎంటర్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి.
  3. ఇప్పుడు మీరు మీ పాస్ వర్డ్ ను మరొక్క సారి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి.
  4. అంతే మీ ఇన్ స్టా గ్రాం డేటా డౌన్ లోడ్ చేయబడుతుంది.

ట్విట్టర్  డేటా ను డౌన్ లోడ్ చేయడం ఎలా ?

  1. మొదటగా మీ ట్విట్టర్ ఎకౌంటు లోనికి లాగిన్ అవ్వాలి.
  2. కుడి వైపు పై భాగం లో క్లిక్ చేసి సెట్టింగ్స్ లోనికి వెళ్ళాలి.
  3. అకౌంట్స్ ట్యాబ్ లో క్రిందకు స్క్రోల్ చేస్తే రిక్వెస్ట్ యువర్ ఆర్కైవ్ అని ఒకటి వస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
  4. అంతే మీ ట్విట్టర్ ఎకౌంటు లో ఉన్న డేటా అంతా డౌన్ లోడ్ చేయబడుతుంది.

data download social media facebook instagram twitter