అమెజాన్ యాప్‌లో గ్యాస్ సిలెండ‌ర్ బుక్ చేసుకోవ‌డానికి సింపుల్ గైడ్ 

ప్ర‌తి నెలా గ్యాస్ సిలెండ‌ర్ బుక్ చేయ‌డం ప్ర‌తి ఇంట్లోనూ కామ‌నే.  గ్యాస్ డీల‌ర్‌కు ఫోన్ చేసి  సిలిండర్ బుక్ చేసి డెలివరీ వ‌చ్చాక బాయ్‌కు డ‌బ్బులిస్తారు చాలామంది. కొంత‌మంది గ్యాస్ కంపెనీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా సిలెండ‌ర్ బుక్ చేసి ఆన్‌లైన్ పేమెంట్ కూడా చేస్తున్నారు.   ఇప్పుడు ప్రముఖ ఈ కామ‌ర్సు కంపెనీ అమెజాన్‌లో కూడా గ్యాస్ బుక్ చేసుకునే అవ‌కాశం వ‌చ్చింది.  మొదటిసారి అమెజాన్‌లో గ్యాస్ బుక్ చేసుకున్నవారు అమెజాన్ పే ద్వారా చెల్లిస్తే  రూ.50 క్యాష్‌బ్యాక్ కూడా వ‌స్తుంది.  

అమెజాన్‌ ద్వారా గ్యాస్ బుక్ చేసుకోవ‌డానికి…
1.  అమెజాన్‌.ఇన్ వెబ్‌సైట్ లేదా యాప్ ఓపెన్  చేయండి.
2. అందులో అమెజాన్ పే ఆప్షన్‌పై క్లిక్ చేయండి
3. త‌ర్వాత రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్స్ బటన్ ప్రెస్ చేయండి. 
4. ఇందులో గ్యాస్‌ సిలిండర్ ఐకాన్ క‌నిపిస్తుంది. దాన్ని  క్లిక్ చేయండి.
5. ఇప్పుడు మీరు వాడుతున్న గ్యాస్ ఏ కంపెనీదో (హెచ్‌పీ, ఇండేన్‌, భార‌త్‌ల‌లో ఏదో ఒక‌టి) దాన్ని క్లిక్ చేయండి.
6. ఇప్పుడు మీ  గ్యాస్ ఏజెన్సీని సెలెక్ట్ చేసుకోవాలి.
7. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, బిల్లు చెల్లించండి.
8. అంతే మీ గ్యాస్ సిలెండ‌ర్ బుకింగ్ పూర్త‌యిపోయింది..  

అమెజాన్ అమెజాన్‌లో గ్యాస్ బుకింగ్‌ ఆన్‌లైన్‌లో గ్యాస్ సిలెండ‌ర్ బుకింగ్‌ book Gas cylinder in Amazon Amazon Gas booking