దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ కొనసాగుతోంది. ఏప్రిల్, మే నెలల్లో దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఐదేండ్లకు ఒకసారి జరిగే ఎన్నికలు దేశ భవిష్యత్తును మారుస్తాయి. వచ్చే ఐదేళ్లలో ఏ రాజకీయ పార్టీకి అధికారం కట్టబెడతారన్నది ప్రజల ఓటుతో తెలుస్తుంది. అయితే దేశ పౌరులుగా ఓటు వేయడం మనందరి బాధ్యత. అందుకే ఎన్నికల కంటే ముందే ఓటర్ల జాబితాతో మీరు పేరు ఉందో లేదో ఓసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఓటరు జాబితాతో మీ పేరులో లేనట్లయితే...నమోదు చేసుకోవడానికి ఈ కింది పద్దతుల ద్వారా అప్లయ్ చేసుకోండి.
ఇండియాలో ఓటు వేయడానికి అర్హుడినా?
మీరు భారతదేశంలో ఓటు వేయడానికి అర్హులా కాదా అనే విషయాన్ని మొదటగా తెలుసుకోవాలి.
ఓటరుగా నమోదు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు....
భారతదేశంలో మీరు ఓటును వినియోగించుకోవాలంటే ఈ మూడు మీకు చాలా ముఖ్యమైనవి.
1. పాస్ పోర్టు సైజ్ ఫోటో గ్రాఫ్.
2. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్.
*మీరు చదువుకున్న ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పాఠశాల నుంచి బర్త్ సర్టిఫికేట్.
*పదవ తరగతి మార్క్స్ షీట్
*ఎనిమిదవ తరగతి లేదా ఐదవ తరగతి మార్క్ షీట్స్
*ఇండియన్ పాస్ పోర్ట్
* పాన్ కార్డ్
* డ్రైవింగ్ లైసెన్స్
*ఆధార్ కార్డ్
3. నివాస రుజువు పత్రాలు...కింద పేర్కొన వాటిలో ఏదైనా ఒకటి.
* బ్యాంక్/ కిసాన్/ పోస్ట్ ఆఫీస్ కరెంట్ పాస్ బుక్
*రేషన్ కార్డ్
*పాస్ పోర్ట్
*డ్రైవింగ్ లైసెన్స్
* ఇన్కమ్ ట్యాక్స్ ఆసిస్మెంట్ ఆర్డర్
*రెంట్ అగ్రిమెంట్
*వాటర్ బిల్లు/ టెలిఫోన్/ ఎలక్ట్రిక్ సిటి బిల్లు/ గ్యాస్ కనెక్షన్ బిల్లు మీ పర్మినెంట్ అడ్రస్ ను తెలిపేది.
* పోస్ట్ డిపార్ట్ మెంట్ నుంచి మీ పర్మినెంట్ అడ్రస్సుకు వచ్చిన పోస్టు, లెటర్, మెయిల్ ఏదైనా సరే.
4. ఎలా రిజిస్టర్ చేసుకోవాలి.....
* జాతీయ ఓటర్ సేవల పోర్టల్ (NVSP) వెళ్లి...కొత్త ఓటరు నమోదు పేజికి వెళ్లండి. FORM6 తీసుకుని దాన్ని పూర్తిగా నింపాక ఫోటోను అతికించండి. వయస్సు ధ్రువీకరణ పత్రంతో పాటు అడ్రస్ ను జతపర్చండి. ఇప్పుడు సబ్ మిట్ బటన్ను క్లిక్ చేయండి.
ఆన్ లైన్లో ఓటు ఐడి కార్డు వివరాలను ఎలా అప్ డేట్ చేయాలి.....
1. NVSP ఓటరు ఐడి కార్డ్ కరెక్షన్స్ పేజికి వెళ్లండి. NVSP వెబ్ సైట్ను ఓపెన్ చేశాక ఎలక్షన్ రోల్ లో నమోదుల సవరణ ఆప్షన్ కు స్కోల్ చేసి FORM8పై క్లిక్ చేయండి.
2. ఇప్పుడు పత్రాన్ని నింపండి. నింపాల్సిన ఖాళీలన్నింటిని పూరించండి. ఖాళీలను సరిదిద్దాక ఎంటర్ నొక్కండి.
ఆన్ లైన్లో ఓటరు ఐడీ కార్డు స్టేటస్ ఎలా చెక్ చేయాలి....
మీరు ఆన్ లైన్లో ఓటరు ఐడీ కార్డు కోసం అప్లై చేసుకున్నట్లయితే...NVSPఓటరు ఐడీ కార్డు అప్లికేషన్ స్టేటస్ పేజీకి వెళ్లచ్చు లేదా NSVP వెబ్ సైట్ కు వెళ్లొచ్చు. అప్లికేషన్ స్టేటస్ ను ట్రాక్ చేయడానికి స్క్రోల్ చేసిన తర్వాత...అప్లికేషన్ స్టేటస్ పై క్లిక్ చేయండి. ఒకవేళ ఈ పేజీ డౌన్ లోడ్ కానట్లయితే....మరలా ప్రయత్నించండి. ఎస్ఎంఎస్ ద్వారా ఓటరు ఐడి అప్లికేషన్ స్టేటస్ ను చేక్ చేసుకోవచ్చు.
2019 ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే....
1. NVSP ఎలక్షన్ పేజీకి వెళ్లి సెర్చ్ చేయండి.
2. మీ ఓటరు ఐడీ కార్డు ఉన్నట్లయితే EPICనెంబర్ ద్వారా సెర్చ్ చేయవచ్చు. ఓటరు ఐడీలో పేర్కొన్న EPICనెంబర్ ఎంటర్ చేసి...సెర్చ్ చేయండి
ఇండియాలో ఆన్ లైన్ ఓటు వేయవచ్చా?
ఆన్ లైన్ ద్వారా ఓటు వేసే ప్రక్రియ ఇప్పటివరకు భారతదేశంలో లేదు.
à°“à°Ÿà°°à± à°à°¡à°¿ ఓటౠఇండియా లోకౠసఠఎలకà±à°·à°¨à±à°¸à± 2019 voter ID vote india loksabha elections 2019