ఆండ్రాయిడ్ 10కి అప్‌గ్రేడ్ అవ‌డానికి ఫ‌స్ట్ గైడ్‌

ఆండ్రాయిడ్ త‌న లేటెస్ట్ వెర్ష‌న్ ఆండ్రాయిడ్‌10కి స్టేబుల్ వెర్ష‌న్ గ‌త నెల 3న రిలీజ్ చేసింది. మార్చి నెల‌లో బీటా వెర్ష‌న్‌గా రిలీజ‌యిన ఆండ్రాయిడ్ 10లో చాలా అడ్వాన్స్‌డ్ ఫీచ‌ర్లున్నాయి.  లైవ్ క్యాప్ష‌న్‌, స్మార్ట్ రిప్ల‌యి,డార్క్ మోడ్‌, కొత్త గెస్చ‌ర్ నావిగేష‌న్స్‌, ఫోక‌స్ మోడ్‌, ఫ్యామిలీ లింక్‌, కొత్త ప్రైవ‌సీ కంట్రోల్స్ ఆండ్రాయిడ్ 10లో మ‌న‌కు కొత్త‌గా వ‌చ్చాయి.

ఏయే ఫోన్ల‌కు ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్ వ‌స్తుంది?

గూగుల్ పిక్సెల్
గూగుల్ పిక్సెల్‌, పిక్సెల్ ఎల్‌, పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్స్ ఎల్‌, పిక్సెల్ 3, పిక్సెల్ 3 ఎక్స్ ఎల్‌, పిక్సెల్ 3ఏ, పిక్సెల్ 3ఏ ఎక్స్ఎల్‌

 శాంసంగ్
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 10, గెలాక్సీ ఎస్ 10 ఈ, గెలాక్సీ ఎస్ 10 ప్ల‌స్‌, ఎస్ 10  5జీ ఫోన్ల‌కు మాత్ర‌మే ఆండ్రాయిడ్ 10 బీటీ వెర్ష‌న్ వ‌చ్చింది.  ఈ ఎస్ 10 సిరీస్ ఫోన్ల‌కు స్టేబుల్ అప్‌డేట్ వ‌స్తుందా లేదా అనేది ఇంకా తెలియ‌లేదు.

వ‌న్‌ప్ల‌స్‌
వ‌న్‌ప్ల‌స్ 7, వ‌న్‌ప్ల‌స్ 7 ప్రోల‌కు ఆండ్రాయిడ్ 10 ఓఎస్ అప్‌డేట్ వ‌చ్చింది. పాత వ‌న్‌ప్ల‌స్ 6, వ‌న్‌ప్ల‌స్ 6టీల‌కు కూడా త్వ‌ర‌లో రాబోతుంది.

నోకియా
నోకియా 8.1 ఫోన్ల‌కు ఆండ్రాయిడ్ 10 అందుబాటులో ఉంది. నోకియా 7.1, నోకియా 9 ప్యూర్ వ్యూల‌కు కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంది. నోకియా 6.1, 6.1 ప్లస్‌, 7 ప్ల‌స్‌లకు కూడా వ‌చ్చే సంవ‌త్స‌రం ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్ రావ‌చ్చు.

రెడ్‌మీ
రెడ్‌మీ కే 20 ప్రోలో ఎంఐయూఐ 11 ఓఎస్ ఉంది. దీనిలో చాలావ‌ర‌కు ఆండ్రాయిడ్ 10 ఫీచ‌ర్లే ఉన్నాయి.  రెడ్‌మీ 7, రెడ్‌మీ నోట్ 7, రెడ్‌మీ నోట్ 7 ప్రోల‌కు కూడా ఈ ఎంఐయూఐ 11 ఓఎస్ రావ‌చ్చు.

హువావే
హువావేలో 33 డివైస్‌ల‌కు ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్ రాబోతోంది. ఇందులో కొన్ని హాన‌ర్ ఫోన్లు కూడా ఉండ‌బోతున్నాయి. తొలిగా హువావే మేట్ 20 ప్రోకి  అందుబాటులోకి రానుంది.

ఆండ్రాయిడ్ 10 ఎలా అప్‌డేట్ చేసుకోవాలి?
మీ ఫోన్‌కు ఆండ్రాయిడ్ 10 వ‌చ్చే అవ‌కాశం ఉంటే అప్‌డేట్ వ‌చ్చిన‌ట్లు నోటిఫికేష‌న్ వ‌స్తుంది. లేదంటే మీరు ఫోన్లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి అబౌట్ ఫోన్ సెక్ష‌న్‌లోకి వెళ్లి మీ ఫోన్‌ను అప్‌డేట్ చేయండి. ఆండ్రాయిడ్ 10 అప్‌గ్రేడ్ అందుబాటులో ఉంటే దాన్ని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు.

guide for upgrading to Android 10 ఆండ్రాయిడ్ 10 గూగుల్ పిక్సెల్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ 10 హువావే మేట్ 20 ప్రో వ‌న్‌ప్ల‌స్ 7 వ‌న్‌ప్ల‌స్ 7 ప్రో