ఆండ్రాయిడ్ ఫోన్ డేటాని ఆటోమెటిక్‌గా గూగుల్ వ‌న్‌కి బ్యాక్అప్ చేయ‌డానికి సింపుల్ గైడ్‌

గూగుల్ డ్రైవ్‌కు ప్ర‌త్యామ్యాయంగా గ‌తేడాది గూగుల్ సంస్థ గూగుల్ వ‌న్‌ని ప‌రిచ‌యం చేసింది.  ఈ గూగుల్ వ‌న్ ద్వారా అద‌నంగా ఆన్ లైన్ స్టోరేజ్ ప్ర‌యోజనం క‌లుగుతుంది. కాక‌పోతే ఇందుకోసం మంత్లీ లేదా అన్యువ‌ల్ స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ వ‌న్ మ‌ల్టీమీడియో బ్యాక‌ప్‌ని స‌పోర్ట్ చేస్తుంది. ఎస్ఎంఎస్‌, కాంటాక్ట్స్‌, కాల్ లాగ్స్, యాప్ డేటా లాంటి వాటిని ఇది దాచి ఉంచుతుంది. మ‌రి ఆండ్రాయిడ్ ఫోన్ డేటాని ఆటోమెటిక్‌గా గూగుల్ వ‌న్‌కి బ్యాక్ అప్ ఎలా చేయాలో చూద్దాం..

ఏం చేయాలంటే.. 
మీ డేటా ఆటోమెటిక్‌గా బ్యాక‌ప్ కావాలంటే ముందుగా గూగుల్ వ‌న్‌ని స‌బ్‌స్క్రిప్ష‌న్ చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్లి మీ ఫోన్లో ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యాప్‌ని ఓపెన్ చేయ‌గానే దీనిలో బ్యాక్ అప్ ఫీచ‌ర్లు క‌నిపిస్తాయి. ఒక‌వేళ అక్క‌డ క‌న‌బ‌డ‌క‌పోతే మీరు సెట్టింగ్స్‌లోకి వెళ్లి చూడొచ్చు.  ఇందులో మూడు ఆప్ష‌న్లు ఉంటాయి. ఒక‌టి డివైజ్ డేటా, రెండోది మ‌ల్టీమీడియా మెసేజ్‌లు, మూడోది ఫొటోస్‌, వీడియోస్ వీటన్నిటిని మీరు బ్యాక్ అప్ చేసుకోవ‌చ్చు. 

రిస్టోర్ బ్యాక్ అప్‌
డివైజ్ డేటా, మ‌ల్టీమీడియో మెసేజ్‌లు, ఫొటోస్‌, వీడియోస్ వీటిలో మీకు అవ‌స‌మైన వాటిని ఎంచుకోవాలి. అవ‌స‌రం లేని వాటిని స్కిప్ చేసుకోవ‌చ్చు. అందుకోసం బ్యాక్ అప్ నౌ బ‌ట‌న్ మీద క్లిక్ చేయాలి. బ్యాక్ అప్ పూర్త‌యిన త‌ర్వాత మీకు రీస్టోర్ బ్యాక్ అప్ అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. ఆ త‌ర్వాత ఈ యాప్ ఆటోమెటిక్‌గా డేటాను బ్యాక్ అప్ చేస్తుంది. ఒక‌వేళ డేటా అప్‌డేట్ అయితే మీకు అప్‌టు డేట్ అనే మెసేజ్ క‌నిపిస్తుంది. 

AUTOMATICALLY BACKUP ANDROID PHONE GOOGLE ONE